Home
News

Reliance Jio ఆండ్రాయిడ్ ఫోన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీని ఇవ్వగలవా...

ఇండియాలోని అతి పెద్ద సంస్థలలో ఒకటైన రిలయన్స్ అన్ని రంగాలలోను తనదైన ముద్రను కలిగి ఉంది. టెలికాం రంగంలో రిలయన్స్ జియో పేరుతో ప్రవేశించి అనేక మార్పులను తీసుకురావడంతో పాటుగా ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు కేవలం రూ.5,000 తక్కువ ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా గూగుల్ మరియు క్వాల్కమ్ సంస్థలతో భాగస్వామ్యంను కుదుర్చుకుంది.

ఇండియా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మైక్రోమాక్స్

ఇండియా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మైక్రోమాక్స్

ఇండియాలోని మొదటి స్మార్ట్‌ఫోన్‌ సంస్థగా ఆవిర్భవించిన మైక్రోమాక్స్ సంస్థ ఒకప్పుడు నోకియా సంస్థ ఫోన్ లకు కూడా గట్టి పోటీని ఇచ్చింది. అయితే తరువాత కాలంలో చైనా యొక్క స్మార్ట్‌ఫోన్‌లతో పోటీని తట్టుకోలేక కనుమరుగు అయింది. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మరియు మైక్రోమాక్స్ ఇన్ 1b వంటి రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నది.

 

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు vs చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు vs చైనా స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీ ఫీచర్స్, మీడియాటెక్ చిప్‌సెట్స్ మరియు ఆండ్రాయిడ్ 10 ఫీచర్లతో రూ.6,999 మరియు రూ.12,499 ధరల మధ్య విడుదల అయ్యాయి. ఇవి చైనా యొక్క అన్ని బ్రాండ్ ఫోన్లకు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇవి త్వరలోనే ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ లను కూడా అందుకుంటాయి అని కూడా సంస్థ ప్రకటించింది.

రిలయన్స్ జియో ఆండ్రాయిడ్ ఫోన్‌ vs మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

రిలయన్స్ జియో ఆండ్రాయిడ్ ఫోన్‌ vs మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

రిలయన్స్ జియో సంస్థ ఇప్పటికే తన వినియోగదారులకు తక్కువ ధరల వద్ద ఫీచర్ ఫోన్లను అందిస్తున్నది. అయితే 2021 మొదటి వార్షికంలో ఆండ్రాయిడ్ ఫోన్ ను బడ్జెట్ ధరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎంతవరకు పోటీని ఇస్తాయో అని ముందు ముందు చూడాలి. రెండు భారతీయ స్మార్ట్‌ఫోన్‌ సంస్థలలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. టెలికాం రంగంలో మార్పులను తీసుకువచ్చినట్లు స్మార్ట్‌ఫోన్‌ల రంగంలో కూడా మార్పులను తీసుకువస్తే అది మరొక గెలుపు అని భావించవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Android Phone Can Beat Micromax Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X