Home
News

Reliance Jio 5G ఫోన్, జియోబుక్ ల్యాప్‌టాప్లకు సంబంధించి సరికొత్త వివరాలు

ఇండియా యొక్క టెలికాం రంగంలో పెనుసంచలనానికి మొదట నాంది పలికిన రిలయన్స్ జియో తన యొక్క మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను మరియు తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్ అయిన 'జియోబుక్‌'ను ఈ ఏడాది వార్షిక జెనరల్ మీటింగ్ (AGM) లో విడుదల చేయవచ్చని కొన్ని నివేదికలు తెలిపాయి. జియో యొక్క ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతుంది ఆలాగే ఇది ఆండ్రాయిడ్ లేదా ఆండ్రాయిడ్ గో ఆధారంగా JioOS లో రన్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా నివేదించబడింది.

ఆండ్రాయిడ్ గో

ఆండ్రాయిడ్ గో అనేది గూగుల్ యొక్క తేలికపాటి OS. ఇది హార్డ్‌వేర్‌ విభాగంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అయితే కొత్త నివేదికలు జియో ల్యాప్‌టాప్ కు సంబందించిన వివరాలను మాత్రం ఎక్కువగా విడుదల చేయలేదు. మునుపటి నివేదికలతో పోలిస్తే కొత్త నివేదిక రిలయన్స్ జియో చుట్టూ ఉన్న ఆరోపణలపై లోతైన డైవ్ ఇచ్చింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో 5G

రిలయన్స్ జియో మరియు గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న 5G ఫోన్ ఆండ్రాయిడ్ యొక్క ఏ వెర్షన్ ఫీచర్లను కలిగి ఉంటుంది అన్న దాని మీద ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ జియో నుండి రాబోయే 5G స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ గో ఓఎస్‌ను కలిగి ఉండవచ్చు మరియు ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్‌లతో రావచ్చని పేర్కొన్నారు. అయితే జియో సంస్థ ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధర వద్ద విడుదల చేసి భారత మార్కెట్లో మెరుగైన స్థావరాన్ని ఏర్పరచుకోవాలి అని చూస్తున్నది.

జియోబుక్‌

రిలయన్స్ జియో సంస్థ తక్కువ ధరలోనే విడుదల చేసే తన యొక్క ల్యాప్‌టాప్‌ల కోసం జియోఓఎస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. అయితే ఇది అవాస్తవం అయ్యే అవకాశం అధికంగా ఉంది. 4G LTE కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్ 'జియోబుక్‌'ను తయారుచేయడానికి రిలయన్స్ జియో చైనా సంస్థ బ్లూబ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో భాగస్వామ్యం కలిగి ఉందని పుకారు కూడా ఉంది. జియోబుక్ ల్యాప్‌టాప్ అభివృద్ధి గత సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభంలో ప్రారంభమైంది మరియు ఈ డివైస్ ఏప్రిల్ మధ్య నాటికి ధ్రువీకరణ పరీక్ష దశకు చేరుకునే అవకాశం అధికంగా ఉంది.

జియోబుక్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

జియోబుక్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

రిలయన్స్ జియోబుక్ ల్యాప్‌టాప్‌ యొక్క HD డిస్ప్లే 1,366x768 పిక్సెల్స్ పరిమాణంలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC తో రన్ అవుతూ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ X12 4G మోడెమ్‌తో పాటుగా 4GB వరకు LPDDR4x RAM ను మరియు 64GB వరకు eMMC స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో మినీ-HDMI కనెక్టర్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై మరియు బ్లూటూత్ వంటివి ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ JioStore, JioMeet మరియు JioPages వంటి యాప్ లను ముందే ఇంస్టాల్ చేసి అందించే అవకాశం కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Reliance Jio 5G Smartphone, JioBook Laptop Launch Date and Features Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X