రోజువారి ఇంటర్నెట్ లిమిట్ 10జీబి, జియో యూజర్లకు మరో ఎర

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న రిలయన్స్ జియో క్రేజ్‌ను సేబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేని ఆఫర్లను ఉన్నట్లుగా సృష్టించి జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

Read More : రూ.5,000కే యాపిల్ స్మార్ట్‌వాచ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలత అన్‌లిమిటెడ్, ఆ తరువాత 4జీబి, ఇప్పుడు 1జీబి మాత్రమే

లాంచ్ సమయంలో ప్రతి ఒక్క జియో యూజర్‌కు అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఆఫర్ చేసిన రిలయన్స్ జియో ఆ తరువాత రోజువారి ఇంటర్నెట్ వాడకాన్ని 4జీబికి కుదించింది. జనవరి 1 నుంచి అందుబాటులోకి వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా రోజుకు 1జీబి 4జీ డేటాను మాత్రమే జియో యూజర్లు ఉపయోగించుకోగలుగుతున్నారు.

ఫ్రీ డేటా కోసం ఎదురుచూస్తున్నారు

రోజుకు 1జీబి డేటా సరిపోక పోవటంతో చాలా మంది జియో యూజర్లు మరింత ఫ్రీ డేటా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విధమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో సైబర్ నేరగాళ్లు నకిలీ ఆఫర్లతో చెలరేగిపోతున్నారు.

సోషల్ మీడియాలో నకిలీ ఆఫర్..

తాజాగా, జియో నెట్‌వర్క్‌కు సంబంధించి ఓ నకిలీ ఆఫర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. jio4g.ml పేరుతో ఓ అన్‌సెక్యూర్డ్ వెబ్‌సైట్‌‌ను తయారు చేసి హ్యాకర్లు, ఈ వెబ్‌పేజీకి సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను సోషల్ మీడియాలో ఉంచారు. ఈ లింక్ పై క్లిక్ చేయడం జియో రోజువారి ఇంటర్నెట్ లిమిట్‌ను 10జీబి వరకు పెంచుకోవచ్చని హ్యాకర్లు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.

jio4g.ml అనే ఫేక్ సైట్‌లోకి డైవర్ట్ అవుతారు

యూజర్లు తొందరపడి ఈ లింక్ పై క్లిక్ చేసినట్లయితే jio4g.ml అనే ఫేక్ సైట్‌లోకి డైవర్ట్ అవుతారు. ఆ పేజీలో మీకు సంబంధించిన సమాచారం మొత్తం ఫిల్ చేయమని అడుగుతారు. అంతేకాకుండా ఈ అప్‌గ్రేడ్ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను 10 మందికి షేర్ చేయమని వారు కోరతారు. ఆ తరువాత Go4G అనే యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోమని కోరతారు. వాళ్ల ఉచ్చులో పడి ఈ యాప్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీ ఫోన్‌లోని డేటా మొత్తం గల్లంతవటంతో పాటు మీరు షేర్ చేసిన వారి డేటా కూడా హ్యాకర్ల ఉచ్చులోకి వెళ్లిపోతుంది.

మార్చి 31, 2017 వరకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌

మార్చి 31, 2017 వరకు అందుబాటులో ఉంచిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా జియో యూజర్లకు రోజుకు 1జీబి 4జీ డేటా మాత్రమే 4జీ వేగంతో లభిస్తోన్న విషయం తెలిసిందే. 1జీబి లిమిట్ దాటిన తరువాత జియో ఇంటర్నెట్ స్పీడ్ దాదాపు పడిపోతుంది. ఈ నేపథ్యంలో డేటా లిమిట్ దాటినప్పటికి జియో స్పీడ్ తగ్గకుండా మేనేజ్ చేసేందుకు పలు కూల్ ట్రిక్స్..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

ముందుగా మీ ఫోన్‌లోని MyJio యాప్‌ను ఓపెన్ చేయండి. యాప్‌లో Usage ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అందులో Data పై క్లిక్ చేసినట్లయితే, మీ డేటా యూసేజ్‌కు సంబంధించిన వివరాలు ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు మీ 1జీబి డేటా లిమిట్‌ను దాటేసిన్లయితే Back ఐకాన్ పై క్లిక్ చేసి మెయిన్ స్ర్కీన్‌లోకి వచ్చేయండి. ఇప్పుడు రీఛార్జ్ విభఆగంలోకి వెళ్లి Booster ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ జియో ఆఫర్ చేస్తున్న అనేక ప్లాన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన ప్లాన్‌ను సెలక్ట్ చేసుకుని జియోమనీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించండి.

జూన్ 30, 2017 వరకు మరో ఆఫర్...

మార్చి 31, 2017 తరువాత జియో మరో సంచలన ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు సమచారం. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తరువాత జూన్ 30, 2017 జియో సేవలను అతి తక్కుత రీఛార్జ్‌తో ఉపయోగించుకునేందుకు వీలుగా ఓ సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది.

ఇతర టెల్కోలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో...

జియో ఉచిత ఆఫర్ల పై ఇతర టెల్కోలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జియో వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రారంభ ఆఫర్ క్రింద రూ.100 మాత్రమే వసూలు చేసి మూడు నెలల పాటు డేటా అలానే వాయిస్ కాల్స్ ను జియో తన యూజర్లకు అందించే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ టాక్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G upgrade offer with 10GB daily download limit is a hoax. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot