అనుమానాలన్నీ పటాపంచల్, ఫోన్ ఫీచర్లపై పూర్తి వివరాలు వెల్లడించిన జియో

జియో అధినేత ముకేష్ అంబాని మార్కెట్లోకి తీసుకువస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ పై చాలామందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి.

By Hazarath
|

జియో అధినేత ముకేష్ అంబాని మార్కెట్లోకి తీసుకువస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ పై చాలామందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి. అందులో ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి, వైఫై ఉంటుందా, వాట్సప్ ఉండ‌దా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్ బ్రౌజ్ చేసుకోవ‌చ్చా, వంటి సందేహాలు చాలా మందికి వ‌చ్చాయి. దీనికి జియో సమాధానం ఇచ్చింది. తమ కంపెనీ నుంచి వచ్చే ఫోన్ పై పూర్తి వివరాలను వెల్లడించింది.

ఎల్‌జీ నుంచి మరో సంచలన ఫోన్ఎల్‌జీ నుంచి మరో సంచలన ఫోన్

డిస్‌ప్లే

డిస్‌ప్లే

జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ 2.4 ఇంచ్ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంది. దీని రిజ‌ల్యూష‌న్ 320 x 240 పిక్స‌ల్స్‌గా ఉంది.

ప్రాసెస‌ర్

ప్రాసెస‌ర్

ప్రాసెస‌ర్ విష‌యానికి వ‌స్తే ఈ ఫోన్‌లో స్ప్రెడ్‌ట్ర‌మ్ లేదా క్వాల్‌కామ్ కంపెనీకి చెందిన ప్రాసెస‌ర్ ఉంటుంది. స్ప్రెడ్‌ట్ర‌మ్ అయితే 1.2 గిగాహెడ్జ్ సామ‌ర్థ్యం ఉన్న డ్యుయ‌ల్ కోర్ స్ప్రెడ్‌ట్ర‌మ్ ఎస్‌పీ9820ఎ ప్రాసెస‌ర్ ఉంటుంది. అదే క్వాల్‌కామ్ అయితే 1.1 గిగాహెడ్జ్ డ్యుయ‌ల్ కోర్ క్వాల్‌కామ్ 205 ప్రాసెస‌ర్ ఉంటుంది.

ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాసెస‌ర్

ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాసెస‌ర్

యూజ‌ర్‌కు ల‌భించే జియో ఫోన్‌లో ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రాసెస‌ర్ ఉండేందుకు అవ‌కాశం ఉంది. రెండు కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ప్రాసెస‌ర్‌ల‌ను దిగుమతి చేసుకున్నందున ఈ ఫోన్‌లో పైన చెప్పిన‌ ఏదైనా ఒక ప్రాసెస‌ర్ క‌చ్చితంగా ఉంటుంద‌ని తెలుస్తుంది.

 ర్యామ్

ర్యామ్

జియో 4జీ ఫోన్‌లో 512 ఎంబీ ర్యామ్ ఉంది. 4జీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఇచ్చారు. 128 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ ఉంది. ఆ మేర‌కు మెమొరీ కార్డుతో స్టోరేజీని పెంచుకోవ‌చ్చు.

కొత్త‌గా KAI OSను

కొత్త‌గా KAI OSను

ఈ ఫోన్‌లో కొత్త‌గా KAI OSను ఏర్పాటు చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల‌కు భిన్న‌మైంది. ఈ ఫోన్ కోస‌మే ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను తీర్చిదిద్దారు. MyJio, JioTV, JioCinema, JioChat, JioMusic, JioXpressNews వంటి జియో యాప్స్ అన్నీ ఈ ఫోన్‌లో వ‌స్తాయి.

ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌

ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌

ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను ఇవ్వ‌డం వ‌ల్ల కావ‌ల్సిన సైట్‌ను ఓపెన్ చేసి నెట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌లను ఈ ఫోన్‌లో ప‌నిచేసేలా ప్ర‌త్యేకంగా యాప్‌ల‌ను అందివ్వ‌నున్న‌ట్టు తెలిసింది.

ఒకే సిమ్‌

ఒకే సిమ్‌

జియో 4జీ ఫోన్‌లో కేవ‌లం ఒకే సిమ్‌ను వేసుకోవ‌చ్చు. సింగిల్ సిమ్ వేరియెంట్‌లోనే ఈ ఫోన్‌ను అందిస్తున్నారు.

కెమెరా

కెమెరా

వెనుక భాగంలో 2 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న కెమెరా ఉంది. ఫ్లాష్ లేదు. ముందు భాగంలో 0.3 మెగాపిక్స‌ల్ సామ‌ర్థ్యం ఉన్న వీజీఏ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీనికి కూడా ఫ్లాష్ లేదు.

టార్చి లైట్

టార్చి లైట్

ఫోన్ పై భాగంలో టార్చి లైట్ ఉంటుంది. కింది భాగంలో 3.5 ఎంఎం ఆడియోజాక్‌, మైక్రో యూఎస్‌బీ స్లాట్ ఉంటాయి. వైర్‌లెస్ ఎఫ్ఎం ఫీచ‌ర్ ఉండ‌డం వ‌ల్ల హెడ్‌ఫోన్స్ పెట్ట‌కుండానే ఎఫ్ఎం రేడియోను ఆస్వాదించ‌వ‌చ్చు.

హెచ్‌డీ వాయిస్ కాల్స్

హెచ్‌డీ వాయిస్ కాల్స్

4జీ వీవోఎల్‌టీఈ ఉండ‌డం వ‌ల్ల హెచ్‌డీ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేక యాప్ అవ‌స‌రం లేదు. వైఫై ఇచ్చారు. క‌నుక వైఫై హాట్ స్పాట్ ల‌కు ఈ ఫోన్‌ను క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. కానీ ఇందులో వైఫై హాట్ స్పాట్ పెట్టుకునే అవ‌కాశం లేదు. క‌నుక ఈ ఫోన్ ఇంట‌ర్నెట్‌ను ఇత‌ర డివైస్‌ల‌కు షేర్ చేయ‌లేం.

2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

2000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో ఇచ్చారు. ఫీచ‌ర్ ఫోనే క‌నుక బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీని స్టాండ్ బై టైం 15 రోజులు. బ్లూటూత్ 4.1 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ ఉండడం వ‌ల్ల ఫైల్స్ వేగంగా షేర్ అవుతాయి.

జియో మీడియాకేబుల్‌

జియో మీడియాకేబుల్‌

జియో మీడియాకేబుల్‌ను ఈ ఫోన్‌తోపాటు ఇస్తున్నారు. దీన్ని ఏ టీవీకైనా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. ఓ వైపు జియో ఫోన్‌కు క‌నెక్ట్ చేసి ఈ కేబుల్‌ను మ‌రోవైపు టీవీకి క‌నెక్ట్ చేస్తే దాంతో ఫోన్‌లో ఉన్న కంటెంట్ టీవీలో ప్లే అవుతుంది.

రూ.309తో రీచార్జి చేసుకుంటే

రూ.309తో రీచార్జి చేసుకుంటే

జియో ధన్ ధ‌నా ధ‌న్ ప్యాక్ రూ.309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 3, 4 గంట‌ల పాటు ఇలా టీవీలో వీడియోలు చూడ‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio 4G feature phone complete configuration and features list all you need to know Read more at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X