రూ. 200కే రిలయన్స్ జియో సిమ్ : 75 GB 4G డాటా, 4500 మినిట్స్ కాల్స్

By Hazarath
|

అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో సిమ్‌లు మార్కెట్లోకి దూసుకువస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో సిమ్‌లు రిలయన్స్ స్టోర్లకు పంపినట్లు కూడా తెలుస్తోంది. దీని ఖరీదు రూ. 200 ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సిమ్ ద్వారా 75GB 4G డాటాతో పాటుగా 4500 నిమిషాలు ఫ్రీ కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటును కూడా కల్పించారు..అయితే సిమ్ కార్డులు ఎప్పటి నుంచి అమ్మనున్నారు.. టారిఫ్ ల సంగతేంది.. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: తుఫాను కన్నా వేగంగా రిలయన్స్ జియో 4జీ

1

1

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో త్వరలోనే దేశవ్యాప్తంగా తన 4 జి టెలికాం సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇందుకోసం ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ కు సిమ్ కార్డులు కూడా పంపించినట్టు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్విస్ తెలిపింది.

2

2

రిలయన్స్ జియో 4 జి సిమ్ కార్డు ధర ప్రారంభంలో రూ .200 ఉంటుంది. ఖాతాదారులు మూడు నెలల పాటు ఈ సిమ్ ద్వారా ఉచితంగా వాయిస్, డేటా సేవలు పొందవచ్చు. ఈ సిమ్ కొన్నవారికి మొదటి మూడు నెలలు దాదాపు 75 జిబి 4జీ డాటా అలాగే 4000 నిమిషాల పాటు మాట్లాడుకునే సౌలభ్యం ఉంటుంది.

3

3

రూ .200 పెట్టి రిలయన్స్ జియో సిమ్ కార్డు తీసుకున్నా అది మూడు నెలల పాటే చెల్లుబాటవుతుంది. ఆ తర్వాల టారిఫ్‌ల పరిస్థితి ఏమిటన్న దానిపై కంపెనీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు.

4

4

దీనికి తోడు ఈ సిమ్ కార్డులను రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో అమ్మే ఎల్‌వైఎఫ్ హ్యాండ్ సెట్లు కొన్న వారికే ఇస్తారా.. లేక 4 జి సేవలను సపోర్టు చేసే ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్లు ఉన్న వారికీ ఇస్తారా? అన్నదానిపైనా స్పష్టత లేదు.

5

5

ఇప్పటికే రిలయన్స్ తన ఆఫీసలో పనిచేసే ఉద్యోగులకు జియో సర్వీసులను అందించింది. వారు ఇప్పటికే 4జీ నెట్ వర్క్ ని వాడుతున్నారు కూడా. కష్టమర్లకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

6

6

కస్టమర్లను చేర్చుకోవడం, వారికి తమ సర్వీస్ ప్రత్యేకతల గురించి చెప్పడం, డాక్యుమెంట్ల నిర్వహణ వంటి విషయాల్లో కూడా రిలయన్స్ జియో ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది.

7

7

అయితే సిమ్ కార్డులు ఎప్పటి నుంచి అమ్మాలన్న దానిపై వీరికి ఇప్పటి వరకు సమాచారం లేదు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే కంపెనీ ఆర్భాటం లేకుండానే 4 జి సేవలు ప్రారంభించబోతున్నట్టు అనిపిస్తోందని క్రెడిట్ స్విస్ తెలిపింది.

8

8

మరి వీటిపై రిలయన్స్ స్పష్టత ఎప్పుడు ఇస్తుందనేది తెలిస్తేనే జియో సిమ్‌ల మీద వినియోగదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

9

9

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write Reliance Jio Info soft launch: Get 75GB 4G data, 4500 mins call time for Rs 200; offers freebies

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X