జియో హోలీ అఫర్, కస్టమర్లకు 10 జిబి డేటా ఉచితం !

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం హోలీ ఆఫర్ ను మోసుకొచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా యూజర్లకు 10జిబి డేటాను ఉచితంగా అందించనుంది. తమ కస్టమర్ల అంతా ఈ 10జిబి డేటాతో హోలీ జరుపుకోవాలని రిలయన్స్ జియో చెబుతోంది. కాగా ఈ డేటా ప్యాక్ జియో టీవీ అప్లికేషన్ లో యాడ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇది జియో టీవీ లైమ్ స్ట్రీమింగ్ అప్లికేషన్. ఇందులో దాదాపు 550 లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. 10 జిబి డేటాను యూజర్లు మార్చి 27 2018 వరకు వాడుకోవాలి. ఆ తరువాత ఈ ఆఫర్ వర్తించదు.అయితే ఈ డేటా అందరికీ అందుబాటులో లేదని ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమేనని జియో చెబుతోంది.

ఈ రోజు నుంచి పేటీఎమ్ Mobikwik పనిచేయవు, ఎందుకో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1299కి కాల్

ఈ ఆఫర్ మీకు వర్తిస్తుందో లేదో తెలుపుకోవాలంటే మీరు ముందుగా 1299కి కాల్ చేయాలి. ఆ తరువాత మీరు చేసిన కాల్ ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. కాల్ కట్ కాగానే మీకు మెసేజ్ రూపంలో కాని లేక . జియో యాప్స్ లో కాని యాడ్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్

మీరు కాల్ చేసిన తరువాత ఓ సారి మైజియో యాప్ లో కెళ్లి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1299కి కాల్ చేయండి 10 జిబి డేటా పొందండంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ లలో చాలామంది డేటా వచ్చిందంటూ స్క్రీన్ షాట్లతో పోస్టులు చేస్తున్నారు.

రూ.101 ప్యాక్‌తో

కాగా రూ.101 ప్యాక్‌తో జియో 6జిబి డేటాను కస్టమర్లకు అందిస్తోంది. కాగా ఇది పాత ప్లాన్. ఉదాహరణకు మీరు రూ.149తో రీఛార్జ్ చేసుకుంటే మీకు రోజుకు 1.5 జిబి డేటా చొప్పున నెల రోజుల పాటు లభిస్తుంది. అయితే ఇందులోనే మీకు అదనంగా 10 జిబి డేటా యాడ్ అయినట్లు చూపిస్తుంది.

నిరాశాకరమైన విషయం ఏంటంటే

అయితే నిరాశాకరమైన విషయం ఏంటంటే ఈ ఆఫర్ కొంతమంది జియో కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. సో ఈ ఆఫర్ కు మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు 1299కి డయల్ చేసి వివరాలు తెలుసుకోవాలని మనవి.

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు

రూ. 9,999
360 రోజుల పాటు 750 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. ఉచిత కాల్స్ అందుబాటులో ఉంటాయి.
రూ. 4,999
360 రోజుల పాటు 350 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు
రూ. 1,999
180 రోజుల పాటు 125 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 999
90 రోజుల పాటు 60 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 799
28 రోజుల పాటు రోజుకు 3 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 509
49 రోజుల పాటు రోజుకు2 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Adding 10GB Free Data Add-On Pack to Select Customers More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot