వినియోగదారులకు షాకిచ్చిన ఆర్‌కామ్,డీటీహెచ్ వ్యాపారం మూసివేత..

Written By:

డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) వ్యాపారంలో తనదైన ముద్రను వేసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్ వినియోగదారులకు షాకిచ్చింది. డీటీహెచ్ వ్యాపారాన్ని మూసివేయాలని అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిర్ణయించింది. రిలయన్స్ డిజిటల్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీటీహెచ్ బిజినెస్‌కు నవంబరు 18తో ముగింపు పలకనుంది. 

రూ.5కే 1జిబి డేటా, స్పెషల్ యూజర్లకు మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నవంబరు 18తో..

నవంబరు 18తో డీటీహెచ్ లైసెన్స్ గడువు ముగుస్తుండటంతో కంపెనీ ఆ రోజున ఈ వ్యాపారనికి స్వస్తీ పలకనుంది.

వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..

వ్యాపారాన్ని మూసివేసినంత మాత్రాన తమ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇతర ఆపరేటర్‌తో కలిసి డీటీహెచ్ సేవలు అందిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

మూడు సంస్థలతో సంప్రదింపులు..

ఇందుకోసం మూడు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. అయితే అవి ఎప్పుడు కొలిక్కి వస్తాయనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది.

అదనపు చార్జీలు వసూలు చేయకుండానే..

వినియోగదారులకు నిరంతర సేవలు అందిస్తామని, ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండానే కొత్త పథకాలు అందిస్తామని కంపెనీ తెలిపింది.

డీటీహెచ్ రంగంలో..

కాగా ఇప్పుడు డీటీహెచ్ రంగంలో టాటా స్కై,Airtel Digital TV, Sun DTV, Dish TV, Videocon DTH లాంటి సంస్థలు టాప్ లో దూసుకుపోతున్నాయి. 

ఆర్‌కామ్‌ తో ఎస్‌ఎస్‌టీఎల్‌ విలీనం

కాగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌తో (ఆర్‌కామ్‌) సిస్టెమా శ్యామ్‌(ఎస్‌ఎస్‌టీఎల్‌) విలీనానికి టెలికం విభాగం (డాట్‌) తాజాగా ఆమోద ముద్ర వేసింది. సిస్టెమా శ్యామ్‌ వైర్‌లెస్‌ వ్యాపార విలీనానికి డాట్‌ అంగీకారం లభించినట్లు ఆర్‌కామ్‌ తెలిపింది. అక్టోబర్‌ 20న ఈ డీల్‌కు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.

విలీనం అనంతరం..

విలీన ఒప్పందం ప్రకారం.. ఎస్‌ఎస్‌టీఎల్‌కు సంబంధించిన వైర్‌లెస్‌ బిజినెస్‌ అసెట్స్‌ అన్నీ ఆర్‌కామ్‌ పరిధిలోకి వస్తాయి. విలీనం అనంతరం ఆర్‌కామ్‌లో సిస్టెమాకు 10 శాతం వాటా వస్తుంది.

డీల్‌కు సంబంధించిన లావాదేవీలు

ఎయిర్‌సెల్‌ డీల్‌ అటకెక్కిన నేపథ్యంలో సిస్టెమా శ్యామ్‌ విలీన ఒప్పందానికి డాట్‌ ఆమోదం లభించడం ఆర్‌కామ్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. డీల్‌కు సంబంధించిన లావాదేవీలు నవంబర్‌ తొలివారానికల్లా పూర్తి కావొచ్చని ఆర్‌కామ్‌ అంచనా వేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Communications to Shut Down DTH Business Arm Reliance Digital TV On November 18 Read more News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot