లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !

దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) మరోసారి రికార్డుల లాభాలతో అదరగొట్టింది.

|

దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) మరోసారి రికార్డుల లాభాలతో అదరగొట్టింది. ఆయిల్‌ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో తిరుగు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఏడాది రికార్డు లాభాల పంటను పండించింది. నేడు ప్రకటించిన తొలి క్వార్టర్‌ ఫలితాల్లో నికర లాభాలు రూ.9,459 కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ లాభాలు రూ.9,108 కోట్లగా ఉన్నాయి. నిర్వహణ నుంచి కంపెనీకి వచ్చిన కన్సాలిడేటెడ్‌ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 56.5 శాతం పెరిగి, రూ.1.41 లక్షల కోట్లగా నమోదైనట్టు వెల్లడించింది. ఈ రెవెన్యూలు గతేడాది ఇదే సమయంలో రూ.90,537 కోట్లగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

 

జియో లోగో వెనుక దాగిన రహస్యం అదే..!జియో లోగో వెనుక దాగిన రహస్యం అదే..!

జియో కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను ..

జియో కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను ..

కాగా రిలయన్స్ లాభాల వైపు పయనిస్తుండటంతో జియో కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను అందించే అవకాశం ఉందని టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మూడు క్వార్టర్లు నికర లాభాలను..

మూడు క్వార్టర్లు నికర లాభాలను..

రిలయన్స్‌ జియో వరుసగా మూడు క్వార్టర్లు నికర లాభాలను ఆర్జించినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మరికొంత కాలం పాటు కూడా టారిఫ్‌ ధరలు తగ్గనున్నట్టు తెలిసింది.

టారిఫ్‌లను తగ్గిస్తామని..

టారిఫ్‌లను తగ్గిస్తామని..

మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి టారిఫ్‌లను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్‌ ముగింపు నాటికి రిలయన్స్‌ జియో రూ.612 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు ప్రకటించింది.

రూ.510 కోట్లగా..
 

రూ.510 కోట్లగా..

కాగా గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ లాభాలు రూ.510 కోట్లగా ఉన్నాయి.

గతేడాది ఇదే క్వార్టర్‌లో..

గతేడాది ఇదే క్వార్టర్‌లో..

కంపెనీ గ్రాస్‌ రెవెన్యూ మార్జిన్లు ఒక్కో బ్యారల్‌కు 10.5 డాలర్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఒక్కో బ్యారల్‌ గ్రాస్‌ రెవెన్యూ మార్జిన్‌ 11.90 డాలర్లుగా ఉంది.

జూన్‌ క్వార్టర్‌ రెవెన్యూలు ..

జూన్‌ క్వార్టర్‌ రెవెన్యూలు ..

రిఫైనింగ్‌, మార్కెటింగ్‌ సెగ్మెంట్‌లో జూన్‌ క్వార్టర్‌ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 42.9 శాతం పెరిగి రూ.95,646 కోట్లగా ఉన్నాయి.

రిలయన్స్‌ జియో ఆర్పూ

రిలయన్స్‌ జియో ఆర్పూ

రిలయన్స్‌ జియో ఆర్పూ(యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌) రూ.134.50కి పడిపోయింది. జియో ఈబీఐటీడీఏలు క్వార్టర్‌ క్వార్టర్‌కు 16.80 శాతం పెరిగి రూ.3,147 కోట్లకు ఎగబాకాయి.

ఈబీఐటీడీఏ మార్జిన్లు

ఈబీఐటీడీఏ మార్జిన్లు

జియో ఈబీఐటీడీఏ మార్జిన్లు క్వార్టర్‌ క్వార్టర్‌ బేసిస్‌లో 37.80 శాతం నుంచి 38.80 శాతం పెరిగాయి.

సబ్‌స్క్రైబర్‌ వృద్ధిలో..

సబ్‌స్క్రైబర్‌ వృద్ధిలో..

సబ్‌స్క్రైబర్‌ వృద్ధిలో జియో ట్రెండ్‌ కొనసాగుతోంది. నెట్‌ అడిక్షన్‌ 28.7 మిలియన్లగా నమోదైంది.

ఇదే అత్యధిక అడిక్షన్‌

ఇదే అత్యధిక అడిక్షన్‌

కంపెనీ కమర్షియల్‌గా సర్వీసులు లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక అడిక్షన్‌ అని జియో వర్గాలు తెలిపాయి.

Best Mobiles in India

English summary
Reliance Industries Reports Record Profit Of Rs. 9,459 Crore In April-June more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X