రిలయన్స్ ‘అన్‌లిమిట్’

తమ వినియోగదారులకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సేవలను చేరువ చేసే క్రమంలో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 'అన్‌లిమిట్' (UNLIMIT) పేరుతో సరికొత్త టెక్నాలజీ వెంచర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

రిలయన్స్  ‘అన్‌లిమిట్’

Read More : రూ.1,000కే 4G VoLTE స్మార్ట్‌ఫోన్?

సిస్కో జాస్పర్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఈ వెంచర్‌కు నాంది పలికింది. భవిష్యత్ కమ్యూనికేషన్ ప్రపంచాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ శాసించనున్న నేపథ్యంలో రిలయన్స్ తీనుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం విజయవంతం కాగలదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరింత ప్రాధాన్యత..

ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉన్న డివైజ్‌ల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో 2020 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సర్వీసులకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని రిలయన్స్ భావిస్తోంది.

అనుసంధానమై ఉంటాయి

స్మార్ట్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా విస్తృతం చేసే లక్ష్యంతో ఏర్పాటైన అన్‌లిమిట్ టెక్నాలజీ వెంచర్‌లో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన మొబైల్ నెట్‌‌వర్క్స్, క్లౌడ్ సర్వీసెస్ ఇంకా సిస్కో జాస్పర్ ఐఓటీ కనెక్టువిటీ మేనేజ్ మెంట్ ప్లాట్‌ఫామ్‌లు అనుసంధానమై ఉంటాయి.

మరింత మంది యూజర్లకు చేరువయ్యే అవకాశం ...

స్మార్ట్ టెక్నాలజీ విభాగంలో కీలకంగా రాణిస్తోన్న సిస్కో జాస్పర్‌తో కలిసి పనిచేయటం వల్ల రిలయన్స్‌కు మరింత మంది యూజర్లకు చేరువయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచం మొత్తాన్ని ఒక కమ్యూనిటీలా..

ప్రపంచం మొత్తాన్ని ఒక కమ్యూనిటీలా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కే దక్కింది. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ త్వరలో మరొక సంచలన ఆవిష్కరణకు నాంది పలకబోతోంది.

జీవితాలను మరింత అత్యాధునికం

మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో సాకారం కాబోతోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటీ అనుకుంటున్నారా..?

మెషీన్లన్ని కనెక్టెడ్‌గా..

మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి.

యంత్రాలు, పరికరాలు

యంత్రాలు, పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానమై మనుషుల్లాగా పరస్పరం సంప్రదించుకుంటూ మనిషి జీవన విధానాన్ని మరింత సుఖమయం చేసేస్తాయనమాట.

పంచమే ఓ స్మార్ట్ నగరం

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రపంచమే ఓ స్మార్ట్ నగరంగా మారిపోతుంది.

ప్రతి వస్తువు ఇంటర్నెట్ కు అనుసంధానమైతే..

మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి రకరకాల పనులను ఖచ్చితమైన సమయపాలతో వాటి వాటి మేధస్సును ఉపయోగించి సమర్థవంతంగా పూర్తి చేసేస్తాయి.

2020 నాటికి

2020 నాటి కల్లా ఐఓటీ పరిధి మరింత విస్తరించి అందులో ఉపకరణాల సంఖ్య 20 వేల కోట్లకు చేరుకుంటుదని ఓ అంచనా.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Group, Cisco Jasper partner for technology venture. Read More in Telugu Gizbot.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot