సామ్‌సంగ్ యూజర్లకు Reliance Jio ఉచితం!

Reliance Jio 4జీ సేవలు కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టబుతోన్నాయి. ఉచిత వాయిస్ సర్వీసెస్ ఇంకా డేటాతో రిలియన్స్ జియో తన మొదటి 4జీ ప్లాన్‌ను ఆగస్టు 15ను కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకురాబోతోంది. Freedom పేరుతో రాబోతున్న ఈ ప్లాన్ ఇతర టెలికామ్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న ధరల కన్నా 25శాతం తక్కువగా ఉంటాయని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. భారత దేశ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలియన్స్ జియో ఈ ఆఫర్‌తో ముందుకు రాబోతోంది.

Read More : రూ.1900కే LeEco సూపర్‌ఫోన్, ఎలా అంటారా..?

సామ్‌సంగ్ యూజర్లకు Reliance Jio ఉచితం!

4G-VoLTE సౌలభ్యతతో కూడిన చౌక ధర స్మార్ట్‌ఫోన్‌లను Lyf బ్రాండ్ పేరిట రిలయన్స్ విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. రూ.2,999 ధర ట్యాగ్ నుంచి ఈ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ప్రత్యేకమైన ధర తగ్గింపుతో వస్తోన్నఈ ఫోన్‌ల కొనుగోలు పై 3 నెలల రిలయన్స్ జియో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉచితంగా పొందే అవకాశాన్ని రిలయన్స్ కల్పిస్తోంది.

సామ్‌సంగ్ యూజర్లకు Reliance Jio ఉచితం!

Read More : రూ.6,000కే 3జీబి ర్యామ్ ఫోన్!

4G-VoLTE సపోర్ట్ అంటే..?

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్ 4జీ నెట్ వర్క్ పై హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో భాగస్వామ్యంతో సామ్‌సంగ్

రిలయన్స్ జియో భాగస్వామ్యంతో సామ్‌సంగ్ ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల పై రిలయన్స్ జియో సిమ్‌తో పాటు 3 నెలల ఉచిత డేటాను అందిస్తోంది. సామ్‌సంగ్ యూజర్లు పొందబోయే రిలయన్స్ జియో ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా 90 రోజుల పాటు జియో సిమ్ పై అన్‌లిమిటెడ్ డేటా, హైడెఫినిషన్ వాయిస్ ఇంకా వీడియో కాలింగ్, ఎస్ఎంఎస్ ఇంకా రిలయన్స్ జియో ప్రీమియమ్ యాప్స్‌కు సంబంధించిన యాక్సెస్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఎంపిక చేయబడిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల పై మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుంది.

రిలయన్స్ జియో ప్రివ్యూ ఆఫర్‌ వర్తించబోయే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5, గెలాక్సీ ఏ5 (2016), గెలాక్సీ ఏ7,గెలాక్సీ ఏ7 (2016), గెలాక్సీ ఏ8, గెలాక్సీ నోట్ 4, గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ నోట్ డ్యుయోస్, గెలాక్సీ నోట్ ఎడ్జ్, గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్+, గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్.

హ్యాండ్‌సెట్‌లలో MyJio యాప్‌ను

ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోగదలిచిన, పై జాబితాలో ఉన్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ హ్యాండ్‌సెట్‌లలో MyJio యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. యాప్ ఇన్‌స్టాలేషన్ పూర్తి అయిన తరువాత, జియో సిమ్‌ను పొందే ఆప్షన్‌ను యూజర్లు చూడగలుగుతారు.

కూపన్ జనరేట్ అవుతుంది

సదరు ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా బార్‌కోడ్ అలానే జియో ఆఫర్ కోడ్‌తో కూడిన కూపన్ జనరేట్ అవుతుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

expiry dateతో వచ్చే ఈ కోడ్‌

నిర్ధేశిత expiry dateతో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది. ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది

ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌లను

ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌లను సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ ఓకే అయిన వెంటనే

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే అయిన వెంటనే ఉచిత రిలియన్స్ జియో సిమ్ మీకు లభిస్తుంది.

1977కు డయల్ చేయటం ద్వారా

ఈ సిమ్ కార్డ్‌ను మీ ఫోన్‌లో ఇన్సర్ట్ చేసి 1977కు డయల్ చేయటం ద్వారా టెలి- వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మీ సిమ్ యాక్టివేట్ అవుతుంది.

ఈ ప్రకియ పూర్తి అయిన తరువాత

ఈ ప్రకియ పూర్తి అయిన తరువాత మరోసారి MyJio యాప్‌‌లోకి వెళ్లి జియో ప్రివ్యూ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

ఉచిత సబ్‌స్ర్కిప్షన్

90 రోజుల ఉచిత సబ్‌స్ర్కిప్షన్ పూర్తి అయిన తరువాత రిలయన్స్ జియో కమర్షియల్ టారిఫ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G is All Set For Commercial Launch on August 15. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot