ఐపీఎల్ సందర్భంగా దిగ్గజాలు ఇస్తున్న బెస్ట్ ఆఫర్లు ఇవే

Written By:

దేశీయ టెలికాం దిగ్గజాలు ఇప్పుడు ఐపీఎల్ మీద పడ్డాయి. యూజర్లకు ఐపీఎల్ అనుభూతిని అందించేందుకు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో లాంటి దిగ్గజాలు అత్యంత తక్కువ ధరకే అధిక డేటాను అందిస్తూ కస్టమర్లను ఆఫర్ల మత్తులో ముంచెత్తుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటినీ మొబైల్ ద్వారా వీక్షించేందుకు కావాల్సిన డేటాను అందుబాటులోకి తీసుకొస్తోంది. లైవ్ స్ట్రీమ్ తో ఇప్పుడు యూజర్లకు ఈ దిగ్గజాలు అందిస్తున్న ప్లాన్లపై ఓ లుక్కేద్దామా..

బెంగుళూరులో అతి పెద్ద ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance Jio’s Rs. 251 Cricket Season Pack

క్రికెట్ పండుగను దృష్టిలో ఉంచుకుని జియో సరికొత్త రీఛార్జి ప్యాక్ ను ప్రవేశపెట్టింది. ‘జియో క్రికెట్ సీజన్ ప్యాక్' పేరుతో అందించనున్న ఈ ప్యాక్ ద్వారా రూ. 251 చెల్లించి 51 రోజులకు 102 జీబీ 4జీ డేటాను పొందే వీలుంది. ఈ కొత్త రీఛార్జి ప్యాక్ ద్వారా ప్రేక్షకులు తమకిష్టమైన ఐపిఎల్ మ్యాచ్ లను ‘జియో టీవీ' యాప్ ద్వారా వీక్షించవచ్చు.

Airtel’s IPL live streaming offers

జాగా లాంచ్‌ చేసిన రూ. 499 ప్లాన్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్‌ లిమిటెడ్‌, లోకల్‌, రోమిండ్‌ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. దీని అర్థం, ఎయిర్‌టెల్‌ మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట.ఈ క్రమంలో ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజూ లభించే 2 జీబీ డేటాను ఉపయోగించుకుని రోజూ ప్రసారమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లను ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో వీక్షించవచ్చు.

BSNL’s new Rs. 248 plan

బిఎస్ఎన్ఎల్ స్పెషల్‌ ఐపీఎల్‌ ప్లాన్‌గా 258 రూపాయలతో ఓ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించింది. 51 రోజుల వాలిడిటీతో ఈ ప్యాక్‌పై 153 జీబీ డేటా ఆఫర్‌ చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది. తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ కస్టమర్లకు ఎస్‌టీవీ రూ.258పై 51 రోజుల వాలిడిటీతో అపరిమిత డేటా, రోజుకు 3జీబీ డేటాను అందించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. తక్కువ రేటుకు లైవ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్ట్రీమ్‌ చేసుకునేందుకు తమ సబ్‌స్క్రైబర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్‌ చేసుకునే మార్గం

రూ.99 సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసిన జియో యూజర్‌ అయినప్పటికీ ప్రైమ్‌ను పొడిగించుకోవడానికి మెసేజ్‌ రాకపోతే, ముందుగా జియో యాప్‌ను క్లోజ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం 15 నిమిషాల పాటు వీడియోలను స్ట్రీమ్‌ చేయాలి. ఆ తర్వాత మరోసారి జియో యాప్‌ను తిరిగి స్టార్ట్‌ చేయాలి. ఏ నెంబర్‌కు అయితే జియో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొడిగించాలనుకుంటున్నారో ఆ నెంబర్‌ను వాడుతూ లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్‌ చేసుకునే మార్గం

ఆ సమయంలో జియో యాప్‌లో బ్యానర్‌ పేజీలో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ రెన్యూవల్‌ ఆప్షన్‌ కనిపిస్తోంది. ఆ ఆప్షన్‌పై యూజర్లు అప్లయ్‌ చేసుకోవాలి. స్టాండర్డ్‌ రెన్యూవల్‌ ప్రాసెస్‌ను యూజర్లు ఫాలో అవ్వాలి. బ్యానర్‌లో గెట్‌ నౌ అనే బటన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ బటన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత మరో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ను పొడిగిస్తున్నట్టు ఒక మెసేజ్‌ వస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రర్‌ నెంబర్లు కూడా వస్తాయి.

జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్‌ చేసుకునే మార్గం

ఆ నెంబర్లలో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొడిగించాలనుకున్న నెంబర్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో ఈ సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ పూర్తైపోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio vs Airtel vs BSNL IPL 2018 live streaming offers compared More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot