మార్కెట్లోకి తొలి 4జీ ల్యాండ్‌లైన్ ఫోన్

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్‌లో 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయటం విశేషం.

|

4G VoLTE టెక్నాలజీ పై స్పందించే తొలి ల్యాండ్‌లైన్ ఫోన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెగ్యులర్ ల్యాండ్‌లైన్ టెలీఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించటం విశేషం. ఈ హోమ్ బేసిడ్ ఫోన్‌లో అనేక సరికొత్త ఫీచర్లను పొందుపరిచినట్లు రిలయన్స్ చెబుతోంది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే..

Read More : ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ మరింత సేఫ్

ఎక్కడికి కావాలంటే అక్కడికి..

ఎక్కడికి కావాలంటే అక్కడికి..

సాంప్రదాయ ల్యాండ్ లైన్ టెలిఫోన్‌కు దగ్గర పోలికలను కలిగి ఉండే ఈ ఫోన్‌కు ఎటువంటి వైర్ కనెక్షన్ అవసరం ఉండదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లవచ్చు.

వై-ఫై హాట్‌స్పాట్‌గా ఉపయోగించుకోవచ్చు

వై-ఫై హాట్‌స్పాట్‌గా ఉపయోగించుకోవచ్చు

ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన యాంటీనా వ్యవస్థ ఏకకాంలో రెండు పనులను చక్కబెట్టగలదు. వాయిల్స్ కాల్స్‌కు అవసరమైన ఎల్టీఈ సిగ్నల్‌ను తీసుకుంటూనే వై-ఫై సిగ్నల్‌ను ఎమిట్ చేయగలదు. దీంతో ఈ ఫోన్ ఇతర డివైస్ లకు వై-ఫై హాట్‌స్పాట్‌గా ఉపయోగించుకోవచ్చు. ఏకకాలంలో 5 డివైస్‌లకు ఈ ఫోన్ ద్వారా వై-ఫైను సమకూర్చవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 హెచ్‌డి క్వాలిటీలో వాయిస్ కాల్స్‌
 

హెచ్‌డి క్వాలిటీలో వాయిస్ కాల్స్‌

4G VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా హెచ్‌డి క్వాలిటీలో వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఎస్ఎంఎస్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ టీవీకి కూడా ఈ ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.

టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే..

టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే..

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్ లో 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయటం జరిగింది.

ఉచిత వాయిస్ కాల్స్‌..

ఉచిత వాయిస్ కాల్స్‌..

ఈ ఫోన్‌తో పాటుగా ఉచిత వాయిస్ కాల్స్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆఫర్ చేస్తుంది. ఉచిత కాల్స్ పూర్తి అయిన తరువాత నిమిషానికి 40 పైసలు చప్పున కాల్ ఛార్జ్ వసూలు చేస్తారు. ఎస్ఎంఎస్ విషయానికి వచ్చేసరికి లోకల్ ఎస్ఎంఎస్‌లకు 25 పైసలు, ఎస్‌టీడీ ఎస్ఎంఎస్‌లకు 50 పైసలు చప్పున ఛార్జ్ ఉంటుంది.

నెలవారీ ప్లాన్స్..

నెలవారీ ప్లాన్స్..

ఈ ఫోన్ కనెక్షన్ కోసం రెండు ప్రత్యేకమైన నెలవారీ ప్లాన్‌లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటి వివరాలు.. 4జీ స్మార్ట్‌లైఫ్ 299, 4జీ స్మార్ట్‌లైఫ్ 499. మొదటి ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే 300 వాయిస్ కాలింగ్ నిమిషాలతో పాటు 2జీబీ 4జీ డేటా మీకు లభిస్తుంది. రెండవ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే 300 వాయిస్ కాలింగ్ నిమిషాలతో పాటు 4జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Communications Launches Android 4G VoLTE Fixed Wireless Phone with Bundled Data. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X