జియో సిమ్ వాడుతున్నారా?...అయితే మీకు గుడ్ న్యూస్!

By: Madhavi Lagishetty

మీరు రిలయన్స్ జియో సిమ్ వాడుతున్నారా? అయితే అందులో జియో యాప్ ఇన్ స్టాల్ చేశారా? అయితే మీకు గుడ్ న్యూస్. మై జియోకి వచ్చిన అప్ డేట్ తో హల్లో జియో అనే వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కల్పించారు. త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

జియో సిమ్ వాడుతున్నారా?...అయితే మీకు గుడ్ న్యూస్!

ఇప్పటికే జియో ఫోన్లలో అందుబాటులో ఉన్న ఈ వాయిస్ అసిస్టెంట్....ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లను వాడుతూ రిలయన్స్ జియో సిమ్ ను కలిగి ఉన్న వారికి ఇది ప్రవేశపెట్టబడింది. హిందీ, ఇంగ్లీష్ భాషలను సపోర్టు చేస్తుంది. 

ఉత్తర కొరియాపై నిప్పులు చెరిగిన అమెరికా, ఆ దాడి కిమ్ పనే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మై జియో యాప్ను

మీ ఫోన్లో మై జియో యాప్ను అప్ డేట్ చేసిన తర్వాత..జియో యాప్స్ పక్కనే కొత్తగా ఓ మైక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్నిపై క్లిక్ చేస్తే..హలో జియో వాయిస్ అసిస్టెంట్లోకి వెళ్లిపోవచ్చు.

కుడివైపున ఒక టోగుల్..

హలోజియో స్క్రీన్ కుడివైపున ఒక టోగుల్ ఉంటుంది. ఇది రెండు భాషల మధ్య ఈజీగా మారిపోతుంటుంది.

అప్ డేట్ వెర్షన్ లోకి

యూజర్లు మైజియో యాప్ అప్ డేట్ వెర్షన్ లోకి వెళ్లిన తర్వాత ఈ ఫీచర్ కనిపిస్తుంది.

గూగుల్ అసిస్టెంట్స్ లో లాగా..

ఈ కొత్త ఫీచర్ గురించి...గూగుల్ అసిస్టెంట్స్ లో లాగా దీనికి ఎలాంటి వాయిస్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ హలో జియో కేవలం మై జియో యాప్ లోని పలు సదుపాయాలను వినియోగించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ..

యాప్ లో మొబైల్ రీచార్జ్ చేయమని, అకౌంట్స్ బ్యాలెన్స్ చూపించమని, ఇతర పనులను మాత్రమే హలో జియో సాయంతో చేయవచ్చు. ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Reliance Jio has now reportedly added an interesting new feature to its MyJio app.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot