భారతదేశంలో 5G నెట్‌వర్క్ విప్లవంలో లీడర్ పాత్ర ఎవరిది??

|

భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల యొక్క చందాదారుల మార్కెట్ వాటా పరంగా రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ రెండు కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరు ఆపరేటర్లు ఆదాయాలు మరియు చందాదారుల పరంగా ఇండియా టెలికాం మార్కెట్ వాటాను అధిక శాతం కలిగి ఉండగా వోడాఫోన్ ఐడియా (Vi) మరియు ఇండియాన్ గవర్నమేంట్ చేత రన్ చేయబడుతున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కోలు తమ యొక్క మనుగడ కోసం మరియు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం వారు చేయగలిగినదంతా చేస్తున్నారు.

ఇండియాలో 5G

ఇండియాలో 5G వినియోగంలోకి రావడానికి ఇంకెంతో దూరం లేదు. రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ టెల్కోలు ఇప్పటికే తమ 5G పరిష్కారాల పరీక్ష ప్రక్రియను మొదలుపెట్టాయి. ఈ ట్రయల్స్ టెక్నాలజీ యొక్క వినియోగ కేసులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడతాయి మరియు ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతమైన రోల్‌అవుట్‌ను కూడా ప్రారంభిస్తాయి.

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని రూ.500లకే పొందవచ్చు!! కానీ...జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ని రూ.500లకే పొందవచ్చు!! కానీ...

మార్కెట్ అంచన

ఇండియా యొక్క టెలికాం మార్కెట్ అంచనాల విశ్లేషకుల సమాచారం ప్రకారం టెలికాం పరిశ్రమలో రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ కీలక పాత్ర పోషిస్తాయని ఊహించడం కష్టం కాదు. అలాగే వోడాఫోన్ ఐడియా మరియు BSNL భవిష్యత్తును తోసిపుచ్చడం కూడా జరగదు. ఈ రెండు టెల్కోలు ఇప్పటికీ 4G లో తమ కార్యకలాపాలను అమలు చేయగలవు. అంతేకాకుండా 4G ఇండియా నుండి ఎప్పుడైనా వెళ్లడం లేదు కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. కానీ 5G విషయానికి వస్తే BSNL మరియు Vi మార్కెట్‌కి అందించే నమ్మకం లేదు.

షియోమి యొక్క 5 స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో చూడండి...షియోమి యొక్క 5 స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో చూడండి...

5G పరిష్కారాల

Vi ఇప్పటికే తన 5G పరిష్కారాలను పరీక్షించడానికి 5G స్పెక్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన డబ్బు టెల్కో వద్ద లేకపోవడం గమనార్హం. 5G నెట్ వర్క్ విషయానికి వస్తే Vi చేయగలిగే ఒక విషయం ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే చేసిన డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్ (DSS) టెక్నాలజీ సహాయంతో 5G సేవలను అందించడానికి వోడాఫోన్ ఐడియా తన 4G నెట్‌వర్క్ మరియు కోర్‌ని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇదే కనుక జరిగితే Vi టెల్కో తన వినియోగదారులకు 5G నెట్‌వర్క్ ను త్వరగానే అందిస్తుంది.

Flipkart సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ ఇదే !Flipkart సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ ఇదే !

రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ 5G లో ఎందుకు లీడర్‌లుగా ఉంటారు?

రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ 5G లో ఎందుకు లీడర్‌లుగా ఉంటారు?

భారతదేశంలో 5G రేసులో రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ లీడర్‌లుగా ఉండడానికి కారణం వారి ప్రస్తుత మార్కెట్ స్టాండింగ్. వీరు వీలైనంత త్వరగా 5G సేవలను ప్రారంభించడానికి 5G స్పెక్ట్రం, 5G పరికరాలు మరియు మొత్తం మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను పెట్టడానికి వారికి తగినంత ఆదాయంను సమకూర్చగల స్థితిలో వారు ఉన్నారు. అయితే వోడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ విషయంలో దీనికి కొద్దిగా బిన్నంగా ఉంది. అలాగే BSNL భారతదేశం అంతటా ముందుగా 4G నెట్‌వర్క్ ను కలిగి ఉండటానికి ముందుగా 5G గురించి ఆలోచించలేదు.

ఎయిర్‌టెల్ యూజర్లు ఈ వస్తువులు కొంటే ఉచితంగా 2GB కాంప్లిమెంటరీ డేటా పొందవచ్చు!!ఎయిర్‌టెల్ యూజర్లు ఈ వస్తువులు కొంటే ఉచితంగా 2GB కాంప్లిమెంటరీ డేటా పొందవచ్చు!!

5G నెట్‌వర్క్ రకాలు

5G నెట్‌వర్క్ రకాలు

ఇండియాలోని టెల్కోలు అన్ని 5G నెట్‌వర్క్ ను రెండు రకాలుగా ఎంచుకోవచ్చు. ఇందులో ఒకటి 5G స్టాండలోన్ (SA) మరియు 5G NSA (నాన్-స్టాండలోన్). 5G SA కి 4G నెట్‌వర్క్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఏ టెల్కో అయినా నిర్మించవచ్చు. అయితే 5G NSA కి 4G కోర్ ఖచ్చితంగా ఉండటం తప్పనిసరి అవుతుంది. BSNL 5G SA కోసం వెళ్లలేకపోతుంది. ఎందుకంటే దీనికి తగినంత వనరులు లేకపోవడమే కారణం. అంతేకాకుండా దాని పెట్టుబడిపై రాబడిని చూసే మార్కెట్ కూడా లేదు. కావున BSNL ముందు ముందు 5G NSA కోసం వెళ్ళవచ్చు కానీ దీనికి దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌లు లేవు.

ఈ నెల సెప్టెంబర్ లో లాంచ్ కాబోతున్న 5G ఫోన్లు ఇవే ! లిస్ట్ చూడండి.ఈ నెల సెప్టెంబర్ లో లాంచ్ కాబోతున్న 5G ఫోన్లు ఇవే ! లిస్ట్ చూడండి.

రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్ రెండూ 5G విషయానికి వస్తే ఇప్పటికే భారీ ఎత్తుకు ఎగబాకాయి. జియో స్వదేశీ 5G పరిష్కారాలను విజయవంతంగా అభివృద్ధి చేసింది మరియు పరీక్షించింది. అయితే ఎయిర్‌టెల్ గుర్గావ్‌లో తన 5G నెట్‌వర్క్ సహాయంతో విజయవంతమైన క్లౌడ్ గేమింగ్‌ను ప్రకటించింది. రాబోయే నెలల్లో 5G కి సంబంధించి ఈ ఇద్దరు ఆపరేటర్లు మరిన్ని ప్రకటనలు చేస్తారని అందరు భావిస్తున్నారు. 4G పై దృష్టి పెట్టడం మరియు బ్యాకెండ్‌లో 5G ని అభివృద్ధి చేయడం కోసం Vi మరియు BSNL లకు ఇది ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే కనీసం 5 సంవత్సరాల వరకు 4G నెట్‌వర్క్ అన్ని టెల్కోల వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio and Bharti Airtel Telcos to Lead 5G Revolution In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X