రూ.5000కే జియో ల్యాపీ.. పూర్తిగా చదవండి

ఇండియన్ టెలికం మార్కెట్లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నజియో, అక్కడితో తన పరుగును ఆపేటట్టు కనిపించటం లేదు. జియో బ్రాడ్‌బ్యాండ్, జియో డీటీహెచ్, జియో 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్స్, జియో ల్యాప్‌టాప్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ జియో తన బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవాలని చూస్తోంది.

Read More : ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ దాకా జియో మొత్తం ప్లాన్స్ వివరాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒకదాని తరువాత మరొకటిగా...

కొద్ది నెలల క్రితమే జియో 4జీ సర్వీసులను లాంచ్ చేసిన రిలయన్స్, వాటిని సపోర్ట్ చేసే విధంగా LYF బ్రాండ్ పేరిట 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌‌లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తరువాత జియో బ్రాండెడ్ వై-ఫై రౌటర్స్‌ను కూడా రిలయన్స్ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. త్వరలో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు డీటీహెచ్ సర్వీసులు కూడా మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి.

జియో బ్రాండెడ్ 4జీ ల్యాప్‌టాప్

జియో ఇకోసిస్టం నుంచి మరో దిమ్మతిరిగే ప్రొడక్ట్ మార్కెట్లోకి రాబోతోందట. అదే జియో బ్రాండెడ్ ల్యాప్‌టాప్.

డిస్‌ప్లే పగిలిన టచ్ ఫోన్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

విండోస్ 10తో రన్ అవుతుంది..

అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం, డెడికేటెడ్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్‌తో రానున్న ఈ సరికొత్త జియో 4జీ ల్యాపీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుందట. అందుకు అనుగుణంగా జియో యాప్ సూట్‌ను అప్‌డేట్ చేసారట.

ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు చేస్తుందా..?

రిలయన్స్ ఆఫర్ చేయబోతున్న జియో 4జీ ల్యాప్‌టాప్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

జియో 4జీ ల్యాప్‌టాప్ టెక్నికల్ ఫీచర్స్ (అన్‌అఫీషియల్)

13.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా, చాక్లెట్ కీ స్టైల్ స్లిమ్ కీబోర్డ్, ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి eMMC స్టోరేజ్, 128జీబి SSD స్టోరే్జ్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్ 4.0, మైక్రో యూఎస్బీ 3.0 పోర్ట్స్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మైక్రోఎస్డీ స్లాట్.

12 లక్షల మంది అంటూ ఊరించే ప్రయత్నం...

తాజాగా www.buyredmi.com/jiolaptop/
అనే వెబ్‌సైట్, జియో ల్యాప్‌టాప్‌లకు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ తమవద్ద ప్రారంభమైనట్లు చెప్పుకుంటోంది. . ఈ ల్యాపీని బుక్ చేసుకునేందుకు ఇప్పటికే 12 లక్షల మంది తమ వద్ద రిజిస్టర్ అయ్యారని, మీరు కూడా త్వరగా రిజిస్టర్ అవ్వాలని ఈ వెబ్‌సైట్ ఊరించే ప్రయత్నం చేస్తుంది.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో భాగంగా..

రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో భాగంగా యూజర్ తన పేరు, చిరునామా ఇంకా మొబైల్ నెంబర్‌ను పొందుపరచాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ మోడ్ క్రింద రూ.5000కే ఈ ల్యాప్‌టాప్‌లను డెలివరీ చేస్తామని, ఈ వెబ్‌సైట్ నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?

జియో ఇప్పటికి వరకు ఎటువంటి అనౌన్స్ చేయలేదు

తాము విడుదల చేయబోయే ల్యాప్‌టాప్‌లకు సంబంధించి జియో ఇప్పటికి వరకు ఎటువంటి అషీషియల్ న్యూస్‌ను అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇలాంటి నిరాధారమైన వెబ్‌సైట్‌ల మాటలు నమ్మి మోసపోకండి.

ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G laptop pre-booking starts at Rs. 5,000, claims fake listing. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot