రిలయన్స్ డిజిటల్ నుంచి బ్లాక్ బస్టర్ డీల్స్

By Gizbot Bureau
|

దేశీయ డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ డిజిటల్ తన బ్లాక్ బస్టర్ డిజిటల్ ఇండియా సేల్‌కు మరోసారి తెర తీసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్లు, బెస్ట్ టెక్నాలజీ డీల్స్ తో కూడిన 'డిజిటల్ ఇండియా సేల్' ని ప్రకటించింది. ఈ సేల్ లో వినియోగదారులకు అతిపెద్ద ఆఫర్లను అందిస్తోంది.

రిలయన్స్ డిజిటల్ నుంచి బ్లాక్ బస్టర్ డీల్స్

 

ఈ బ్లాక్ బస్టర్ డీల్స్‌ ఆగష్టు 10 నుండి ఆగస్టు 15, 2019 వరకు అందుబాటులో ఉండనున్నాయి.ఎలక్ట్రానిక్ వస్తువులపై 15శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో పాటు 5 శాతం రిలయన్స్ డిజిటల్ క్యాష్ బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చని తెలిపింది.

 360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్

360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్

ఈ ఆఫర్ 360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 2200 మై జియో స్టోర్స్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ‘రిలయన్స్ డిజిటల్' ఆన్ లైన్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జీరో డౌన్ పేమెంట్, ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది.

టీవీలపై డిస్కౌంట్లు

టీవీలపై డిస్కౌంట్లు

ఈ ఆఫర్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్ టాప్ లు భారీ ఆఫర్‌తో లభించనున్నాయి. 55 అంగుళాల టీవీ రూ.39,999కు, 65 అంగుళాల టీవీ రూ.59,990కు, 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.10,999కే లభించనుంది.

 వాషింగ్ మెషిన్లు, ఫోన్లు
 

వాషింగ్ మెషిన్లు, ఫోన్లు

టీవీలు మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.44,990కే లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. రూ.16,990కే అందుబాటులోకి వచ్చాయి. మెజో జీ6 ప్లస్(6జీబీ) స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9.999కే లభించనుంది. అలాగే న్యూ ఒప్పోఆర్17(8జీబీ) రూ.19,999కే అందనుంది. వీటితో పాటు బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా అందిస్తోంది.

 42వ వార్షిక సర్వసభ్య సమావేశం

42వ వార్షిక సర్వసభ్య సమావేశం

ఇదిలా ఉంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన 42వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఈ రోజు నిర్వహించనుంది. ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాన్ని రిలయన్స్ తన యూట్యూబ్, ట్విటర్‌, ఫేస్‌బుక్ ఖాతాలలో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా ఎప్పటినుంచో కస్టమర్లు ఎదురు చూస్తున్న రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ జియోగిగా ఫైబర్‌ను కమర్షియల్‌గా లాంచ్‌ చేయనుంది.

జియోగిగా ఫైబర్ సేవలు

జియోగిగా ఫైబర్ సేవలు

గత ఏడాది ఏజీఎంలో కంపెనీ అధికారికంగా తన జియోగిగా ఫైబర్ సేవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, రిలయన్స్ జియోఫోన్ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. తాజా అంచనాల ప్రకారం బంపర్‌ ఆఫర్లతో జియో గిగా ఫైబర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జియో గిగా ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో లభిస్తోంది.

 ప్లాన్‌ ఏది వస్తోంది

ప్లాన్‌ ఏది వస్తోంది

నెలకు రూ.600రుసుముపై ఇంటర్నెట్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ ప్రసార సేవలతో రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. 50ఎంబీపీఎస్‌ వేగంతో,100 జీబీ కాంప్లిమెంటరీ డేటాతో ట్రిపుల్‌ ప్లే ప్లాన్‌ లాంచ్‌ చేయనుందని భావిస్తున్నారు. దీనితోపాటు రూ.1000 ప్లాన్‌లను తీసుకురానుందని అంచనా. దీని ద్వారా ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు, ఉచిత ల్యాండ్‌లైన్‌ లభించనుంది. ఈ ల్యాండ్‌లైన్‌ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్‌ పొందవచ్చు. అంతే కాదు 4కే హెచ్ డీ సర్వీసుతో పాటు, జియో గిగా టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్ సేవలు లభించనున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
reliance digital brings back the biggest tech deals

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X