జియో స్పీడు దుమ్ము రేపింది

మే నెలలో నమోదైన రిలయన్స్ జియో 4జీ స్పీడ్ ఆల్-టైమ్-హైగా నిలిచింది. TRAI MySpeed app వెల్లడించిన వివరాల ప్రకారం రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ వేగం 19.123 Mbpsకు దూసుకెళ్లింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇదే నెలలో ఇతర నెట్‌వర్క్‌ల స్పీడ్‌లను పరిశీలించినట్లయితే..

ఇదే నెలలో ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్ స్పీడ్ 13.709Mbps గాను, వొడాఫోన్ నెట్‌వర్క్ స్పీడ్ 13.387 Mbps గాను, భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ స్పీడ్ 10.153Mbpsగాను నమోదయ్యాయి.

అమెజాన్ సొంత ఫోన్ వచ్చేస్తోంది, రూ.6,000కే?

జియో నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడు తగ్గుతూ పెరుగుతూ వస్తోంది

గతకొద్ది నెలలుగా జియో నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడును పరిశీలించినట్లయితే గ్రాఫ్ తగ్గుతూ పెరుగుతూ వస్తోంది... ట్రాయ్ మై స్పీడ్ యాప్‌లో నమోదైన గణాంకాల ప్రకారం డిసెంబర్ 2016కు గాను జియో 4జీ డౌన్‌లోడ్ వేగం 18.146Mbpsగా ఉంది.

మీ ఫోన్ పదేపదే ఓవర్ హీట్ అవుతోందా..?

జనవరి 2017లో 8.345Mbpsకు పడిపోయింది

జనవరి 2017లో ఆ స్పీడు కాస్తా 8.345Mbpsకు పడిపోయింది. ఫిబ్రవరి 2017లో పడిలేచిన కెరటంలా జియో స్పీడు 17.427Mbpsను టచ్ చేసింది. మార్చి 2017లో వేగం కొద్దిగా మందగించి 16.487Mbpsకు చేరుకుంది. ఏప్రిల్ 2017లో జియో డౌన్‌లోడ్ వేగం 18.487Mbpsకు చేరుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది.

భారత్‌లో దూసుకుపోతున్న Truecaller యాప్

19.123 Mbps స్పీడుతో ఆల్ టైమ్ హై...

మే 2017లో ఏకంగా 19.123 Mbps డౌన్‌లోడ్ స్పీడును నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఇక 4జీ అప్‌లోడ్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి మే, 2017కు గాను రిలయన్స్ జియో మూడవ స్థానంలో కొనసాగుతోంది.

జూన్ 8 నుంచి Moto Z2 Play ప్రీ-ఆర్డర్స్

 

4జీ అప్‌లోడ్ స్పీడ్ విభాగంలో ఐడియా నెం.1

4జీ అప్‌లోడ్ స్పీడ్ విభాగంలో 8.459Mbps వేగంతో ఐడియా సెల్యులార్ మొదటి స్థానంలో నిలిచింది. 7.333Mbps వేగంతో వొడాఫోన్ రెండవ స్థానంలో నిలిచింది. 5.275 Mbps వేగంతో రిలయన్స్ జియో మూడవ స్థానంలో నిలవగా 4.641Mbps వేగంతో ఎయిర్‌టెల్ నాలుగవ స్థానంలో నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G Download Speed Hits All-Time High in May, Shows TRAI Data. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot