Home
News

Reliance Jio AGM ఈవెంట్‌ ప్రారంభం కానున్నది!! లైవ్ చూడాలని ఉందా??

రిలయన్స్ జియో యొక్క 44 వ యానువల్ జనరల్ మీటింగ్ (AGM) ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కరోనా యొక్క నిబంధనలను పాటిస్తూ ఈ మీటింగ్ ఆన్‌లైన్ పద్దతిలో ఈవెంట్‌గా ఉంటుంది. అయితే జియో సంస్థ తన యొక్క అభిమానుల కోసం ఈవెంట్‌ను సంస్థ యొక్క యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఎప్పటిలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు.

రిలయన్స్ జియో AGM 2021 లైవ్ స్ట్రీమ్

రిలయన్స్ జియో AGM 2021 లైవ్ స్ట్రీమ్

రిలయన్స్ జియో సంస్థ ఈ రోజు నిర్వహించే AGM లైవ్ ఈవెంట్‌లో విడుదల చేసే కొత్త ప్రకటనల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు క్రింద తెలిపిన లింక్ లో లైవ్ స్ట్రీమ్ వీడియోను చూడవచ్చు. రిలయన్స్ జియో AGM 2021 వద్ద ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియోను 2 PM నుండి చూడండి.

ఇది కాకుండా ఆసక్తిగల జియో అభిమానులు ఈ క్రింది గల ఇతర ఛానెళ్ల ద్వారా కూడా లైవ్ స్ట్రీమ్ ను చూడవచ్చు.

Https://jiomeet.jio.com/rilagm పై క్లిక్ చేయడం ద్వారా మీరు JioMeet ద్వారా లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు. ఈవెంట్‌ మొదలవ్వడానికి 30 నిమిషాల ముందు ఈ లింక్ అందుబాటులో ఉంటుంది. అలాగే మీరు లైవ్ స్ట్రీమ్ చూడటానికి కంపెనీ ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్ యూట్యూబ్ ఛానల్ మరియు జియో ఛానెల్ లను కూడా అనుసరించవచ్చు. ఇంకా మీరు సంస్థ యొక్క ఫేస్బుక్ మరియు ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా లైవ్ ఈవెంట్‌ యొక్క ప్రత్యక్ష చర్యతో మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో AGM 2021 లో ఎటువంటి ప్రకటనలను ఆశించవచ్చు?

రిలయన్స్ జియో AGM 2021 లో ఎటువంటి ప్రకటనలను ఆశించవచ్చు?

ఇప్పటికే రిలయన్స్ జియో మరియు గూగుల్ సంస్థల భాగస్వామ్యంతో సరసమైన ఆఫర్‌గా భావిస్తున్న జియో 5G స్మార్ట్‌ఫోన్‌తో సహా అనేక ఉత్పత్తులను ప్రారంభించబడే అవకాశాలు ఉన్నాయి అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి దేశంలో రియల్‌మి 8 ఫోన్ రూ.13,999 ధర వద్ద అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ గా ఉంది. జియో 5G స్మార్ట్‌ఫోన్ రూ.2,500 ధర వద్ద లాంచ్ అవుతూ మార్కెట్ లో ప్రకంపనలను తీసుకువస్తుందో అని ఆశించవచ్చు.

జియోబుక్

అలాగే జియోబుక్ అనే సరసమైన జియో ల్యాప్‌టాప్‌ను తీసుకురావాలని జియో ఉహించారు. గూగుల్, క్వాల్‌కామ్‌ల సహకారంతో దీన్ని లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ జియో ల్యాప్‌టాప్ యొక్క మరిన్ని వివరాలను బహిర్గతం చేసే అనేక లీక్‌లను మేము ఇప్పటికే చూశాము.

జియో 5G ప్లాన్‌

విజయవంతమైన 4G ప్రయాణం తరువాత జియో కూడా 5G ప్లాన్‌లతో ముందుకు వస్తుందని అందరు భావిస్తున్నారు. ఇప్పటికే టెల్కో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5G ట్రయల్స్ చేపట్టింది. జియో 5G ప్లాన్‌లను హైస్పీడ్ తో పాటుగా తక్కువ ధర వద్ద త్వరలో విడుదల చేయనున్నట్లు ఆశించవచ్చు.


Jio AGM కొన్ని గంటల్లో కిక్‌స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నందున ఈ ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి అధికారిక నిర్ధారణ పొందడానికి అందరు వేచి ఉండాలి.

 

Best Mobiles in India

English summary
Reliance Jio AGM 2021: How To Watch Livestream, What To Expect?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X