Reliance Jio: అధిక డేటా కోసం సరైన వోచర్ ప్యాక్‌లు ఇవే...
టెలికామ్ రంగంలోకి ప్రవేశించినప్పటి నుండి రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఉత్తమమైన డేటా ప్రయోజనాలను అందించింది. జియో తమ బేస్ ప్లాన్ తో అందిస్తున్న దాని కంటే ఎక్కువ డేటా అవసరం ఉన్న వినియోగదారులకు ప్రత్యేకమైన 4G డేటా వోచర్‌లను కూడా అందిస్తుంది.

జియో ప్రీపెయిడ్ ప్లాన్
జియో సంస్థ వివిధ రకాల ధరల వద్ద వేరు వేరు డేటా ప్రయోజనాలతో వేర్వేరు ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. మీరు రీఛార్జ్ చేసుకున్న ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క రోజు వారి హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత తరువాతి రోజుది రీసెట్ అవ్వడానికి మీరు అర్ధరాత్రి వరకు వేచి ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి జియో సంస్థ 4G డేటా వోచర్‌లను ప్రవేశపెట్టింది. Also Read: తక్కువ ధరకే రియల్‌మి నుంచి 55 ఇంచ్ స్మార్‌టీవీ

జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ Vs 4G డేటా ప్యాక్
దేశంలో ఇప్పుడు కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు తమ ఇళ్ల నుండి పని చేస్తున్నందున వారు గతంలో వాడుతున్న దాని కంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో జియో 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనే డేటా ప్యాక్‌లను కూడా తన వినియోగదారులకు అందిస్తోంది. ఈ వోచర్‌లలో ఏది అధిక ప్రయోజనాలను అందిస్తున్నదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో 4G డేటా వోచర్లు
జియో సంస్థ తన వినియోగదారుల కోసం నాలుగు రకాల 4G డేటా వోచర్లను అందిస్తున్నది. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే టెల్కో నుండి 4G డేటా వోచర్‌ను కొనుగోలు చేయడానికి మీరు ముందుగా తప్పనిసరిగా ఎదో ఒక బేస్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకొని ఉండాలి. Mitron & Remove China apps యాప్‌లను ఎందుకు తొలగించారో తెలుసా???

రూ.11 4G డేటా వోచర్
జియో సంస్థ తక్కువ ధరలో అందిస్తున్న డేటా ఓచర్ ఇది. రూ.11 ధర వద్ద ఇది 800MB డేటా ప్రయోజనంను అందిస్తుంది. ఈ వోచర్ డేటాతో పాటు 75 నిమిషాల నాన్-జియో కాల్‌ల కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ వోచర్ యొక్క చెల్లుబాటు కాలం వినియోగదారుడి యొక్క ప్రస్తుత ప్లాన్ చెల్లుబాటు వరకు ఉంటుంది.

రూ .21 4G డేటా వోచర్
జియో యొక్క రూ .21 4G డేటా వోచర్‌తో మీకు 2GB డేటా ప్రయోజనం లభిస్తుంది. అదనంగా 200 నిమిషాల నాన్-జియో కాల్స్ వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా ఉంటుంది.

రూ.51 4G డేటా వోచర్
జియో యొక్క రూ.51 4G డేటా వోచర్‌తో మీకు 6GB డేటా ప్రయోజనాలతో పాటు 500 నిమిషాల నాన్-జియో కాల్స్ వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

రూ.101 4G డేటా వోచర్
జియో సంస్థ తన వినియోగదారులకు అందిస్తున్న చివరి 4G డేటా వోచర్ ఇది. ఇది 12GB డేటా ప్రయోజనంతో పాటు 1000 నిమిషాల నాన్-జియో కాల్స్ వంటి కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ వోచర్ యొక్క చెల్లుబాటు వినియోగదారుడి యొక్క ప్రస్తుత ప్లాన్ వరకు ఉంటుంది.

జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్‌లు
కరోనా గ్లోబల్ మహమ్మారి ఇండియాలో మొదలైనప్పటి నుంచి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ప్రజలు తమ ఇళ్ల నుండి పనిచేయడం ప్రారంభించిన తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్‌లను జియో ప్రవేశపెట్టింది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్' ప్యాక్‌ల క్రింద జియో సంస్థ కొన్ని రకాల వోచర్‌లను అందిస్తున్నాయి.

రూ .151 వోచర్
టెల్కో జియో అందిస్తున్న చౌకైన వోచర్ ఇది. ఈ వోచర్ మీకు 30 రోజుల వాలిడిటీ కాలానికి 30GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ వోచర్‌తో మీకు ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలు లేదా ఇతర ప్రయోజనాలు లభించవు.

రూ.201 వోచర్
జియో సంస్థ ‘వర్క్ ఫ్రమ్ హోమ్' కేటగిరీ క్రింద అందిస్తున్న రెండవ వోచర్ ఇది. ఇది మీకు 40GB డేటా ప్రయోజనంను 30 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

రూ. 251 వోచర్
జియో ‘వర్క్ ఫ్రమ్ హోమ్' కేటగిరీ కింద అందిస్తున్న చివరి వోచర్ ఇది. ఇది 50GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ వోచర్ యొక్క చెల్లుబాటు కాలం 30 రోజులు.

ప్రస్తుతం ఏది ఎంచుకుంటే బెటర్
మీ బేస్ ప్లాన్‌ను బట్టి రిలయన్స్ జియో నుండి డేటా వోచర్‌లలో దేనినైనా మీరు ఎంచుకోవచ్చు. మీకు ఎక్కువ డేటా అవసరం ఉండి ఫోన్ కాల్స్ అవసరం ఉండకపోతే అప్పుడు జియో యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ వోచర్‌లను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ బేస్ ప్లాన్‌లో ప్రతిరోజూ మీకు తగినంత డేటా ఉండి FUP కాలింగ్ నిమిషాలు అవసరమైతే కనుక అప్పుడు Jio 4G డేటా వోచర్‌ల కోసం వెళ్లడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








