3 నెలల వాలిడిటీతో జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!

|

మనుషులలో ఏ ఒక్కరి మానసత్వాలు మరొకరికి సమానంగా ఉండవు. ఉదాహరణకు ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వినియోగదారుల యొక్క డేటా అవసరాల విషయానికి వస్తే కొంతమందికి 1GB డేటా అవసరం అయితే మరికొంతమందికి రోజుకు 2GB లేదా 3GB డేటా అవసరం ఉంటుంది. అందువల్ల టెలికామ్ సంస్థలు తమ యొక్క వినియోగదారుల అవసరాలను తీర్చడానికి వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియో టెలికం ఆపరేటర్ అందిస్తున్న ప్లాన్‌ల గురించి వివరాలను తెల్సుకుందాం.

జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను
 

జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను

టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను జోడించడం మరియు తొలగించడం ఇప్పటికి కొనసాగిస్తున్నది. జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇతర టెల్కోల యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల కంటే కొద్దిగా బిన్నంగా కూడా ఉన్నాయి. దీనికి గల కారణం వాటి యొక్క ధరలు. రిలయన్స్ జియో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడమే కాకుండా మార్కెట్‌లో చౌకైన ధరల వద్ద కూడా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది.

లాక్ డౌన్ మొదలై దాదాపుగా నాలుగు నెలలు

లాక్ డౌన్ మొదలై దాదాపుగా నాలుగు నెలలు

ఇండియాలో లాక్ డౌన్ మొదలై దాదాపుగా నాలుగు నెలలు అవుతున్నాయి. అలాగే మరొక మూడు నెలల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగే సూచనలు ఉన్నాయి అని కొంత మంది సూచిస్తున్నారు. ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వారు ఇప్పుడు రిలయన్స్ జియో నుండి 84 రోజుల చెల్లుబాటుతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడం అన్నిటికంటే ఉత్తమం. 84-రోజుల చెల్లుబాటుతో జియో మూడు రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను వివిధ రకాల డేటా ఆఫర్లతో అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

రిలయన్స్ జియో రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

84 రోజుల చెల్లుబాటుతో రిలయన్స్ జియో అందిస్తున్న చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. రూ.555 ధర వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ 1.5GB రోజువారీ డేటాను అందించడంతో పాటు జియో-టు-జియో కోసం అపరిమిత కాలింగ్ మరియు జియో-టు-నాన్-జియో కాలింగ్ కోసం 3,000 FUP నిమిషాలను అందిస్తుంది. వీటితో పాటుగా రోజుకు 100SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వినియోగదారులు మొత్తం 84 రోజుల వాలిడిటీ వ్యవధిలో మొత్తంగా 126GB డేటాను అందుకుంటారు. దీనితో పాటు అన్ని రకాల జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందా కూడా ఉచితంగా అందిస్తుంది. రోజుకు 1GB డేటా అవసరమయ్యే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ సరైనది.

రిలయన్స్ జియో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు
 

రిలయన్స్ జియో రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

84 రోజుల చెల్లుబాటుతో రిలయన్స్ జియో అందిస్తున్న రెండవ ప్లాన్ ఇది. మొదటి ప్లాన్ కంటే కేవలం రూ.45 ఎక్కువ ధరకే ఈ ప్లాన్‌ లభిస్తుంది. కస్టమర్‌ ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా 168GB డేటా ప్రయోజనం పొందుతాడు. ఇది రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఇది ప్రతి రోజు రాత్రి 12AM కి రీసెట్ అవుతుంది. ఇది జియో-టు- నాన్ జియో కాలింగ్ కోసం 3,000 FUP నిమిషాలతో పాటు అపరిమిత Jio-to-Jio కాలింగ్‌ను కూడా అందిస్తుంది. జియో యొక్క ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే ఇది కూడా రోజుకు 100 SMSల ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా అందిస్తుంది. ప్రతిరోజూ 1.5GB మరియు 2GB డేటాను వినియోగించాలని చూస్తున్నవారికి ఈ ప్లాన్ సరైనది.

రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

84 రోజుల చెల్లుబాటుతో రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ఇది. రూ.999 ధర వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలంలో 252GB డేటాను అందిస్తుంది. అంటే ఇది ప్రతిరోజూ 3GB డేటాను అందిస్తుంది. అన్ని ప్లాన్ల మాదిరిగానే ఇది కూడా అర్ధరాత్రి రీసెట్ అవుతుంది. ఈ ప్లాన్ లో FUP నిమిషాల పరిమితిలో ఎటువంటి తేడా లేదు. 84 రోజుల వాలిడిటీతో టెల్కో నుండి వస్తున్న ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఇది కూడా 3,000 FUP నిమిషాలను అందిస్తుంది. ఇది రోజుకు 100 SMS ప్రయోజనాలను మరియు జియో-టు-జియో కోసం అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. దీనితో పాటు జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను ఉచితంగా అందిస్తుంది. ప్రతిరోజూ 3GB డేటాను వినియోగించాల్సిన అవసరం ఉన్నవారికి ఈ ప్లాన్ సరైనది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio 84 Days Validity Prepaid Plans Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X