రిలయన్స్ నుండి ఐప్యాడ్ 2 కొరకు ప్రత్యేక డేటా ప్లాన్స్

Posted By: Staff

రిలయన్స్ నుండి ఐప్యాడ్ 2 కొరకు ప్రత్యేక డేటా ప్లాన్స్

ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఐప్యాడ్ 2 కోసం ప్రత్యేకంగా Wi-Fi + 3G డేటా ప్లాన్స్‌ని ప్రకటించింది. ఈ సందర్బంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రతినిధి మాట్లాడుతూ ఐప్యాడ్ 2 కోసం ప్రత్యేకమైన ప్లాన్స్‌ని ఇండియాలో విడుదల చేయడం జరిగింది. ఈ డేటా ప్లాన్స్ వల్ల కస్టమర్స్‌తో ఎటువంటి కాంట్రాక్ట్ లేకుండా ఏ సమయంలోనైనా యాక్టివేట్ చేసుకోవడం, యాక్టివేట్ చేసుకున్న డేటా ప్లాన్‌ని ఏ సమయంలో నైనా రద్దు చేసుకునే సౌకర్యాన్ని కల్పించనున్నామని తెలిపారు.

ఇది మాత్రమే కాకుండా ఐప్యాడ్ యూజర్స్ ఫాస్ట్‌గా, అద్బుతంగా ఉండేటటువంటి నెట్ వర్క్ అయిన రిలయన్స్‌ని సెలక్ట్ చేసుకున్నందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉందని సంజయ్ భెల్ (హెడ్ ఆఫ్ బ్రాండ్ అండ్ మార్కెటింగ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ) తెలియజేశారు. మా యొక్క కస్టమర్స్ సెంట్రిక్ డేటా ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో అవన్ని కూడా మేము ఏయే ఏరియాలలో ఐతే ఆపరేట్ చేస్తున్నామో దాని పరిధికి లోబడి ఐప్యాడ్‌ 2లకు చక్కని హై క్వాలిటీ సర్వీస్‌ని అందిస్తామని తెలియజేశారు. ఇక రిలయన్స్ కమ్యూనికేషన్ డేటా ప్లాన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Reliance Communications intros Data Plans for iPad 2:

PlanPrepaidPostpaidDataValidity
1 GB day packRs 199---1 GBTill Midnight
5 GB Month PackRs 752Rs 7505 GB30 Days
10 GB Month PackRs 1100Rs 110010 GB30 Days

ఒరిజినల్ ఐప్యాడ్‌తో గనుక ఐప్యాడ్ 2ని పోల్చినట్లైతే 33శాతం మందం తక్కువగా, అదేవిధంగా బరువు కూడా 15శాతం తక్కువగా ఉంటుంది. స్క్రీన్ సైజు మాత్రం 9.7-inch LED-backlit LCD screenగా ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot