Home
News

2019లో జియో నుంచి రాబోతున్న మెరుపులు ఇవే !

రిలయన్స్ జియో గతేడాది టెలికాం మార్కెట్ ని పరుగులు పెట్టించిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. 2016లో 4జీ వోల్ట్ నెట్ వర్క్ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా అన్నీ సంచలనాలే నమోదు చేసింది.

రిలయన్స్ జియో గతేడాది టెలికాం మార్కెట్ ని పరుగులు పెట్టించిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. 2016లో 4జీ వోల్ట్ నెట్ వర్క్ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా అన్నీ సంచలనాలే నమోదు చేసింది. 250 మిలియన్ల సబ్ స్క్రైబర్లతో టెలికాం మార్కెట్లో సింహభాగాన్ని కంపెనీ ఆక్రమించుకుంది. ఇప్పుడు తన యూజర్లను కాపాడుకోవడానికి సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకువస్తోంది. కాగా 2018లో గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ లాంచ్ చేయడం ద్వారా అత్యధికంగా సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఈ ఏడాది కూడా జియో తన మెరుపులను మెరిపించనుంది. ఈ శీర్షికలో భాగంగా ఈ ఏడాది జియో నుంచి రానున్న ఆవిష్కరణలపై ఓ లుక్కేయండి.

జియో గిగా ఫైబ్ బ్రాడ్ బ్యాండ్

జియో గిగా ఫైబ్ బ్రాడ్ బ్యాండ్

దీన్న జియో గతేడాది జూలైలో లాంచ్ చేసింది. జియో ఫోన్ లాంచ్ సందర్భంగా జరిగిన వార్షిక సమావేశంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. అయితే అప్పటి నుంచి దీని మీద పూర్తి స్థాయి సమాచారం మాత్రం యూజర్లకు అందుబాటులో లేదు. టారిప్ ప్లాన్ల మీద ఇంకా ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఈ ఏడాది మార్చిలో దీని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

 

జియో గిగా టీవీ

జియో గిగా టీవీ

జియో గిగా టీవీ సీరిస్ ను కూడా కంపెనీ గతేడాది అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు 4కె వీడియో కాలింగ్ అలాగే ఇతర సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఇది అందుబాటులోకి వస్తే DTH మార్కెట్లో కంపెనీ పాగా వేయడం ఖాయంగా తెలుస్తోంది.

జియో ఫోన్ 3

జియో ఫోన్ 3

జియో ఫోన్, జియోఫోన్ 2 సంచలనం మరువక ముందే ఈ ఏడాది జియో ఫోన్ 3 మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ పాత ఫోన్ల కన్నా మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి రానుందనే వార్తలు వస్తున్నాయి.

లార్జ్ స్క్రీన్ ఫోన్లు

లార్జ్ స్క్రీన్ ఫోన్లు

జియో కంపెనీ ఇప్పటిదాకా ఫీచర్ ఫోన్ మార్కెట్లో మాత్రమే తన జైత్రాయాత్రను కొనసాగించింది. ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్ మీద తన గురిని పెట్టినట్లు తెలుస్తోంది.

జియో భాగస్వామ్యం

జియో భాగస్వామ్యం

ఈ ఏడాది జియో నుంచి మరిన్ని పార్టనర్ షిప్ భాగస్వామ్యాలను మనం చూడొచ్చు. ఆ మేరకు చర్చలు కూడా నడుస్తున్నట్లు సమాచారం.

జియో విఓ వైఫై సర్వీసు

జియో విఓ వైఫై సర్వీసు

జియో వైఫై సర్వీసులను కూడా లాంచ్ చేయనుందని రూమర్లు వస్తున్నాయి. అయితే ఇది టెస్టింగ్ దశలో ఉందని సమాచారం.

జియో స్మార్ట్ హోమ్

జియో స్మార్ట్ హోమ్

యూజర్ ఇంటిని పూర్తిగా జియో హోమ్ గా మార్చేందుకు జియో అధినేత అంబాని కసరత్తు చేస్తున్నారు. అన్ని పరికరాలు జియోతో అనుసంధానం చేసేలా ఇవి ఉండనున్నాయి.

 

 

జియో ఎంటర్ ప్రైజెస్

జియో ఎంటర్ ప్రైజెస్

అన్నీ కుదిరితే ఈ ఏడాది జియో ఎంటర్ ప్రైజెస్ మార్కెట్లోనూ తన సత్తాను చాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జియో 5జీ

జియో 5జీ

జియో ఇప్పటికే 4జీలో మెరుపులు మెరిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 5జీవైపు తన మెరుపులు మెరవునున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio in 2019: What to expect from the telco this year more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X