Home
News

Jio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లు

రిలయన్స్ జియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ప్రీపెయిడ్ చందాదారులకు నాలుగు డేటా వోచర్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ లు వాటి యొక్క పేరుకు తగ్గట్లుగా అవి కేవలం డేటాను మాత్రమే అందించడానికి కేవలం డేటా టాప్-అప్‌లుగా పనిచేస్తాయి.

జియో 4G డేటా వోచర్లు

జియో 4G డేటా వోచర్లు

అంటే వినియోగదారుడు ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్లపైన అదనపు డేటాను పొందుతారు. ఈ జియో 4G డేటా వోచర్లు రోజువారీ డేటా పరిమితిని అధికంగా వాడుతున్న వినియోగదారులకు నిజంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం రిలయన్స్ జియో రూ.11, రూ.21, రూ.51 మరియు రూ.101 ధరల వద్ద 4G డేటా వోచర్లను ఆఫర్‌లో భాగంగా అందిస్తున్నది. ఈ యాడ్-ఆన్‌లతో ఉత్తమమైన భాగం వాటి యొక్క చెల్లుబాటు సమయం.

 

 

డేటా యాడ్-ఆన్‌

డేటా యాడ్-ఆన్‌

డేటా యాడ్-ఆన్‌ల ప్లాన్లతో 28 రోజులు వాలిడిటీని అందిస్తున్న భారతి ఎయిర్‌టెల్ మాదిరిగా కాకుండా రిలయన్స్ జియో యొక్క 4G డేటా వోచర్లు యూజర్ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే వాలిడిటీని పొందుతుంది. ఈ నాలుగు వోచర్‌లతో పాటు టెల్కోలో స్వతంత్ర డేటా వోచర్ రూ.251 ధర వద్ద 51 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

జియో  4G డేటా వోచర్లు

జియో 4G డేటా వోచర్లు

రిలయన్స్ జియో రూ.11 ప్రారంభ ధర నుండి డేటా వోచర్‌ను అందిస్తున్నది. ఇది 400mb 4G డేటాను అందిస్తుంది. తరువాత 1GB డేటాను రూ.21 వోచర్‌ ద్వారా అందిస్తుంది. అలాగే 3GB డేటాతో వచ్చే డేటా వోచర్ ప్లాన్ యొక్క ధర రూ.51 వద్ద ఉంది. చివరగా రూ.101 వోచర్ వినియోగదారుడికి 6 జీబీ డేటాను అందిస్తుంది.

 

 

4G డేటా వోచర్ల వాలిడిటీ

4G డేటా వోచర్ల వాలిడిటీ

చెల్లుబాటు విషయానికి వస్తే మీ ప్రస్తుత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క వాలిడిటీ సమయం వరకు ఈ వోచర్లు చెల్లుబాటు అవుతాయి. ఉదాహరణకు మీరు 84 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5GB డేటాను అందించే 555 రూపాయల రీఛార్జిలో ఉంటే కనుక మీరు ఇప్పుడు రూ.101ల 4G డేటా వోచర్‌ను రీఛార్జ్ చేస్తే జియో అదనంగా 6GB డేటాను వోచర్ యొక్క మొత్తం 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ కేసు రూ.11, రూ.21, రూ.51, రూ.101 వోచర్‌లకు కూడా వర్తిస్తుంది.

 

 

 

ఎయిర్‌టెల్ 4G డేటా వోచర్లు

ఎయిర్‌టెల్ 4G డేటా వోచర్లు

భారతి ఎయిర్‌టెల్ యొక్క 4G డేటా వోచర్‌లు రూ.48, రూ.98 రెండు వరుసగా 3 జీబీ, 6 జీబీ డేటా బెనిఫిట్‌తో లబిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లకు 28 రోజుల స్థిర వాలిడిటీ మాత్రమే ఉంది. వీటికి అపరిమిత కాంబో ప్లాన్‌తో సంబంధం లేదు. మీరు 28 రోజుల్లో 6GB డేటా ప్రయోజనాన్ని వినియోగించకపోతే అది తగ్గుతుంది.

 

 

జియో రూ 251 4 జి డేటా వోచర్

జియో రూ 251 4 జి డేటా వోచర్

రిలయన్స్ జియో పైన పేర్కొన్న నాలుగు 4G డేటా వోచర్‌లతో పాటు జియోలో రూ.251ల స్వతంత్ర వోచర్ కూడా ఉంది. ఇది రోజుకు 2 జిబి డేటాను 51 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. పరిశ్రమలో ఇలాంటి డేటా వోచర్‌ను మరే ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అందించడం లేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌లో రోజుకు 5GB వరకు డేటాను ఆఫర్ చేయడానికి రూ.97, రూ.198, రూ.318 వంటి కొన్ని ఓన్లీ-డేటా ప్లాన్‌లను కలిగి ఉన్నాయి.

 

 

జియో

రిలయన్స్ జియో నుండి వచ్చిన ఇతర నాలుగు డేటా వోచర్‌లను అపరిమిత కాంబో ప్లాన్‌ల పైన మాత్రమే ఉపయోగించవచ్చు. రూ.251 4 జి డేటా వోచర్‌ను స్వతంత్ర ప్లాన్‌లగా కూడా ఉపయోగించవచ్చు. రిలయన్స్ జియో నుండి వాయిస్ మరియు ఎస్ఎంఎస్ సేవలు అవసరం లేని వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio 4G Data Voucher Plans Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X