మరో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో

|

దేశీయ టెలికం రంగంలో పెను మార్పులకు నాంది పలికిన రిలయెన్స్ జియోకు సంచలనాలు కొత్తేమీ కాదు. జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. ఇదిలా ఉంటే భారతదేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఏవి అని Ipsos India నిర్వహించిన సర్వేలో రిలయెన్స్ జియో ఏకంగా రెండో స్థానం సాధించింది. మొదటి స్థానంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిలిచింది.

మరో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో

గతేడాది ఇదే సర్వేలో గూగుల్, అమెజాన్ తర్వాత రిలయెన్స్ జియో మూడో స్థానంలో ఉండేది. ఈసారి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని రెండో స్థానానికి చేరుకుంది. రిలయెన్స్ జియోకు ప్రధాన పోటీ కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. వీటితో పాటు పేటీఎం, సాంసంగ్, అమెజాన్ లాంటి టెక్నాలజీ కేటగిరీ కంపెనీలో టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి.

 ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి..

ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి..

జియో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో రెండవ స్థానాన్ని పొందింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ ఘనతను సాధించింది జియో​. ఐపోసిస్ 2019 సర్వే లెక్కల ప్రకారం మరో టెలికాం దిగ్గజం, జియో ప్రధాన పోటీదారు భారతి ఎయిర్‌టెల్‌ ఎనిమిదవ స్థానం సంపాదించింది. గత ఏడాది సర్వేలో భారత్‌లోని మోస్ట్ పాపులర్ బ్రాండ్‌ జాబితాలో తొలి రెండు స్థానాల్లో గూగుల్, ఫేస్‌బుక్ నిలవగా రిలయన్స్ జియో మూడో స్థానంలో నిలిచింది.

మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు

మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు

2016 టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. 30 కోట్లకు పైగా యూజర్లతో జియో సంచలనం సృష్టించగా, తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా టాప్ టెన్‌లో టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు నిలవడ మరో విశేషం.

విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం మూడవ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్‌ నాలుగు, జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ ఐదవ స్థానం దక్కించుకున్నాయి. లోకల్ బ్రాండ్స్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషమని ఐపోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా (బిజినెస్ హెడ్, ముంబై) చెప్పారు.

  టాప్ 10లో నాలుగు దేశీయ బ్రాండ్స్
 

టాప్ 10లో నాలుగు దేశీయ బ్రాండ్స్

ఇక టాప్ 5లో గ్లోబల్ బ్రాండ్స్‌ తో పోటీపడి దేశీయ బ్రాండ్స్ తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే టాప్ 10లో నాలుగు దేశీయ బ్రాండ్స్ నిలిచాయి. రిలయన్స్ జియో, పేటీఎంలతో పాటు ఎయిర్‌టెల్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. శాంసంగ్ 6వ స్థానంలో, బిల్‌గేట్స్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో, యాపిల్ ఐఫోన్ 9వ స్థానంలో నిలిచాయి. ఎయిర్‌టెల్ 8వ స్థానంలో, ఫ్లిప్‌కార్ట్ 10వ స్థానంలో ఉన్నాయి.

 వినూత్నమైన ఆఫర్లను..

వినూత్నమైన ఆఫర్లను..

ఇదిలా ఉంటే వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని తన కస్టమర్ల కోసం వినూత్నమైన ఆఫర్లను అందిస్తోంది. దీని ద్వారా ఉచితంగా మ్యాచ్‌ని తిలకించొచ్చు, హాట్ స్టార్ సర్వీసులు, కొత్త రీచార్జ్ ప్లాన్, క్రికెట్ ప్లే వంటివి ఉన్నాయి. జియో యూజర్లు వారి జియో టీవీ యాప్‌లోకి వెళ్లి మ్యాచ్‌లు చూడొచ్చు. అలాగే యూజర్లు వారి జియో టీవీ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమ్ సౌకర్యం కూడా పొందొచ్చు. దీని ధర రూ.251. ప్లాన్ వాలిడిటీ 51 రోజులు. సబ్‌స్ర్కైబర్లకు 102 జీబీ 4 జీ డేటా లభిస్తుంది. దీంతో మ్యాచ్‌లు చూడొచ్చు. వీటితో పాటు మై జియో యాప్ ద్వారా మరికొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు మీ క్రికెట్ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్స్ చెబితే పాయింట్లు, బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.

 గిగా ఫైబర్‌ పేరిట

గిగా ఫైబర్‌ పేరిట

దీంతో పాటు టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్‌ పేరిట త్వరలో బ్రాడ్‌బ్యాండ్‌సేవలను ప్రారంభిస్తున్నజియో దాని మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వకుండానే దానికి సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవల గురించి అప్పుడే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రూ.600కే ఈ సేవలు

రూ.600కే ఈ సేవలు

ప్రాథమికంగా బ్రాడ్ బాండ్ సేవలు రూ.600కే ఈ సేవలు యూజర్లకు అందుబాటులోకి వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కనెక్షన్‌ తీసుకున్న వారికి ప్రివ్యూ ఆఫర్‌ కింద ఉచితంగానే సేవలు అందిస్తున్నారు. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.4,500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించే మొత్తాన్ని జియో తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. గతం కంటే రూ.2వేలు తక్కువగా అంటే రూ.2,500కే కనెక్షన్‌ అందిస్తున్నట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌లో కనెక్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

డ్యూయల్‌ బ్యాండ్‌ రూటర్‌

డ్యూయల్‌ బ్యాండ్‌ రూటర్‌

రూ.2500 కనెక్షన్‌తో సింగిల్‌ బ్యాండ్‌ రూటర్‌ మాత్రమే అందిస్తారు. అదే రూ.4,500 పెట్టి కొనుగోలు చేసే కనెక్షన్‌లో డ్యూయల్‌ బ్యాండ్‌ రూటర్‌తో అందిస్తున్నారు. ఇది 2.4GHz, 5GHz బ్యాండ్‌ విడ్త్‌ను సపోర్టు చేస్తుంది. రూ.4,500 కనెక్షన్‌తో పోలిస్తే ఈ కొత్త కనెక్షన్‌లో వేగం తక్కువగా ఉంటుంది. రూ.4,500 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌ వేగం అందిస్తుంటే.. కొత్త కనెక్షన్‌ కింద 50 ఎంబీపీఎస్‌ వేగం ఉంటుంది.అయితే ఈ చౌక ప్లాన్‌లో వాయిస్‌ సేవలు కూడా అందుతాయి.

 జియో టీవీ యాప్‌

జియో టీవీ యాప్‌

దీని ద్వారా ఇతరులకు కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు జియో టీవీ యాప్‌ను కూడా అందిస్తున్నారు. అయితే, కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌కు సంబంధించి జియో నుంచి ఎలాంటి అధికారిక వెలువడలేదు. కానీ, కొందరు వినియోగదారులు, మీడియాలో వస్తున్న కథనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జియో వాణిజ్య సేవలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదానిపై ఇంకా సస్పెన్స్ నెలకొని ఉంది.

Best Mobiles in India

English summary
Mukesh Ambani's Reliance Jio ranked India's 2nd most popular brand after Google, says survey

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X