రిలయన్స్ కాల్ ఛార్జీలు పెంపు!
ఇండియాలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మొబైల్ కాల్ రేట్‌లను 30శాతానికి పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ధర పెంపు జీఎస్ఎమ్ ఇంకా సీడీఎమ్ఏ ప్రీ-పెయిట్ కస్టమర్‌లకు వర్తిస్తుంది. స్పెక్ట్రమ్ ఛార్జీలు పెంపుతో దేశంలోని మొబైల్ ఆపరేటర్లు ఇటీవల కాలంలో కాల్ రేట్‌లను పెంచుతున్న విషయం తెలిసిందే. రిలయన్స్ తాజా చర్యతో మారిన టారిఫ్ ప్లాన్‌ల వివరాలను క్రింద చూడొచ్చు...

ప్లాన్ 21: ఈ ప్లాన్‌లో భాగంగా సెకనుకు 1 పైసాను వసూలు చేసేవారు. తాజా సవరణలో భాగంగా సెకనుకు 1.2పైసలను ఛార్జ్ చేస్తారు.
ప్లాన్ 45: ఈ ప్లాన్‌లో భాగంగా సెకనుకు 1 పైసాను వసూలు చేసేవారు. తాజా సవరణలో భాగంగా సెకనుకు 1.2పైసలను ఛార్జ్ చేస్తారు.
ప్లాన్ 46: ఈ ప్లాన్‌లో భాగంగా 200 లోకల్ ఆన్-నెట్ నిమిషాలను ఆఫర్ చేసేవారు. తాజా సవరణలో భాగంగా 200 లోకల్ నిమిషాలను 140 నిమిషాలకు కుదించారు.
ప్లాన్ 48: ఈ ప్లాన్‌లో భాగంగా 500 (ఆర్కామ్ నుంచి ఆర్కామ్) నిమిషాలను పొందవచ్చు. తాజా సవరణలో భాగంగా 500 నిమిషాలను 160 నిమిషాలను కుదించారు.


Click it and Unblock the Notifications








