రిలయన్స్ డిజిటల్ బంపరాఫర్లు, కేజీ బంగారం కూడా గెలుచుకోండి

By Gizbot Bureau
|

దసరా, దీపావళి పండుగుల సమయాల్లో ఈ కామర్స్ దిగ్గజాలు పోటీల పడి ఆఫర్లు కురిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజాల సేల్ అయిపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆఫర్ సునామి వచ్చేసింది. దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ తన డిజిటల్ ద్వారా గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కొత్త టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ లాంటివి కొనాలనుకునేవారికి బంఫరాపర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 5న 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' సేల్ ప్రారంభించబోతోంది. ఈ సేల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రిలయెన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌లో అద్భుతమైన డీల్స్, ఆకర్షణీయమైన ఆఫర్స్‌ పొందొచ్చు. ఎలక్ట్రానిక్స్‌పై 15% క్యాష్‌బ్యాక్‌తో పాటు యాక్సెసరీస్‌పై 10% అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

ఒక కిలో బంగారం
 

ఒక కిలో బంగారం

ఈ సేల్ లో ఇంకా ఎన్నో ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. కొందరు లక్కీ కస్టమర్లు ఒక కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు, ఎల్ఈడీ టీవీ, ల్యాప్‌టాప్, ఐఫోన్స్ గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వీటితో పాటు ఏజియో వోచర్, జియోసావన్ ప్రో ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఫైనాన్స్ ఆప్షన్స్

ఫైనాన్స్ ఆప్షన్స్

అలాగే బడ్జెట్ ఇబ్బందిగా ఉన్నవాళ్లకు రిలయెన్స్ డిజిటల్‌లో ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ఉన్న రిలయెన్స్ డిజిటల్, మైజియో స్టోర్స్‌లో టెలివిజన్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్‌పై లోన్ తో కూడిన ఆఫర్లు పొందొచ్చు.

పరీక్షించి తెలుసుకునే అవకాశం

పరీక్షించి తెలుసుకునే అవకాశం

ప్రతీ కస్టమర్ రిలయెన్స్ డిజిటల్‌లో లభించే ప్రతీ ప్రొడక్ట్‌ను ప్రత్యక్షంగా పరీక్షించి చూడొచ్చు. తమకు నచ్చిన ప్రొడక్ట్స్ ఎంచుకోవచ్చు. రిలయెన్స్ డిజిటల్ అద్భుతమైన ఆఫర్లు, తక్కువ ధరలతో ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌ను అందిస్తోంది. పండుగ సీజన్‌లో ఇంట్లోకి కొత్త వస్తువులు కొనాలన్నా, ఎవరికైనా బహుమతులు ఇవ్వాలన్నా రిలయెన్స్ డిజిటల్ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. '

ఆఫర్ల కోసం ..
 

ఆఫర్ల కోసం ..

ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' సేల్‌లో మరిన్ని ఆఫర్ల గురించి తెలుసుకోవాలంటే www.reliancedigital.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. రిలయెన్స్ డిజిటల్ భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్ గా ఉంది. 6700 పట్టణాల్లో 7700 జియో స్టోర్స్, 2000+ మైజియో స్టోర్స్, 370+ లార్జ్ ఫార్మాట్ రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్ ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
reliance digital launches festival of electronics offer

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X