Home
News

రూ.1కే 1జీబి ఇంటర్నెట్, 365 రోజులకు రూ.365 మాత్రమే...

సంచలన ఆఫర్లతో దూసుకొస్తున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్...

By Sivanjaneyulu Bommu

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సరికొత్త ఆఫర్ ను మార్కెట్లో లాంచ్ చేసినట్లు సమాచారం. ఈ ఆఫర్ లో భాగంగా రూ.365 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 365 రోజుల పాటు రోజుకు 1జీబి 2జీ డేటా లభిస్తుందని Telecomtalk రిపోర్ట్ పేర్కొంది. ఈ రీఛార్జ్ అమౌంట్ అనేది ఒక్కో సర్కిల్‌ను బట్టి ఒక్కో విధంగా ఉంటుందని సదురు పోర్టల్ పేర్కొంది.

ఇంటర్నెట్ ధమాకా ఆఫర్ పేరుతో మరో ప్లాన్‌..

ఇంటర్నెట్ ధమాకా ఆఫర్ పేరుతో మరో ప్లాన్‌..

ఇంటర్నెట్ ధమాకా ఆఫర్ పేరుతో ఓ ప్లాన్‌ను ఇటీవల రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా RCom యూజర్లు రూ.193 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే రోజుకు 1జీబి చొప్పున నెల‌ మొత్తం ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వీలుంటుంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి వాయిస్ కాల్స్ అలానే మెసేజింగ్ బెనిఫిట్స్ వర్తించవు.

రెండు సరికొత్త పోస్ట్‌‌పెయిడ్ ప్లాన్‌లను కూడా

రెండు సరికొత్త పోస్ట్‌‌పెయిడ్ ప్లాన్‌లను కూడా

ఈ కొత్త ప్లాన్‌తో పాటు రెండు సరికొత్త పోస్ట్‌‌పెయిడ్ ప్లాన్‌లను కూడా RCom లాంచ్ చేసింది. వాటిలో రూ.239 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే నెలకు 6జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రూ.333 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో భాగంగా నెల మొత్తం మీద 30జీబి డేటాతో పాటు 1000 నిమిషాల వాయిస్ కాల్స్ అందుబాటలో ఉంటాయి.

28% డిస్కౌంట్‌..

28% డిస్కౌంట్‌..

మరో ఆఫర్ క్రింద మూడు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పై సంవత్సరం పాటు 28% డిస్కౌంట్‌లను RCom ప్రకటించింది. ఈ ప్లాన్‌లను పొందాలనుకునే యూజర్లు కంపెనీ అఫీషియల్ పోర్టల్ అయిన rcom-eshop.comలోకి లాగినై నచ్చిన ప్లాన్‌ను subscribe చేసుకోవల్సి ఉంటుంది.

ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న వెంటనే..

ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న వెంటనే..

రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ యూజర్ అడ్రస్‌కు సిమ్ కార్డును డెలివరీ చేసి ఆర్‌కామ్ అందిస్తోన్న ఈ స్పెషల్ డిస్కౌంట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి క్లియర్ కట్‌గా యూజర్‌కు వివరించటం జరుగుతుంది.

రూ.699, రూ.499, రూ.299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పై

రూ.699, రూ.499, రూ.299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల పై

ఈ 28% డిస్కౌంట్‌ను ఆర్‌కామ్ అందిస్తోంది. డిస్కౌంట్ మినహాయించిన తరువాత రూ.699 ప్లాన్ రూ.499కు, రూ.499 ప్లాన్ రూ.399కు, రూ.299 ప్లాన్ రూ.239కు లభిస్తుంది. సంవత్సరం పాటు ఇదే డిస్కౌంట్ కొనసాగుతుంది.

రూ.499 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా

రూ.499 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా

రూ.499 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా నెలకు 30జీబి (4G/3G/2G) డేటా లభిస్తుంది. ఈ 30 రోజుల ప్లాన్ పిరియడ్‌లో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయిన అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చొప్పున నెలకు 3000 సందేశాలు పంపుకోవచ్చు.

రూ.399 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా

రూ.399 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా

రూ.399 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా నెలకు 15జీబి (4G/3G/2G) డేటా లభిస్తుంది. ఈ 30 రోజుల ప్లాన్ పిరియడ్‌లో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయిన అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చొప్పున నెలకు 3000 సందేశాలు పంపుకోవచ్చు.

రూ.239 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా

రూ.239 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా

రూ.239 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా హోమ్ సర్కిల్ పరిధిలో ఏ నెట్‌వర్క్‌కు అయిన అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. రోమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ మధ్య నిమిషానికి 50 పైసలు ఛార్జ్ చేయటం జరుగుతుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చొప్పున నెలకు 3000 సందేశాలు పంపుకోవచ్చు.

ఆఫర్ ఆర్‌కామ్ 4జీ సర్కిల్స్‌లో మాత్రమే..

ఆఫర్ ఆర్‌కామ్ 4జీ సర్కిల్స్‌లో మాత్రమే..

 ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఆర్‌కామ్ 4జీ సర్కిల్స్ అయిన ఢిల్లీ, ముంబై, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రా, ఆంధ్రప్రదేశ్ ఇంకా మధ్యప్రదేశ్ లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇండియన్ టెలికం మార్కెట్లో ఒకప్పటి సంచలన నెట్‌వర్క్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తీవ్రమైన ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Communications is offering 1 GB of 2G data per day for 365 days. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X