HP- Jio ఆఫర్!! స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌తో ఉచితంగా 100GB డేటా...

|

భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో 'HP Smart SIM ల్యాప్‌టాప్' పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. HP ల్యాప్‌టాప్‌లతో కంపెనీ ఈ ఆఫర్‌ను విడుదల చేసింది. HP నుండి స్మార్ట్ LTE ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు రిలయన్స్ జియో నుండి 100GB డేటాను ఉచితంగా పొందడానికి అర్హులు అవుతారు. అయితే ఈ ఆఫర్ ను పొందడం కోసం వినియోగదారులకు జియో మరియు హెచ్‌పి యొక్క స్మార్ట్ సిమ్ అవసరం ఉంటుంది అని గమనించండి.

HP - Jio ఆఫర్

HP - Jio ఆఫర్

HP మరియు Jio సంస్థలు రెండు కలసి అందిస్తున్న ఈ ఆఫర్ ఎంపిక చేయబడిన కొత్త HP ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అర్హత కలిగిన HP LTE ల్యాప్‌టాప్‌తో జియో SIMకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 365 రోజుల చెల్లుబాటు కాలానికి (రూ.1500) 100GB డేటాను ఉచితంగా పొందవచ్చు. అర్హత గల HP ల్యాప్‌టాప్ మోడల్‌లలో HP 14ef1003tu మరియు HP 14ef1002tu వంటివి ఉన్నాయి. Jio - HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్‌ను రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో లేదా ఆన్‌లైన్‌లో reliancedigital.in లేదా JioMart.com ద్వారా అర్హత గల HP స్మార్ట్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసిన వారు పొందవచ్చు.

Jio - HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్‌

Jio - HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ ఆఫర్‌ కోసం అర్హత ఉన్న పరికరాన్ని కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త జియో SIMని పొందవచ్చు. ఇది 1-సంవత్సరానికి లేదా 365 రోజుల చెల్లుబాటు కాలానికి రూ.1500 విలువైన 100GB డేటాను ఉచితంగా అందిస్తుంది. 100GB డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గించబడుతుంది. వినియోగదారులు అదనపు హై-స్పీడ్ 4G డేటా కోసం మైజియో లేదా Jio.com నుండి అందుబాటులో ఉన్న డేటా ప్యాక్‌లు/ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు అధిక వేగాన్ని ఆస్వాదించడం కొనసాగించవచ్చు.

ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయాలు

ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయాలు

• ఆఫ్‌లైన్ పద్దతిలో కొత్త HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నప్పుడు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ ద్వారా పొందడం ఉత్తమం.

• HP Smart LTE 100GB డేటా ఆఫర్ కోసం కొత్త జియో SIMని యాక్టివేట్ చేయమని రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఎగ్జిక్యూటివ్‌ని అడగండి.

• డాక్యుమెంటేషన్ కోసం మీ POI మరియు POA వివరాలను ఇవ్వండి.

• యాక్టివేషన్ పూర్తయిన తర్వాత HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌లో SIMని చొప్పించండి.

• ఇలా చేయడంతో ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు.

 

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయాలు

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయాలు

• కొత్త HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం కోసం reliancedigital.in లేదా JioMart.com ను ఉపయోగించండి.

• ల్యాప్‌టాప్ డెలివరీ అయిన తర్వాత కొనుగోలు చేసిన ఏడు రోజులలోపు ఇన్‌వాయిస్ మరియు ల్యాప్‌టాప్‌తో సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను సందర్శించండి.

• HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ 100 GB డేటా ఆఫర్ (FRC 505)లో కొత్త Jio కనెక్షన్‌ని యాక్టివేట్ చేయమని స్టోర్ ఎగ్జిక్యూటివ్‌ని అడగండి.

• డాక్యుమెంటేషన్ కోసం మీ POI మరియు POA వివరాలను ఇవ్వండి.

• యాక్టివేషన్ పూర్తయిన తర్వాత HP స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్‌లో SIMని చొప్పించండి.

 

JioTV వాచ్‌పార్టీ ఫీచర్‌

JioTV వాచ్‌పార్టీ ఫీచర్‌

రిలయన్స్ జియోతో కలిసి మీరు భారత్ వర్సెస్ ఇంగ్లండ్‌ మూడవ వన్డేను చూడగలరు. ఇందుకోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో జియోటీవీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి అందులో మీ జియో నెంబర్ తో లాగిన్ అవ్వాలి. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత దాన్ని మీ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ యొక్క లైవ్ ప్రసారం చేయబడుతుంది. తర్వాత మీ స్క్రీన్ దిగువన 'వాచ్‌పార్టీ' పేరుతో గల చిన్న సర్కిల్ రకమైన పోస్టర్‌ని మీరు చూస్తారు. వాచ్‌పార్టీ పోస్టర్ మీద క్లిక్ చేయడంతో మీరు రెండు ఎంపికలను పొందుతారు. మొదటి ఎంపిక కొత్త పార్టీని సృష్టించడం మరియు రెండవది లింక్‌ని ఉపయోగించి ఇప్పటికే ఉన్న పార్టీలో చేరడం. ఈ రెండిటిలో ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోవడంతో మీరు జియోటీవీ ద్వారా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ను చూడవచ్చు. జియోమీట్ అనేది కస్టమర్‌ల కోసం జియోటీవీలో వాచ్‌పార్టీని ప్రారంభించిన ప్లాట్‌ఫారమ్. జియోమీట్ అనేది రిలయన్స్ జియో యాజమాన్యంలోని ప్రతి ఒక్కరి కోసం రూపొందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్. ఇది మిలియన్ల మంది భారతీయులను ఒకచోట చేర్చే లక్షణంతో రూపొందించబడింది. నిర్ణీత సమయంలో ఎంత మంది వ్యక్తులు వాచ్‌పార్టీలో చేరవచ్చనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేదు. అయితే దీన్ని తనిఖీ చేయడం కోసం మీరే ప్రయత్నించండి.

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్

బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియోఫైబర్ ను ఎంచుకున్న వారు అధికంగా రూ.1499 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్లాన్ అని ఇప్పుడు కంపెనీ విడుదల చేసింది. చాలా మంది వినియోగదారులు ఈ ప్లాన్ ను ఎంచుకుంటున్నందున ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే రూ.1499 ధర వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ వినియోగదారులకు 300 Mbps ఇంటర్నెట్ వేగంతో డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అందించే డేటా అపరిమితంగా ఉంటుంది. అయితే ఇక్కడ అపరిమిత అంటే నెలకు 3.3TB FUP (న్యాయమైన-వినియోగ-విధానం) పరిమితి డేటాగా ఉంటుంది. ఈ ప్లాన్‌తో డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ డేటా ప్రయోజనం రెండింటికీ సమరూపంగా ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఈ ప్లాన్ యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే వినియోగదారులు అదనంగా అదనపు ప్రయోజనాలను పొందడం. ఈ ప్లాన్‌ను ఎంచుకునే కస్టమర్‌లకు జియో STBని ఉచితంగా కూడా అందిస్తుంది. ఇంకా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీLIV, ZEE5, Voot Kids, SunNXT, Voot Select, Hoichoi, డిస్కవరీ+, యూనివర్సల్+, లయన్స్ గేట్ ప్లే, ఎరోస్ నౌ, జియోసినిమా, షెమరూమీ, జియోసావన్, మరియు ALT బాలాజీ వంట OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్స్క్రిప్షన్ ని ఉచితంగా పొందుతారు.

Best Mobiles in India

English summary
Reliance Jio Announced 100GB Free Data With New Purchase HP Smart SIM Laptop

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X