Home
News

50 రోజుల పాటు ఉచిత ఆఫర్ తో Jio Airfiber ! ఎవరు పొందగలరు?

Jio AirFiber, రిలయన్స్ జియో నుండి వచ్చిన 5G FWA (ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్) సేవలు. ఇవి ఇప్పుడు భారతదేశంలోని 5352 నగరాలు మరియు పట్టణాల్లోని వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ప్రమోట్ చేయడానికి, Jio 50 రోజుల పాటు ఉచితంగా సేవలను వినియోగదారులకు అందిస్తోంది.

అవును, రిలయన్స్ జియో యొక్క కొత్త వినియోగదారులు మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఇద్దరూ కూడా ఈ ఉచిత సేవను ఎంచుకోవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 స్ట్రీమింగ్ కోసం ఎక్కువ మంది వ్యక్తులు JioCinema కి మారినందున 50-రోజుల ఈ ఉచిత ఆఫర్ గొప్ప సమయంలో వచ్చింది. ఈ ఆఫర్ ఏమిటి మరియు మీరు దానిని ఎలా పొందవచ్చో వివరాలు ఇక్కడ చూద్దాం.

Reliance Jio AirFiber Offering 50Days Free Offer

Jio AirFiber 50 రోజుల ఉచిత ఆఫర్ వివరాలు
Jio AirFiber కోసం 50 రోజుల ఉచిత ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది అంటే? ఈ ఆఫర్ ను మీరు యాక్సిస్ చేయడానికి అంగీకరించే నాటికి 2 వారాల కంటే ఎక్కువ 5G పరికరంలో మీరు Jio True5G ని ఉపయోగిస్తూ ఉండాలి. అలాంటి వినియోగదారులు మాత్రమే ఈ ఆఫర్ పొందగలరని జియో తెలిపింది.

అంటే, ఆఫర్‌ను పొందడానికి కస్టమర్ కనీసం రెండు వారాల పాటు Jio యొక్క True 5G సేవను ఉపయోగించాలి. Jio AirFiber కనెక్షన్‌ని పొందడానికి అదే అర్హత గల నంబర్ ఉపయోగించబడుతుంది.

అలాగే, కస్టమర్ 6 లేదా 12 నెలల పాటు ముందస్తు చెల్లింపుతో రూ. 599 మరియు అంతకంటే ఎక్కువ OTT ప్లాన్‌లకు వెళుతున్నట్లయితే మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద ఉన్న డిస్కౌంట్ వోచర్ యూజర్ యొక్క MyJio ఖాతాలో AirFiber యాక్టివేషన్ అయిన 24 గంటలలోపు క్రెడిట్ చేయబడుతుంది.

ఈ ఆఫర్ మార్చి 16, 2024న ప్రారంభమైంది. ఇది పరిమిత-కాల ఆఫర్ కాబట్టి, కంపెనీ దీన్ని ఎప్పుడైనా తీసివేయవచ్చు కాబట్టి మీరు ఇప్పుడే దాన్ని పొందడం ఉత్తమం.

ఈ ఆఫర్ కింద Jio AirFiber ని యాక్టివేట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 అని Jio తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు క్రెడిట్ చేయబడే డిస్కౌంట్ వోచర్‌ను మరొకరికి బదిలీ చేయడం సాధ్యం కాదు. దీని ద్వారా, మీరు జియో ఎయిర్‌ఫైబర్ సేవలను 50 రోజుల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. భారతదేశంలో 5G FWAని ప్రయత్నించాలని కోరుకునే వారికి ఇది మంచి ఆఫర్.

AirFiber కి ఒక ప్రాంతంలో ఫైబర్ అవసరం లేదు కానీ ఫైబర్ కనెక్షన్ వంటి వేగాన్ని అందించగలదు. జనవరి 2024 లో, Jio AirFiber దేశంలోని 3939 నగరాలు/పట్టణాల్లో ఉంది. కానీ ఇప్పుడు, ఇది మార్చిలో 5352 నగరాల్లో అందుబాటులో ఉంది. రాబోయే నెలల్లో, Jio 5G SA (స్వతంత్ర) నెట్‌వర్క్‌లను అమలు చేసిన దేశంలోని మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.

Best Mobiles in India

English summary
Reliance Jio AirFiber Offering 50Days Free Offer. Offer Benefits And Who Can Avail This Offer Explained Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X