జియో అందిస్తున్న సరికొత్త ప్లాన్ రూ.99 చెల్లిస్తే రోజుకి 500 MB డేటా
దేశీయ టెలికాం రంగంలో పెను విప్లవానికి తెర లేపిన జియో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.99 డేటా ప్లాన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.
దేశీయ టెలికాం రంగంలో పెను విప్లవానికి తెర లేపిన జియో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.99 డేటా ప్లాన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ డేటా ఎక్కువ వాడని వారిని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్టుంది. కాగా ఈ ఆఫర్ జియో ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ డేటా ప్లాన్ తో పాటు మరికొన్ని డేటా ప్లాన్లను జియోఫోన్ యూజర్లకు కంపెనీ అందిస్తుంది. జియో అందిస్తున్న సరికొత్త ప్లాన్ల వివరాల పై ఓ లుక్కేయండి.

రూ.99 ప్లాన్:
నిన్నటి నుంచి అంటే జూన్ 20, 2018 నుంచి జియో ఈ ప్లాన్ ను అమలులోకి పెట్టింది .జియో ఫోన్ యూజర్లు రూ. 99 ప్లాన్ తో రోజుకు 500mb డేటా చొప్పున 28 రోజుల పాటు పొందవచ్చు . డేటా తో పాటు రోజువారి అన్లీమిటెడ్ కాల్స్ మరియు 300 ఎస్ఎమ్ఎస్ లు ఫ్రీ గా పొందవచ్చు .

రూ. 49 ప్లాన్ :
ఈ రూ.49 ప్లాన్ తో జియో ఫోన్ యూజర్లు నెలకు 1 జిబి డేటాను మాత్రమే పొందవచ్చు. అలాగే రోజు వారి అన్లీమిటెడ్ కాల్స్ మరియు 50 ఎస్ఎమ్ఎస్ లు ఫ్రీగా పొందవచ్చు .

రూ. 153 ప్లాన్ :
ఈ రూ. 153 ప్లాన్ తో జియో ఫోన్ యూజర్లు రోజుకి 1.5 జిబి డేటా ను పొందవచ్చు. అలాగే రోజు వారి అన్లీమిటెడ్ కాల్స్ మరియు రోజు 100 ఎస్ఎమ్ఎస్ లు ఫ్రీగా పొందవచ్చు.

మాన్‌సూన్ హంగామా కింద స్పెషల్ జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్‌లు:
ఈ స్పెషల్ ప్లాన్ కింద రూ.594 చెల్లిస్తే, అపరిమిత వాయిస్, డేటా ప్రయోజనాలు ఆరు నెలల పాటు పొందనున్నారు.
అదనంగా మాన్‌సూన్ హంగామా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.101 విలువైన 6 జీబీ స్పెషల్ ఎక్స్చేంజ్ బోనస్ లభ్యం.
ఆరు నెలల పాటు మొత్తంగా 90 జీబీ డేటా పొందనున్నారు.


Click it and Unblock the Notifications








