అధిక డిమాండ్ ఉన్న OTT ఉచితాలతో యూజర్లను ఆకర్షిస్తున్న ఎయిర్‌టెల్ & జియో

|

ఇండియాలోని టెలికాం రంగంలో గల ప్రైవేట్ టెల్కోలలో రిలయన్స్ జియో మాత్రమే ఇంతకుముందు నెట్‌ఫ్లిక్స్ యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాన్ని తన యొక్క ప్లాన్లతో వినియోగదారులకు అందించింది. అయితే ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ టెల్కో కూడా తన యొక్క యూజర్ బేస్ ని కాపాడుకోవడం కోసం ఈ లీగ్‌లో చేరింది. ఎయిర్‌టెల్ యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ విభాగమైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు రెండు హై-ఎండ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్‌ OTT ప్రయోజనాలను బండిల్ చేస్తోంది. జియో సంస్థ రూ. 1,499 ధర వద్ద లభించే తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తుంది.

 

ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌ కూడా రూ.1,498 ధర వద్ద అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తో నెట్‌ఫ్లిక్స్‌ సబ్స్క్రిప్షన్ ని ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ యొక్క స్టాండర్డ్ సభ్యత్వాన్ని పొందుతారు. అయితే రూ.3,999 ధర వద్ద లభించే మరొక ప్లాన్‌తో వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ OTT ప్లాట్‌ఫారమ్‌ యొక్క ప్రీమియం సభ్యత్వాన్ని పొందుతారు.

నెట్‌ఫ్లిక్స్‌

నెట్‌ఫ్లిక్స్‌ యొక్క స్టాండర్డ్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.199 ధర వద్ద లభిస్తుండగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.649 ధర వద్ద పొందవచ్చు అని గమనించండి. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు ఒక స్క్రీన్‌పై మాత్రమే కంటెంట్‌ను చూడగలరు. కానీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో కంటెంట్‌ను ఏకకాలంలో నాలుగు స్క్రీన్‌లలో ప్రసారం చేయవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ & హై-ఎండ్ ప్లాన్‌లు
 

నెట్‌ఫ్లిక్స్ & హై-ఎండ్ ప్లాన్‌లు

నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వంటి అన్ని ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌ల యొక్క సబ్‌స్క్రిప్షన్‌లను తమ యొక్క హై-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో బండిల్ చేయడం అనేది జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రెండింటికీ కూడా మంచి ఆదాయాన్ని చేకూరుస్తున్నది. ఎందుకంటే ఇంత మొత్తంలో లభించే ప్లాన్ ను కొనుగోలు చేసినప్పుడు సంవత్సరం మొత్తం మరొకసారి రీఛార్జ్ చేయకపోవడమే కాకుండా సంవత్సరం మొత్తం వినోదం కోసం మళ్ళి ఎక్కువ మొత్తం ఖర్చు చేయకుండా ఉచితంగా OTT లకు ఉచిత యాక్సిస్ ని పొందవచ్చు.

జియోఫైబర్

జియోఫైబర్ సంస్థ ఇప్పుడు నెలకు రూ.100 ధరతో ప్రారంభమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను అందించడం కూడా ప్రారంభించింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లతో సంస్థ తన యొక్క వినియోగదారులకు 30 Mbps మరియు 100 Mbps వేగంతో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌లతో కూడా OTT సర్వీస్ యాప్ లు బండిల్ చేయబడి అందిస్తున్నది. అయితే ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ఎయిర్‌టెల్ కస్టమర్‌లు చాలా కాలం వేచి ఉన్నారు. అయితే జియో మాత్రం చాలా కాలంగా దాని హై-ఎండ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్‌ ప్రయోజనాన్ని అందిస్తోంది.

OTT సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ మరియు జియో సంస్థలు రెండు కూడా రూ.999 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కూడా OTT సబ్‌స్క్రిప్షన్‌లతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ అవి ఏవి కూడా నెట్‌ఫ్లిక్స్‌ యొక్క ప్రయాజనంను కలిగి ఉండవు. ఎయిర్‌టెల్ తో ఉండే పోటీ దృష్ట్యా జియో రూ.999 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సభ్యత్వాన్ని జోడించే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఇప్పటికే చాలా దూకుడుగా ఉన్న కొత్త వినియోగదారులను జోడించడంలో కంపెనీకి ఖచ్చితంగా సహాయం చేస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio and Bharti Airtel Both Companies Offer High Demand OTTs With High-End Plans to Increase User Base

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X