ఆన్‌లైన్‌లో రిలయన్స్ సిమెంట్

Posted By:

అనిల్ అంబానికి చెంది రిలయన్స్ సిమెంట్ కంపెనీ ఆన్‌లైన్‌లో సిమెంట్ అమ్మకాలను ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో సిమెంట్‌ను కొనదలచిన వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి లాగినై కనీసం 25 బస్తాల సిమెంట్ కొనుగోలు కోసం ఆర్డర్ పెట్టాలని రిలయన్స్ తెలిపింది. ఆర్డర్ చేసిన వారికి 48 గంటల్లో సిమెంట్ సరఫరా కాబడుతుందని సంస్థ పేర్కొంది.

ఆన్‌లైన్‌లో రిలయన్స్ సిమెంట్

Read More : వింత శవం..?

ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రాల్లో రిలయన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలో బిహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లోనూ రిలయన్స్ సిమెంట్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రిలయన్స్ సిమెంట్ భారత్‌లో మొట్టమొదటి ఈ-కామర్స్ సిమెంట్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అతుల్ దేశాయ్ తెలిపారు.

English summary
Now buy cement online!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot