జియో నుంచి 6 కారుచౌక 4జీ డేటా ప్లాన్స్, రూ.300లోపే

Posted By: BOMMU SIVANJANEYULU

రిలయన్స్ జియో రాకతో ఇండియన్ టెలికం సెక్టార్‌లో డేటా వార్ రాజుకున్న విషయం తెలిసిందే. 2016 సెప్టంబర్ 5న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన 4G VOLTE సర్వీసులను దేశంలో అధికారికంగా లాంచ్ చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెలికమ్ మార్కెట్లో జియో తన దూకుడును ప్రదర్శిస్తూనే ఉంది. జియోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వంటి టెలికమ్ ఆపరేటర్స్ సరికొత్త 4జీ ప్లాన్‌లతో ముందుకొస్తున్నప్పటికి అవి పూర్తిస్థాయిలో ప్రభావం చూపలేక పోతున్నాయి.

జియో నుంచి 6 కారుచౌక  4జీ డేటా ప్లాన్స్, రూ.300లోపే

జియో రాక ముందు మార్కెట్లో 1జీబి 4జీ డేటాను కొనుగోలు చేయాలంటే రూ.250 వరకు చెల్లించాల్సి వచ్చేది. జియో అందుబాటులోకి వచ్చిన తరువాత 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 28జీబిల 4జీ డేటా రూ.150కంటే తక్కువకే మార్కెట్లో లభ్యమవుతోంది. ఇలాంటివే కాకుండా పలు కారుచౌక 4జీ డేటా ప్లాన్లను కూడా జియో ఈ మధ్యనే మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.19 సాచెట్ ప్యాక్..

ఈ ప్యాక్‌ ఒక రోజు వ్యాలిడిటీతో లభ్యమవుతోంది. ప్లాన్‌లో భాగంగా 0.15జీబి 4జీ డేటాతో పాటు 20 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ పూర్తి అయిన తరువాత నెట్ స్పీడ్ కాస్తా 64kbpsకు తగ్గించబడుతుంది.

రూ.52 సాచెట్ ప్యాక్

ఈ ప్యాక్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంటుంది. మొత్తం ప్లాన్‌లో భాగంగా 1.05జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 0.15జీబి చొప్పున 7 రోజుల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. వాయిస్ కాల్స్‌తో పాటు 70 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ పూర్తి అయిన తరువాత నెట్ స్పీడ్ కాస్తా 64kbpsకు తగ్గించబడుతుంది.

రూ.98 సాచెట్ ప్యాక్ఈ ప్యాక్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంటుంది. మొత్తం ప్లాన్‌లో భాగంగా 2.1జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 0.15జీబి చొప్పున 14 రోజుల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. వాయిస్ కాల్స్‌తో పాటు 140 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ పూర్తి అయిన తరువాత నెట్ స్పీడ్ కాస్తా 64kbpsకు తగ్గించబడుతుంది.

ఈ ప్యాక్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంటుంది. మొత్తం ప్లాన్‌లో భాగంగా 2.1జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 0.15జీబి చొప్పున 14 రోజుల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. వాయిస్ కాల్స్‌తో పాటు 140 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ పూర్తి అయిన తరువాత నెట్ స్పీడ్ కాస్తా 64kbpsకు తగ్గించబడుతుంది.

Xiaomi యూజర్లకు వాట్సప్ షాక్, సమస్య నుంచి బయడపడటం ఎలా .?

రూ.149 ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. మొత్తం ప్లాన్‌లో భాగంగా 28జీబిల డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 1జీబి చొప్పున 28రోజుల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచిత అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ పూర్తి అయిన తరువాత నెట్ స్పీడ్ కాస్తా 64kbpsకు తగ్గించబడుతుంది.

రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. మొత్తం ప్లాన్‌లో భాగంగా 42జీబిల డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 1.5జీబి చొప్పున 28రోజుల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచిత అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ పూర్తి అయిన తరువాత నెట్ స్పీడ్ కాస్తా 64kbpsకు తగ్గించబడుతుంది.

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. మొత్తం ప్లాన్‌లో భాగంగా 56జీబిల డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు 2జీబి చొప్పున 28రోజుల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచిత అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ పూర్తి అయిన తరువాత నెట్ స్పీడ్ కాస్తా 64kbpsకు తగ్గించబడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio recently slashed the price of its 4G data plans and came up with sachet packs for additional requirements. Here we have listed the cheapest Jio 4G data plans for you under Rs. 300. You can consider these if you do not want to spend a lot of money on the recharge and want to enjoy 4G data.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot