ప్రతి సెకనుకు 7గురు జియో కస్టమర్లు:ముకేశ్ అంబానీ

By: Madhavi Lagishetty

టెలికాం రంగంలోనే పెను సంచలనానికి తెరలేపింది రిలయన్స్ జియో. గతేడాది సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతిరోజు సెకనుకు ఏడుగురు జియోకు కస్టమర్లుగా మారుతున్నారు.

ప్రతి సెకనుకు 7గురు జియో కస్టమర్లు:ముకేశ్ అంబానీ

జియో సేవలను వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య స్పీడ్ గా పెరిగిందని...ఫేస్ బుక్, వాట్సప్ , స్కైప్ వంటి అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలను జియో మించిపోయిందని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇప్పటికే జియో ఖాతాలో 125మిలియన్ల మంది కస్టమర్లు చేరినట్లు స్పష్టంచేశారు.

జియో సేవలు షురూ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నెలవారీ డాటా 20కోట్ల జిబి నుంచి 120కోట్ల జిబికి చేరుకుంది. రిలయన్స్ జియో వినియోగదారులు ప్రతినెలా 125కోట్ల డాటాను వినియోగిస్తున్నారు. ప్రతినెలా 4జీ వేగంతో 165కోట్ల గంటలపాటు వీడియోలను వీక్షిస్తున్నారు. మొబైల్ డాటా వినియోగంలో అమెరికా...చైనాను భారత్ అధిగమించింది.

ప్రతి సెకనుకు 7గురు జియో కస్టమర్లు:ముకేశ్ అంబానీ

జియో సేవలకు ముందు మొబైల్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లో 155వ స్థానంలో ఇండియా నిలిచింది. మొబైల్ డాటా వాడటంలో ఫస్ట్ ప్లేస్ కు చేరుకుందని....సేవల వ్యాప్తిలోనూ త్వరలోనే అగ్రస్థానానికి చేరుకునే ఛాన్స్ ఉందని ముకేశ్ అంబానీ అన్నారు.

ఇండియాలో ప్రస్తుతం ఉన్న 50కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని రిలీజ్ చేస్తున్న ఈ మొబైల్ తో లైఫ్ టైం వాయిస్ కాలింగ్ చేసుకునే అవకాశంతో పాటు ఎస్ఎంఎస్ లు కూడా ఫ్రీ.

జియో ఫోన్ ను బుకింగ్ చేసుకునే కస్టమర్లు ఎలాంటి డబ్బును చెల్లించాల్సిన అవసరంలేదని ముకేశ్ అంబానీ తెలిపారు. కేవలం సెక్యూరిటి డిపాజిట్ కొరకు 15వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మూడు సంవత్సరాల్లో డిపాజిట్ ను తిరిగి చెల్లించనున్నట్లు ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు.

English summary
the company has also launched its feature phone i.e JioPhone.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot