ఇది జియో సునామీ.. ఒక్క నెలలో 1.96 కోట్ల యూజర్లు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఇన్ఫోకామ్ మరోసారి ప్రభంజనం సృష్టించింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఇన్ఫోకామ్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. అక్టోబర్ 2016కు గాను ఈ నెట్‌వర్క్‌లో 1.96 కోట్ల మంది యూజర్లు కొత్తగా జాయిన్ అయినట్లు తాజాగా విడుదలైన ట్రాయ్ నివేదిక చెబుతోంది.

Read More : రూ.2,000లో సిద్ధంగా ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ కేవలం 2.3 మిలియన్ చందాదారులను మాత్రమే రాబట్టగలిగింది. వొడాఫోన్ 1.1 మిలియన్ , ఐడియా సెల్యులార్ 6.33 మిలియన్ యూజర్లను రాబట్టగలిగాయి.

మార్కెట్ షేర్ 24.76% నుంచి 24.32%కు
ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ యూజర్ బేస్‌కు సంబంధించిన మార్కెట్ షేర్ 24.76% నుంచి 24.32%కు తగ్గిందని ట్రాయ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఇదే సమయంలో వొడాఫోన్ మార్కెట్ షేర్ 18.72, ఐడియా మార్కెట్ షేర్ 17.17శాతంగా ఉంది.

టాటా టెలీసర్వీసెస్‌కు నష్టం..
ఇదే నెలలో టాటా టెలీ సర్వీసెస్ 1.3 మిలియన్ చందాదారులను కోల్పోగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 1 మిలియన్ చందాదారులను కోల్పొయిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. అక్టోబర్‌కు ముందు నెల అయిన సెప్టంబర్‌లో 16 మిలియన్ల కొత్త యూజర్లను జియో నమోదు చేసింది.

మార్చి 2017 నాటికి ఈ సంఖ్య 100 మిలియన్లకు
సెప్టంబర్ 5, 2016న మార్కెట్లో లాంచ్ అయిన రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నవారి సంఖ్య 58 మిలియన్లకు చేరుకున్నట్లు సమాచారం. మార్చి 2017 నాటికి ఈ సంఖ్య 100 మిలియన్లకు చేరుకోనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్రాయ్ నివేదిక ప్రకారం..
ట్రాయ్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వైర్‌లెస్ మొబైల్ చందాదారుల సంఖ్య అక్టోబర్ 2016 చివరి నాటికి 1,078.42 మిలియన్ యూజర్లుగా ఉంది. సెప్టంబర్‌లో ఈ సంఖ్య 1,049.74 మిలియన్ యూజర్లుగా ఉంది.

పట్టణాల్లో వైర్‌లెస్ మొబైల్ చందాదారుల సంఖ్య
పట్టణాల్లో వైర్‌లెస్ మొబైల్ చందాదారుల సంఖ్య అక్టోబర్ 2016 చివరి నాటికి 621.77 మిలియన్ యూజర్లుగా ఉంది సెప్టంబర్‌లో ఈ సంఖ్య 621.77 మిలియన్‌గా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లెస్ మొబైల్ చందాదారుల సంఖ్య..
గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లెస్ మొబైల్ చందాదారుల సంఖ్య అక్టోబర్ 2016 చివరి నాటికి 456.66 మిలియన్‌గా ఉంది. సెప్టంబర్‌లో 2016లో ఈ సంఖ్య 445.94 మిలియన్‌గా ఉంది.

ల్యాండ్‌లైన్ చందాదారుల సంఖ్య
ఇక దేశవ్యాప్తంగా నమోదైన ల్యాండ్‌లైన్ చందాదారుల సంఖ్య అక్టోబర్ 2016 చివరి నాటికి 24.52 మిలియన్ గా ఉంది. సెప్టంబర్ 2016లో ఈ సంఖ్య 24.51 మిలియన్‌గా ఉంది.

బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల విషయానికి వచ్చేసరి
ఇక బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల విషయానికి వచ్చేసరికి అక్టోబర్ 2016 చివరి నాటికి దేశవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందే వారి సంఖ్య 218.42 మిలియన్ యూజర్లుగా ఉంది. సెప్టంబర్‌లో 2016లో ఈ సంఖ్య 192.30 మిలియన్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








