రిలయన్స్ ప్రో 3, హైస్పీడ్ డేటా నెట్‌వర్క్

Posted By:

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ప్రో3 పేరుతో అల్ట్రా ఫాస్ట్ డేటా నెట్‌వర్క్‌ను విడుదల చేసింది. గరిష్టంగా 14.7 ఎంబీపీఎస్ వేగాన్ని అందుకోగలిగే ఈ డేటా ప్లాన్ విలువ రూ.999 (నెల రోజుల వ్యాలిడిటీతో).

 రిలయన్స్ ప్రో 3, హైస్పీడ్ డేటా నెట్‌వర్క్

మొదటి ఫేజ్‌లో భాగంగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, పూణే నగరాల్లో ఈ హైస్పీడ్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ విడుదల చేసింది. దేశంలోని ఇతర ప్రముఖ పట్టణాల్లో త్వరలోనే ఈ డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ , ల్యాప్‌టాప్‌లను వినియోగించే యూజర్లు ఈ డేటా నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు.

మరో వైపు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో నెట్‌వర్క్ సేవలు వచ్చే ఏడాది మొదటి క్వార్టర్‌లో దేశ్యవాప్తంగా ప్రారంభం కానున్నాయి. రిలయన్స్ జియో సేవలు దేశంలోని మారు మూల గ్రామాలకు సైతం విస్తరించనున్నాయి. తమ సర్వీసులను ప్రారంభించబోయే సర్కిళ్లలో సెక్యూరిటీ ఏజెన్సీలతో భద్రతా పరమైన పరీక్షలు నిర్వహించాల్సిందిగా టెలికం శాఖకు విజ్ఞప్తి చేసింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Reliance Communications launches Pro 3, an ultra-fast data network. Read more in Teugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot