జియో మరో షాక్, ఏకంగా రూ.2500 కోట్ల డీల్, Hathwayపై కన్ను..

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊఫు ఊపేసిన దిగ్గజం రిలయన్స్ జియో ఇప్పుడు గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

|

దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊఫు ఊపేసిన దిగ్గజం రిలయన్స్ జియో ఇప్పుడు గిగాఫైబర్‌ హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రంగంలోనూ అదే సంచలనాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో.. ఇతర కంపెనీల కొనుగోళ్లపైనా దృష్టి పెట్టింది. తాజాగా దేశీయంగా అతి పెద్ద కేబుల్‌ ఆపరేటర్‌ హాథ్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ సంస్థను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డీల్‌ పూర్తిగా కుదురుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని సంబంధిత వర్గాలు వివరించాయి.

FIRని ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు !FIRని ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు !

సుమారు రూ. 2,500 కోట్ల మేర ..

సుమారు రూ. 2,500 కోట్ల మేర ..

అయితే, రిలయన్స్‌ మాత్రం హాథ్‌వేను కచ్చితంగా దక్కించుకోవాలనే భావిస్తున్నట్లు, సుమారు రూ. 2,500 కోట్ల మేర వ్యాల్యుయేషన్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇదే తొలిసారి కాదు

ఇదే తొలిసారి కాదు

కేబుల్‌ టీవీ రంగానికి చెందిన సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సమీర్‌ మన్‌చందా ప్రమోటరుగా ఉన్న డెన్‌ నెట్‌వర్క్స్‌ను కొనేందుకు ప్రయత్నించింది.

గిగాఫైబర్‌ ప్రాజెక్టు..

గిగాఫైబర్‌ ప్రాజెక్టు..

చర్చలు తుది దశ దాకా జరిగినప్పటికీ ఆ డీల్‌ కుదరలేదు. దీంతో.. తమ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కింద తమ గిగాఫైబర్‌ ప్రాజెక్టును సొంతంగానే ప్రారంభించేందుకు సిద్ధమైంది.

చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా ..

చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా ..

వాస్తవానికి ఏదైనా భారీ మల్టీ-సిస్టమ్‌ ఆపరేటర్‌ (ఎంఎస్‌వో)తో పాటు కొన్ని చిన్న సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా త్వరితగతిన కార్యకలాపాలు విస్తరించాలన్నది కంపెనీ వ్యూహంగా ఉంది.

వీడియో, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు..

వీడియో, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు..

వాటికి ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఉపయోగించుకుని వీడియో, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ప్రారంభించాలన్న ఆలోచనతో జియో ముందుకెళుతోంది.

రిలయన్స్‌ జియోకి సవాళ్లు..

రిలయన్స్‌ జియోకి సవాళ్లు..

అయితే కీలకమైన మార్కెట్లలో స్థానిక కేబుల్‌ ఆపరేటర్స్‌ (ఎల్‌సీవో) నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుండటంతో .. యూజర్ల ఇళ్ల దాకా కనెక్టివిటీని విస్తరించే విషయంలో రిలయన్స్‌ జియోకి సవాళ్లు ఎదురవుతున్నాయి.

గిగాఫైబర్‌ ప్రాజెక్టు..

గిగాఫైబర్‌ ప్రాజెక్టు..

ఈ కారణాల వల్ల గిగాఫైబర్‌ ప్రాజెక్టు ప్రవేశపెట్టడంలో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేయాలన్న ప్రణాళికను కంపెనీ మళ్లీ పరిశీలించడం ప్రారంభించినట్లు సంబంధిత వ్యక్తి తెలిపారు.

హాథ్‌వేని గానీ చేజిక్కించుకోగలిగితే..

హాథ్‌వేని గానీ చేజిక్కించుకోగలిగితే..

ఒకవేళ హాథ్‌వేని గానీ చేజిక్కించుకోగలిగితే జియో బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళికలకు గట్టి ఊతమే లభించగలదని పరిశ్రమ వర్గాల అంచనా.

ఆర్‌ఐఎల్‌కి

ఆర్‌ఐఎల్‌కి

ఆర్‌ఐఎల్‌కి ఇప్పటికే ఎంఎస్‌వో లైసెన్సు ఉండటంతో పాటు ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది. స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల మద్దతు మాత్రమే దానికి కావాలి.

ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేసిందంటే ..

ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేసిందంటే ..

ఇందులో భాగంగా ఏదైనా ఎంఎస్‌వోను కొనుగోలు చేసిందంటే చాలు ఈ సమస్య పరిష్కారమైనట్లే‘ అని ప్రముఖ బ్రోకరేజి సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

హాథ్‌వే కేబుల్‌లో..

హాథ్‌వే కేబుల్‌లో..

కాగా కేబుల్‌ బ్రాడ్‌బ్యాండ్, కేబుల్‌ టీవీ సర్వీసులు అందిస్తున్న హాథ్‌వే కేబుల్‌లో ప్రమోటరు రహేజా గ్రూప్‌నకు 43.48 శాతం వాటాలు ఉన్నాయి.

1.1 కోట్ల డిజిటల్‌ కేబుల్‌ టీవీ కనెక్షన్లతో పాటు..

1.1 కోట్ల డిజిటల్‌ కేబుల్‌ టీవీ కనెక్షన్లతో పాటు..

కంపెనీ దాదాపు 1.1 కోట్ల డిజిటల్‌ కేబుల్‌ టీవీ కనెక్షన్లతో పాటు 8 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు.

Best Mobiles in India

English summary
Deals Buzz: Reliance Industries in talks to acquire Hathway Cable more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X