Home
News

జియో డబుల్ డేటా ఆఫర్, అయితే వారికి మాత్రమేనట !

చైనా మొబైల్ దిగ్గజం షియోమి నిన్న ప్రతిష్టాత్మక నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ నోట్ 5 ప్రొలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

By Hazarath

చైనా మొబైల్ దిగ్గజం షియోమి నిన్న ప్రతిష్టాత్మక నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ నోట్ 5 ప్రొలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్లు అమ్మకానికి రానున్న నేపథ్యంలో ఈ ఫోన్లపై అప్పుడే జియో బంపరాఫర్ ప్రకటించింది. షియోమీతో భాగస్వామ్యం అయిన జియో డబుల్ డేటా ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.అలాగే రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ను కూడా అందిచనుంది.

రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 44 వోచర్ల రూపంలో..

రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 44 వోచర్ల రూపంలో..

షియోమీ రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లను కొన్నవారు వాటిల్లో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్‌లతో మై జియో యాప్‌లో రీచార్జి చేసుకుంటే వారికి రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 44 వోచర్ల రూపంలో లభిస్తుంది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తరువాత చేసుకునే రూ.198, రూ.299 రీచార్జిలపై వాడుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు.

 3 సార్లకు గాను 336 జీబీ డేటా..

3 సార్లకు గాను 336 జీబీ డేటా..

రూ.198 అంతకన్నా ఎక్కువ విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు డబుల్ మొబైల్ డేటా లభిస్తుంది. మొదటి 3 రీచార్జిలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే వినియోగదారులు రూ.198 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఒక్కోసారి 112 జీబీ డేటా చొప్పున మొత్తం 3 సార్లకు గాను 336 జీబీ డేటా వస్తుందన్నమాట.

 రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ధర

రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ధర

స్నాప్‌డ్రాగన్‌625 ప్రాసెసర్‌ కింద బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ధర

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ధర

బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.16,999 ధరలకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో ఎప్పటి నుంచి విక్రయిస్తారో షియోమీ వెల్లడించలేదు.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Reliance Jio announces Rs 2,200 cashback on the Redmi Note 5 and Note 5 Pro More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X