Home
News

Netflix ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో లభించే జియో, Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు....

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా ఇతరులకు పోటీగా దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రెండింటినీ అందిస్తున్నారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లు అనేవి మీ యొక్క బడ్జెట్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయ. అయితే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం అదనపు ప్రయోజనాలతో పాటుగా బండిల్ చేయబడిన సబ్‌స్క్రిప్షన్‌లతో వస్తుంది. కొంతమంది ఆపరేటర్లు అందించే అటువంటి ప్రయోజనంలో నెట్‌ఫ్లిక్స్‌ యొక్క సభ్యత్వం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అధిక మంది ఇష్టపడే OTT ప్లాట్‌ఫారమ్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఇది అందరికీ టన్నుల కొద్ది వినోదం కంటెంట్‌ను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో బండిల్ చేయబడిన జియో మరియు వోడాఫోన్ ఐడియా లేదా Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచిత ఆఫర్

రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచిత ఆఫర్

రిలయన్స్ జియో టెల్కో దాదాపు అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇది చౌకైన రూ.399 ప్లాన్ తో కూడా లభిస్తుంది. ఇది నెలకు మొత్తంగా 75GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు రూ.10/GBకి ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. ప్యాక్ 200GB డేటా రోల్‌ఓవర్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు 100 SMS/రోజును అందిస్తుంది. టెల్కో అందించే తదుపరి పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.599 ధర వద్ద లభిస్తుంది. ఇది వినియోగదారులకు 200GB రోల్‌ఓవర్ డేటాతో పాటు మొత్తం వాలిడిటీ కాలంలో 100GB డేటా లభిస్తుంది. 100GB వినియోగం తర్వాత వినియోగదారులు రూ 10/GB వసూలు చేస్తారు. ప్లాన్ ఒక అదనపు SIM కార్డ్‌ని అందిస్తుంది మరియు రోజుకు 100 SMSలతో అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో లభించే జియో యొక్క అత్యంత సహేతుకమైన ప్లాన్‌లలో ఒకటి రూ.799 ధర ట్యాగ్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌తో జియో రెండు అదనపు SIM కార్డ్‌లను అందిస్తుంది. ప్లాన్ మొత్తం 150GB డేటాను అందిస్తుంది మరియు 200GB డేటా రోల్‌ఓవర్‌ను అనుమతిస్తుంది. 150GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు రూ.10/GB ఛార్జ్ చేయబడుతుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. టెల్కో నుండి అత్యంత ఖరీదైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్యాక్ రూ.999 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మూడు అదనపు SIM కార్డ్‌లను అందిస్తుంది. ప్లాన్ మొత్తం 200GB డేటాను అందిస్తుంది మరియు 500GB డేటా రోల్‌ఓవర్‌ను అనుమతిస్తుంది. 200GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులు రూ 10/GB ఛార్జ్ చేస్తారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది.

జియో

జియో అందించే అత్యంత హై-ఎండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.1,499 ధర వద్ద లభిస్తుంది. ఇది మొత్తం 300GB డేటాతో పాటు 500GB రోల్‌ఓవర్ డేటాను అందిస్తుంది. 300GB వినియోగం తర్వాత వినియోగదారులు రూ 10/GB వసూలు చేస్తారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న అన్ని జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్, ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా బహుళ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తాయి.

వోడాఫోన్ ఐడియా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచిత ఆఫర్

వోడాఫోన్ ఐడియా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచిత ఆఫర్

వోడాఫోన్ ఐడియా లేదా Vi వ్యక్తిగత మరియు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను రెండిటిని విడివిడిగా అందిస్తుంది. అయితే వోడాఫోన్ ఐడియా సంస్థ తన యొక్క RedX ప్లాన్‌లతో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. ఇందులో మొదటి ప్లాన్ వ్యక్తిగత వినియోగదారులకు అందుబాటులో గల రూ.1,099 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. Vi అందించే రెండవ RedX ప్లాన్ ముగ్గురి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంది. అంటే ప్లాన్ యొక్క ప్రయోజనాలను ముగ్గురు కుటుంబ సభ్యులు ఒకే ధర ట్యాగ్ కింద ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.1,699. జాబితాలో చివరిది రూ. 2,299 రెడ్‌ఎక్స్ ప్లాన్ ఇది ఐదుగురు కుటుంబ సభ్యులను ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కనెక్ట్ చేయడానికి కొనుగోలు చేయవచ్చు.

RedX ప్లాన్‌

ఈ ప్లాన్‌లలో అత్యంత ఆకర్షణీయమైన అంశం అయిన RedX ప్లాన్‌ల ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్‌లు నిజంగా అపరిమిత హై-స్పీడ్ డేటాతో వస్తాయి. అంటే RedX ప్లాన్ యాక్టివేట్ అయ్యే వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబడవు. అంతేకాకుండా RedX ప్లాన్ యాక్టివేట్ చేయబడిన కాలంలో ప్లాన్‌లు అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తాయి. RedX విభాగంలో ఉన్న మూడు ప్లాన్‌లు కూడా ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌తో సహా అదనపు ప్రయోజనాలతో వస్తాయి. వినియోగదారులు ఈ ప్లాన్‌లతో ప్రతి సంవత్సరం రూ.5,988 విలువైన టీవీ మరియు మొబైల్‌లో నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే 2 ఫ్యామిలీ ప్లాన్‌ల కింద నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ ప్రాథమిక వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు రూ.1,499 విలువైన అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క 1-సంవత్సర సభ్యత్వానికి కూడా సభ్యత్వాన్ని పొందుతారు. వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా ఒక సంవత్సరం మొబైల్ డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్‌ను కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
Reliance Jio and Vi Telcos These Postpaid Plans Offers Free Netflix Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X