లెనోవో, మోటరోలా ఫోన్‌లకు Jio 4G సపోర్ట్ ఎప్పటి నుంచి..?

నమ్మశక్యం కాని ఉచిత 4జీ ప్రివ్యూ ఆఫర్లతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి దిగ్గజ టెలికామ్ ఆపరేటర్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న Reliance Jio 4G నేడు అధికారికంగా మార్కెట్లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.

లెనోవో, మోటరోలా ఫోన్‌లకు Jio 4G సపోర్ట్ ఎప్పటి నుంచి..?

ఈ రోజు ముంబైలో జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్‌లను కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Read More : Jio 4జీ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న 245 స్మార్ట్‌ఫోన్‌ల కంప్లీట్ లిస్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ఇదే ఈవెంట్‌లో భాగంగా 'Jio Preview Offer'పేరును 'Jio Trial Offer'గా మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

#2

జియో ప్రివ్యూ ఆఫర్ తరహాలోనే జియో ట్రయల్ ఆఫర్‌లోనూ 90 రోజుల పాటు హైడెఫినిషన్ వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ అన్ లిమిటెడ్ ఎస్ఎంస్ (9000), అన్‌లిమిటెడ్ హైస్పీడ్ 4జీ డేటా వంటి సేవలను ఉచితం పొందే అవకాశం ఉంటుంది.

#3

రిలయన్స్ జియో 4జీ ప్రివ్యూ ఆఫర్‌ను ఇప్పటి వరకు 18 బ్రాండ్‌లకు సంబంధించి 245 స్మార్ట్‌ఫోన్‌లు సపోర్ట్ చేస్తున్నాయి.వీటిలో సామ్‌సంగ్, హెచ్ టీసీ, సోనీ, జియోనీ, ఆసుస్, ఎల్‌జీ, మైక్రోమాక్స్, వివో, వీడియోకాన్, ఇంటెక్స్, లావా వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి.

#4

నేడు జరిగే Reliance Jio అఫీషియల్ లాంచ్ ఈవెంట్ తరువాత యాపిల్, లెనోవో, మోటరోలా వంటి బ్రాండ్‌లకు కూడా Jio Trial Offer వర్తించే అవకాశం ఉంది.

#5

అందుతోన్న లెక్కల ప్రకారం రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 40 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

#6

తమ lyf హ్యాండ్‌సెట్‌ల విక్రయాలను దేశీయంగా మరింతగా పెంచి భారత్ టాప్ మొబైల్ బ్రాండ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్పెషల్ టారిఫ్ ప్లాన్స్ను లైఫ్ ఫోన్లకు అందించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G release details revealed!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot