రిలయన్స్ అన్‌లిమిటెడ్ వైర్‌లెస్‌ నెట్ నెలకు రూ169 మాత్రమే

By Super
|
రిలయన్స్ అన్‌లిమిటెడ్  వైర్‌లెస్‌ నెట్ నెలకు రూ169 మాత్రమే
న్యూఢిల్లీ: సెమీ-అర్బన్‌ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో తమ ప్రి-పెయిడ్‌ వైర్‌లెస్‌ చందాదారులకు నెలకు రూ.169 రుసుముకే అపరిమిత అంతర్జాల వినియోగం సౌకర్యాన్ని సమకూర్చనున్నట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) తెలిపింది. అగ్రగామి 1,000 పట్టణాలలో మినహా మిగిలిన దేశం అంతటా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ప్రి-పెయిడ్‌ వినియోగదారులకు రిలయన్స్‌ నెట్‌కనెక్ట్‌ యూఎస్‌బీ స్టిక్‌ మోడెం రుసుమును రూ.1,099కి తగ్గించినట్లు ఆర్‌కామ్‌ పేర్కొంది.

ఈసందర్బంలో రిలయన్స్ సిబ్బంది మాట్లాడుతూ మేము ప్రవేశపెట్టినటువంటి ఈ వైర్ లెస్ నెట్ ద్వారా ఇండియా వైర్ ఫ్రీ దేశంగా పిలవబడుతుంది. దీన వలన ఇండియా టెలికామ్ సర్వీసెస్‌లలో ఓ విప్లవానికి నాంది పలికినట్లు అవుతుందన్నారు. అతి తక్కువ ఖర్చులో ఇలాంటి సౌకర్యం అందిస్తుంది ఒక్క రిలయన్స్ మాత్రమేనని అన్నారు. ముఖ్యంగా ఈ సర్వీస్ ప్లాను చిన్న పట్టణాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్, హోమ్ మేకర్స్‌కు దృష్టిలో పెట్టుకోని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X