జియో 4జీ vs ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్

Reliance jio రాకతో టెలికం రంగంలో డేటా వార్ మొదలైంది. జియో ఆఫర్ల దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఉన్న డేటా ప్యాక్స్‌కు అదనపు డేటాను అందిస్తోన్న విషయం తెలిసిందే. తన 4జీ ఇంటర్నెట్ సేవలతో మొబైల్ ఇంటర్నెట్ రంగంలో భారత్ టాప్ 10 స్థానానికి తీసుకువెళ్లాలని భావిస్తోన్న రిలయన్స్ జియో ఆసక్తికర ఆఫర్లతో జనంలోకి దూసుకువెళుతోంది.

Read More : రూ.2,999కే 4G VoLTE ఫోన్.. Jio సిమ్ యాక్టివేషన్‌తో

జియో 4జీ  vs ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్

వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా అందరికి డిసెంబర్ 31, 2016 వరకు అన్ని రకాల జియో సేవలను ఉచితంగా అందించటంతో పాటు, ఆఫర్ ముగిసిన తరువాత తక్కువ రేట్లకే 4జీ డేటా ఇంకా అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్ తదితర బెనిఫిట్స్‌ను చేరువ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లు జియో వైపు మెగ్గుచూపుతున్నారు. మార్కెట్లో రిలయన్స్ జియోతో పాటు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు ఆఫర్ చేస్తున్న 4జీ ప్లాస్‌లకు సంబంధించిన వివరాలను ఇఫ్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

1జీబి 4జీ డేటాకు

రిలయన్స్ జియో - 1జీబి డేటాకు సంబంధించి ఖచ్చితమైన డేటా ప్లాన్ జియో వద్ద ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
ఎయిర్‌టెల్ - 1జీబి 4జీ డేటాకు రూ.255 వసూలు చేస్తోంది.
వొడాఫోన్ - 1జీబి 4జీ డేటాకు రూ.255 వసూలు చేస్తోంది.
ఐడియా సెల్యులార్ - 1జీబి 4జీ డేటాకు రూ.246 వసూలు చేస్తోంది. (సెలక్టడ్ సర్కిల్స్‌లో మాత్రమే)

 

#2

2జీబి 4జీ డేటాకు

రిలయన్స్ జియో - రూ.299, ఉచిత వాయిస్ కాలింగ్, నైట్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంకా అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు మీకు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్‌టెల్ - రూ.455
వొడాఫోన్ - రూ.359
ఐడియా సెల్యులార్ - రూ.455

 

#3

4జీబి 4జీ డేటాకు

రిలయన్స్ జియో - రూ.499, ఉచిత వాయిస్ కాలింగ్, నైట్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంకా అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు మీకు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్‌టెల్ - రూ.755
వొడాఫోన్ - రూ.559
ఐడియా సెల్యులార్ - రూ.755

 

#4

రూ.1000 చెల్లిస్తే..

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో రూ.1000 చెల్లించినట్లయితే 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీబి 4జీ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్, నైట్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంకా అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్.
ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో రూ.1000 చెల్లించినట్లయితే 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.
వొడాఫోన్ నెట్‌వర్క్‌లో రూ.1000 చెల్లించినట్లయితే 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.
ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్‌లో రూ.1000 చెల్లించినట్లయితే 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 6జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.

 

#5

రూ.1500 చెల్లిస్తే..

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో రూ.1000 చెల్లించినట్లయితే 20జీబి 4జీ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్, నైట్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంకా అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు మీకు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో రూ.1500 సంబంధించి ఖచ్చితమైన డేటా ప్లాన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
వొడాఫోన్ నెట్‌వర్క్‌లో రూ.1500 చెల్లించినట్లయితే 15జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.
ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్‌లో రూ.1500 చెల్లించినట్లయితే 11.5జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.

 

#6

రూ.2000 చెల్లించినట్లయితే...

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో రూ.2000 చెల్లించినట్లయితే 24జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది. ఉచిత వాయిస్ కాలింగ్, నైట్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంకా అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు మీకు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో రూ.2000 సంబంధించి ఖచ్చితమైన డేటా ప్లాన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
వొడాఫోన్ నెట్‌వర్క్‌లో రూ.2000 చెల్లించినట్లయితే 20జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.
ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్‌లో రూ.2000 చెల్లించినట్లయితే 16జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.

 

#7

రూ.4,999కి రిలయన్స్ జియో 75జీబి డేటాను ఆఫర్ చేస్తోంది.

#8

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే వారికి వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. లోకల్, ఎస్‌‌టీడీ తేడా ఉండదు. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవ్చు. రోమింగ్ ఛార్జీలు ఉండవు. డిసెంబర్ 31 2017 వరకు రిలయన్స్ జియో యాప్ సూట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ యాప్ సూట్ నెల వారీ చందా రూ.1250గా ఉంది. ఈ సూట్ లో ఉండే యాప్స్ ద్వారా సినిమాలు, పాటలతో ఇతర ప్రత్యేక సేవలను ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance jio vs Airtel vs Vodafone vs Idea Cellular: Here's How Much You Pay for 4G. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot