Reliance డిజిటల్ లో కొత్త సేల్ మొదలైంది! వీటి పై భారీ ఆఫర్లు!
రిలయన్స్ డిజిటల్ తన 'డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్' ఏప్రిల్ 6 నుండి ప్రారంభమై ఏప్రిల్ 15న ముగుస్తుందని ప్రకటించింది. ఈ సేల్ సమయంలో, అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గింపు ధరలకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో తగ్గిన ధరలతో పాటు, కస్టమర్‌లు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు మరియు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సౌండ్‌బార్లు మరియు మరిన్ని ఉత్పత్తులను వాటి సాధారణ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు అనేక ప్రముఖ బ్రాండ్‌ల నుండి ఎలక్ట్రానిక్ వస్తువులను భారీ తగ్గింపు ధరకి పొందవచ్చు.

ఈ సేల్ ఏప్రిల్ 6 మరియు ఏప్రిల్ 15 మధ్య సేల్ జరుగుతుందని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్‌లలో సేల్ సమయంలో డిస్కౌంట్‌లను పొందగలరు మరియు ప్రముఖ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందేందుకు అర్హులు. ఈ సేల్ సమయంలో కొనుగోళ్లపై రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా గెలుచుకోవచ్చు.
Reliance Digital నుండి ఈ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ లో LG OLED మరియు Samsung నియో QLED స్మార్ట్ టెలివిజన్‌లను 45 శాతం తగ్గింపుతో అందిస్తుంది, దీని ధర రూ. 79,990. ఇతర బ్రాండ్‌ల నుండి 43-అంగుళాల ఫుల్-హెచ్‌డి స్మార్ట్ టీవీలను 40 శాతం తగ్గింపుతో విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది, దీని ధర రూ. 16,990 గా ఉంది.
ఇంకా, సేల్ సమయంలో ఐఫోన్ మోడల్స్ కూడా తక్కువ ధరలకు లభిస్తాయని చెబుతున్నారు. కస్టమర్లు అన్ని iPhone మోడల్‌లపై రూ. 12,000 వరకు 'డబుల్ ఎక్స్ఛేంజ్ బోనస్' పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే, 'డబుల్ ఎక్స్ఛేంజ్ బోనస్' అంటే ఏమిటి మరియు బోనస్‌కు ఏ స్మార్ట్‌ఫోన్‌లు అర్హత పొందుతాయి అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.
MacBook M1 మోడల్ వంటి Apple నుండి మరిన్ని ఉత్పత్తులు 33 శాతం వరకు తగ్గింపుతో పాటు నో-కాస్ట్ EMI ఎంపికలు రోజుకు రూ.54 నుంచి మొదలవుతాయి. iPad 9th Gen యొక్క 64GB Wi-Fi వేరియంట్ కూడా అత్యంత తక్కువ ధరకు రూ. 23,900 అందుబాటులో ఉంది.
ఈ సేల్ సమయంలో, గేమింగ్ ల్యాప్‌టాప్‌ల శ్రేణిని తగ్గింపు ధరలకు రూ.49,999 నుంచి అందించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇంకా, బోస్ సౌండ్‌బార్ 900 ను 30 శాతం తగ్గింపుతో రూ. 72,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్లు 65 శాతం తగ్గింపుతో లభిస్తాయి, దీని ధర రూ. 17,990 నుంచి మొదలవుతాయి.
ఇంకా,ఈ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ సమయంలో ఎయిర్ కండీషనర్లు మరియు వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. 1 టన్ను 3-స్టార్ ఇన్వర్టర్ ACలు రూ. 20,990 ధరకు అందించబడతాయని కంపెనీ పేర్కొంది.
అలాగే, డ్రైయర్‌లతో కూడిన హై-ఎండ్ 11 కిలోలు లేదా 7 కిలోల వాషింగ్ మెషీన్లు రూ. 61,990 కు అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు రూ. 49,990 దారి వద్ద రిలయన్స్ డిజిటల్ సేల్ సమయంలో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








