రిలయన్స్ జియో 4జీ, నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

రిలయన్స్ జియో 4జీ దేశవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. తన 4జీ సిమ్‌తో పాటుగా రిలయన్స్ ఆఫర్ చేస్తోన్న జియో 4జీ ప్రివ్యూ ఆఫర్ పై ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది. తొలత ఈ 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను LYF స్మార్ట్‌ఫోన్‌ల పై మాత్రమే రిలయన్స్ అందుబాటులో ఉంచింది.

రిలయన్స్ జియో 4జీ, నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Read More : ఎయిర్‌టెల్ ఆఫర్.. 1జీబి 4జీ డేటా రూ.51కే!

క్రమకమంగా ఈ ఆఫర్‌ను 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తోన్న సామ్‌సంగ్, ఎల్‌జీ, పానాసోనిక్, Asus, మైక్రోమాక్స్, యు టెలీవెంచర్స్, టీసీఎల్, ఆల్కాటెల్ బ్రాండ్‌లకు విస్తరించింది. ఈ ప్లాన్ విజయవంతమవటంతో రిలయన్స్ తన 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను జియోనీ, లావా, కార్బన్ వంటి బ్రాండ్‌లకు సైతం అందుబాటులో ఉంచింది.

Read More : స్పీడ్ టెస్ట్‌లో Reliance Jio గెలిచిందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో దెబ్బకు విలవిల

ఒక రోజు కాదు రెండు కాదు ఏకంగా 90 రోజల పాటు తన సర్వీసులను ఉచితంగా ఆఫర్ చేస్తూ రిలయన్స్ జియో తన కస్టమర్ బేస్‌‌ను పెంచేసుకుంటున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌లు తమ చందదారులు చేజారిపోకుండా ఉచిత అన్‌లిమిటెడ్ డేటా‌ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

నచ్చే అంశాలు.. నిరుత్సహాపరిచే అంశాలు

నేటి స్పెషల్ ఫీచర్ స్టోరీలో భాగంగా రిలయన్స్ జియో 4జీ సర్వీసుకు సంబంధించి నచ్చిన అంశాలతో పాటు నిరుత్సాహపరిచిన అంశాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం..

అన్‌లిమిటెడ్ వాయిస్, డేటా, టెక్స్ట్

రిలయన్స్ ఆఫర్ చేస్తోన్న జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్, డేటా ఇంకా టెక్స్టింగ్ సర్వీసులతో పాటు జియో ఆన్ డిమాండ్, జియో బీట్స్, జియో ప్లే, జియో మాగ్స్, జియో మనీ వంటి యాప్ బేసిడ్ సేవలను
90 రోజుల పాటు ఉచితంగా ఆస్వాదించవచ్చు.

3 నెలల వ్యాలిడిటీ

రిలయన్స్ జియో 4జీ సిమ్ మీ ఫోన్‌లో యాక్టివేట్ అయిన నాటి నుంచి ఫ్రీ డేటా సర్వీస్ 90 రోజుల పాటు ఓపెన్ అయి ఉంటుంది. ఈ మూడు నెలల్లో ఎంత 4జీ డేటాను అయినా మీరు ఉచితంగా వాడుకోవచ్చు!

90 రోజుల తరువాత చీప్ డేటా టారిఫ్ ప్లాన్స్

90 రోజుల ప్రివ్యూ ఆఫర్ పూర్తి అయిన తరువాత జియో తన టారిఫ్ ప్లాన్స్‌ను మరింత తక్కువకు ఆఫర్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఎంబీ డేటాను కేవలం 50 పైసలకే రిలయన్స్ జియో ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.

ఇతర డివైస్‌లకు అందుబాటు...

రిలయన్స్ జియో ప్రివ్యూ ఆఫర్‌ను తొలత Lyf స్మార్ట్‌‍ఫోన్‌లకే పరిమితం చేసారు. ఆ తరువాత సామ్‌సంగ్, ఎల్‌జీ, పానాసోనిక్, Asus, మైక్రోమాక్స్, యు టెలీవెంచర్స్ , టీసీఎల్, ఆల్కాటెల్, జియోనీ, లావా, కార్బన్ వంటి బ్రాండ్‌లకు విస్తరింపచేసారు. ఇంచుమించుగా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరు జియో ఉచిత సిమ్‌తో పాటు సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు.

లీగల్ సమస్యలు..

రిలయన్స్ జియోపై ఇప్పుడు ఇతర కంపెనీలు యుద్ధాన్ని ప్రకటించాయి. రిలయన్స్ జియో తన వాణిజ్యపరమైన సేవలను ప్రారంభించకుండా విలువైన 4జీ సేవలను ఉచితంగా ఇవ్వడం పట్ల ఇతర కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని దిగ్గజ టెల్కోలు వాదిస్తున్నారు. జియో సేవలను పూర్తి స్థాయిలో బయటకు తీసుకురాకుండా కష్టమర్లను మభ్యపెడుతోందని చాలామందిని ఆకర్షిస్తోందని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా లాంటి ఆప‌రేట‌ర్లు వాదిస్తున్నారు.

 

కాల్ డ్రాప్ సమస్యలు...

రిలయన్స్ జియో నెట్‌వర్క్ పరిధిలో 4G VoLTE సర్వీసులు బేషుగ్గా ఉన్నప్పటకి వాయిస్ కాల్స్ విషయంలో మాత్రం కాల్ డ్రాప్స్ ఎక్కువుగా నమోదవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. కాల్ డ్రాప్ రేట్లను తగ్గించేందుకు రిలయన్స్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.

 

మొబైల్ పోర్టింగ్ సదుపాయం లేదు

రిలయన్స్ జియో సేవలు ఇంకా కమర్షియల్‌గా అందుబాటులోకి రాకపోవటంతో మొబైల్ పోర్టింగ్ సదుపాయం ఇంకా ప్రారంభం కాలేదు. మీరు ఇప్పుడు రిలయన్స్ జియో 4జీ సర్వీసును పొందాలనుకుంటే కొత్త నెంబర్ తో కూడిన కనెక్షన్‌ను తీసుకోవల్సిందే. రిలయన్స్ జియో తన కమర్షియల్ సేవలను సెప్టంబర్ 1 నుంచి మార్కెట్లో అందించే అవకాశం ఉంది. అప్పటి నుంచి పోర్టింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం మాతో కలిసి ఉండండి.
https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G Preview: Good and Bad About It. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot