మాసివ్ మిమో టెక్నాలజీతో దేశంలో తొలి 5జీ పరిచయం, జియో, Airtel మధ్యనే పోటీ

|

దేశం 4జీ సేవలను ఇంకా పూర్తిగా ఆస్వాదించకముందే 5జీ వైపు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 2జీ నుంచి 3జీ అలాగే 4జీ వైపు ఇండియా పరుగులు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు జీ వైపు కూడా ఇండియా అడుగులు శరవేగంగా పడబోతున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికాం దిగ్గజాలు 5జీ ట్రయల్స్ తో బిజీగా ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ వేదికగా దేశంలో తొలి 5జీ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు టెలికాం దిగ్గజాలు ప్రకటించాయి. మాసివ్ మిమో టెక్నాలజీ ద్వారా 5జీ సేవలను ఐపీఎల్ జరిగే ప్రదేశాల్లో అందిస్తామని జియో, ఎయిర్టెల్ ప్రకటించాయి. కేవలం ఇది ట్రయల్స్ మాత్రమేనని భవిష్యత్ లో 5జీ టెక్నాలజీకి ఇది పునాది రాయిగా నిలవాలని కోరుకుంటున్నామని టెలికాం దిగ్గజాలు చెబుతున్నాయి. మరి 4జీనే ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు 5జీ ఎలా పనిచేస్తుందోనని విశ్లేషకులు ఇప్పటినుంచే తమమెదడుకు పని చెబుతున్నారు.

 

షియోమి సంచలనం, నచ్చిన రంగుల్లోకి మీ ఫోన్‌ని మార్చుకోవచ్చు !షియోమి సంచలనం, నచ్చిన రంగుల్లోకి మీ ఫోన్‌ని మార్చుకోవచ్చు !

మాసివ్ మిమో టెక్నాలజీతో దేశంలో తొలి 5జీ పరిచయం,జియో,Airtel మధ్యనే పోటీ

రిలయన్స్ జియో 4G advanced Massive MIMO టెక్నాలజీ ద్వారా ఐపీఎల్ జరిగే స్టేడియల్లో ఫ్రీ 5జీ ట్రయల్స్ నిర్వహించనుందని అనధికార సోర్స్ ద్వారా తెలిసింది. ఢిల్లీ , ముంబై, అలాగే, చెన్నై, హైదరాబాద్ లలో ఈ 5జీ మాసివ్ మిమో యూనిట్లను నెలకొల్పనున్నట్లు సమాచారం.

ఈ టెక్నాలజీ ద్వారా నెట్ స్పీడ్ వేగం 4జీ కన్నా 4 రెట్లు వేగంతో యూజర్లకు అందుతుంది. యూజర్లు అత్యంత వేగంతో కూడిన డేటా స్పీడ్ ని అందుకుంటారు. ఎటువంటి అంతరాయం లేకుండా స్పీడ్ ఆస్వాదించవచ్చు.

కాగా దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఇప్పటికే ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ జరిగే ప్రదేశాలైన Delhi, Mumbai, Hyderabad, Kolkata, Mohali, Indore, Jaipur, Bengaluru and Chennai లాంటి ప్రదేశాల్లో ఈ మాసివ్ మిమో ద్వారా ఫ్రీ 5జీని అందించేందుకు కసరత్తులు చేస్తోంది.

మాసివ్ మిమో టెక్నాలజీతో దేశంలో తొలి 5జీ పరిచయం,జియో,Airtel మధ్యనే పోటీ

కాగా ఫస్ట్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఈ రోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ ద్వారా ఈ 5జీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా దేశంలో మాసివ్ మిమో టెక్నాలజీ ద్వారా 5జీ సేవలను అందించే తొలి టెలికాం ఆపరేటర్ గా Airtel నిలవనుంది. కాగా ఇప్పటికే Reliance Jio, Vodafone and Idea Cellularలాంటి కంపెనీలు కూడా Airtel బాటలోనే నడుస్తూ మాసివ్ మిమో టెక్నాలజీ మీద కసరత్తులు చేస్తున్నాయి.

ఈ టెక్నాలజీతో 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే వూహకందని రీతిలో 500ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీపీఎస్‌ వరకూ వేగం పెరగనుంది. అయితే, మొదట్లో డేటా ట్రాన్స్‌ఫర్‌ 4జీ కంటే మూడు రెట్ల ఎక్కువ వేగంతో 5జీ ముందుకొస్తుంది. ప్రస్తుతం 4జీ వేగం 15ఎంబీపీఎస్‌ ఉంటే... 5జీతో 40-45ఎంబీపీఎస్‌ వరకూ పెంచనున్నామని Airtel చెబుతోంది.

Best Mobiles in India

English summary
Reliance Jio and Airtel to deploy pre-5G Massive MIMO at IPL stadiums More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X