Home
News

Jio యూజర్ల కోసం తక్కువ ధర వద్ద మరో మూడు కొత్త ప్లాన్‌లు...

రిలయన్స్ జియో సంస్థ తన పోర్టుఫోలియోలోకి కొత్తగా కొన్ని ప్లాన్లను చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 2GB రోజువారీ డేటాను అందించే వార్షిక ప్లాన్ మరియు మూడు కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉన్నాయి. జియో యొక్క కొత్త వార్షిక ప్లాన్ దాని పోటీదారుల కంటే 33% ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్నందున ఇది ప్రస్తుతం ఇంటి నుండి పనిచేసే వారికి సరసమైన ధరలో లభిస్తున్న కొన్ని ప్లాన్ లలో ఇది కూడా ఒకటి అని కంపెనీ తెలిపింది.

కొత్తగా చేర్చిన ప్లాన్

అధిక డేటాను వినియోగించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని నెలకు రూ.200 లోపు ధర వద్ద కొన్ని డేటాను మాత్రమే అందించే ప్లాన్ లను కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ కూడా ఇదే ధర వద్ద కొన్ని ప్లాన్ లను అందిస్తున్నాయి. అయితే వినియోగదారులకు రోజువారీ డేటాను తక్కువ మొత్తంలో అందిస్తున్నాయి. జియో కొత్తగా చేర్చిన ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.2399 వార్షిక ప్లాన్

రిలయన్స్ జియో రూ.2399 వార్షిక ప్లాన్

రిలయన్స్ జియో సంస్థ కొత్తగా అందిస్తున్న వార్షిక ప్లాన్ ను రూ.2399 ధర వద్ద అందిస్తున్నది. ఈ కొత్త వార్షిక ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్నాయి. ఇతర జియో ప్లాన్‌లలో కనిపించే విధంగా జియోయేతర నెట్‌వర్క్‌ల కోసం ఈ ప్లాన్‌కు ఎఫ్‌యుపి ఉందో లేదో అన్న దాని మీద ఇంకా ఎటువంటి వివరణ లేదు.

ఎయిర్‌టెల్ & వోడాఫోన్ వార్షిక ప్లాన్

ఎయిర్‌టెల్ & వోడాఫోన్ వార్షిక ప్లాన్

ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు రూ.2398 ధర వద్ద గల వార్షిక ప్లాన్‌తో 1.5GB రోజువారీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు SMS ప్రయోజనాలు 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అదేవిధంగా వోడాఫోన్ కూడా రూ.2399 ధర వద్ద పైన తెలిపిన ప్లాన్లకు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాను మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

జియో రూ.2121 వార్షిక ప్లాన్

జియో రూ.2121 వార్షిక ప్లాన్

జియో సంస్థ రూ.2121 ధర వద్ద వార్షిక ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ తో సంస్థ 1.5GB రోజువారీ డేటాను తమ వినియోగదారులకు అందిస్తున్నది. ఇది వినియోగదారులకు జియో నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఏదేమైనా కంపెనీ జియోయేతర కాల్స్‌కు 12000 నిమిషాల ఎఫ్‌యుపి పరిమితిని కలిగి ఉంది. ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా ప్లాన్‌ల చెల్లుబాటు కాలం 365 రోజులతో పోలిస్తే ఈ ప్యాక్ 336 రోజుల తగ్గింపును కలిగి ఉంది.

జియో కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు

జియో కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు

రిలయన్స్ జియో సంస్థ ఇప్పుడు తన వినియోగదారుల కోసం కొత్తగా మూడు యాడ్-ఆన్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో రూ.151 డేటా యాడ్-ఆన్ ప్యాక్ మరియు రూ. 201 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉన్నాయి. ఇవి ఇంటి నుండి పని చేసే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉన్నాయి. లాక్డౌన్ ప్రారంభ రోజుల్లో మార్చిలో ప్రవేశపెట్టిన సవరించిన రూ.251 యాడ్-ఆన్ ప్యాక్‌తో సహా ప్రస్తుత యాడ్-ఆన్ ప్యాక్‌లతో కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌లు అందుబాటులో ఉంటాయి.

యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాలు

యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాలు

జియో యొక్క రూ.151ల ప్యాక్ 30 జీబీ డేటాను మరియు రూ. 201 ప్యాక్ 40GB డేటాను అందిస్తుంది. యూజర్ మెయిన్ అకౌంట్ వాలిడిటీ ఉన్నంత వరకు ఈ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల చెల్లుబాటు లభిస్తుంది అని సంస్థ తెలిపింది. రూ .251 డేటా యాడ్-ఆన్ ప్యాక్ ఇప్పుడు 50 జీబీ డేటాను అందించే ప్లాన్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Announced New Data Add-on Packs and Annual Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X