టెలికాం దిగ్గజాలపై జియో సంచలన ఆరోపణలు

By Gizbot Bureau
|

దేశీయ టెలికాం రంగంలో దూుకుపపోతున్న జియో ప్రత్యర్థులపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఈ మధ్య టెలికాం దిగ్గజాలకు జియోకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ట్రాయ్ వేదికగా ఒకరికొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లపై రిలయన్స్‌ జియో సంచలన ఆరోపణలు చేసింది. ఇంటర్‌కనెక్ట్‌ రాబడిని అక్రమంగా ఆర్జించేందుకు ఈ సంస్థలు ల్యాండ్‌లైన్‌ నెంబర్లను మొబైల్‌ నెంబర్లుగా చూపాయని రిలయన్స్‌ జియో ఆరోపించింది.

టెలికాం నిబంధనలను
 

టెలికాం నిబంధనలను

అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఈ టెలికాం కంపెనీలపై భారీ జరిమానా విధించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌)ని కోరింది. టెలికాం నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌పై భారీ జరిమానా విధించాలని ట్రాయ్‌ చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మకు ఈనెల 14న రాసిన లేఖలో జియో విజ్ఞప్తి చేసింది.

రిఫండ్‌ చేసేలా చర్యలు

రిఫండ్‌ చేసేలా చర్యలు

ఈ మూడు టెలికాం ఆపరేటర్లు పాల్పడిన మోసానికి రూ వందల కోట్లు జియోకు, ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిలిల్లిందని పేర్కొంది. ఈ స్కామ్‌ వెలుగుచూసిన క్రమంలో ఆయా కంపెనీలకు తాము చెల్లించిన టెర్మినేషన్‌ ఛార్జీలను రిఫండ్‌ చేసేలా చర్యలు చేపట్టాలని ట్రాయ్‌ను కోరింది.

తోసిపుచ్చిన ఎయిర్‌టెల్‌ 

తోసిపుచ్చిన ఎయిర్‌టెల్‌ 

కాగా జియో ఆరోపణలను ఎయిర్‌టెల్‌ తోసిపుచ్చింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జ్‌పై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ట్రాయ్‌ను తప్పుదారిపట్టించేందుకు జియో ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది.

చార్జీల పెంపు
 

చార్జీల పెంపు

ఇదిలా ఉంటే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్‌ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్‌ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా విభాగం) గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio alleges fraud by incumbent telcos to earn IUC revenue

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X