Home
News

అందరకి కళ్లు ఆగష్టు 12 వైపే, జియో ఆ రోజు ఏం చేయబోతోంది?

By Gizbot Bureau

రిలయన్స్ జియో గత ఏడాది సెప్టెంబర్ 1 వ తేదిన మార్కెట్ లోకి అరంగ్రేటం చేసి టెలికమ్యూనికేషన్ రంగంలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో రోజురోజుకీ తన మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. జియో రాకతో ప్రధాన టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు తమ కస్టమర్లను కోల్పోతున్నారు.

Reliance Jio 42nd Annual General Meeting 2019 Date Revealed, Here is What You Should Expect

ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో రిలయన్స్‌ మరో సంచలనానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎప్పటి నుంచో ఊరి స్తున్న 'జియో గిగా’ ఫైబర్‌ పేరుతో సూపర్‌ ఫాస్ట్‌ ఇంటర్నెట్‌ సేవలతో ఈ రంగం రూపు రేఖలను మార్చి వేసేందుకు రంగం సిద్ధం చేసింది.

 ప్రత్యేక ఆఫర్లతో పలు నగరాల్లో

ప్రత్యేక ఆఫర్లతో పలు నగరాల్లో

ఏడాది క్రితం జియో గిగా ఫైబర్‌తో భారత దేశంలోని బ్రాండ్‌ బాండ్‌తో పాటు డీటీహెచ్‌ టీవీ రంగంలో అడుగుపెట్టింది. కొన్ని ప్రత్యేక ఆఫర్లతో పలు నగరాల్లో ఉచిత సేవలు అందజేస్తోంది. టెక్నాలజీ రంగాన్ని మార్చే విధంగా గిగా ఫైబర్‌తో మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు సిద్ధం అవుతోంది. గిగా ఫైబర్‌ సేవలు భారత్‌లో సరసమైన ధరలకు లభిస్తాయన్న వార్తలు వినిపిస్తుండటంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న వారికి ఆగస్టులో కంపెనీ తీపి కబురు అందించే అవకాశం ఉంది.

 ఆగస్టు 12న ప్రకటన

ఆగస్టు 12న ప్రకటన

త్వరలో జరగబోయే రిలయన్స్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధికారికంగా ప్రకటన చేయనుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన ధరల వివరాలు కూడా వెల్లడించే అవకాశాలున్నాయి. ఆగస్టు 12 నుంచి ‘జియో గిగా' ఫైబర్‌ సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వినియోగదారులు ఏం ఆశించవచ్చనే దానిపై మాత్రం రిలయన్స్‌ ఎలాంటి సూచన ఇవ్వలేదు.

త్వరలో భారత్‌లో సేవలు

త్వరలో భారత్‌లో సేవలు

జియో నెట్‌ వర్క్‌ పరీక్ష దాదాపు పూర్తయ్యిందని, త్వరలో భారత్‌లో సేవలు అందించనుందన్న వార్తలు కొన్ని నెలల క్రితమే వినిపించాయి. జియో గిగా ఫైబర్‌తో పాటు టీవీ రంగంలో.. గిగా టీవీ లేదా జియో హోం టీవీని కూడా లాంచ్‌ చేసే అవకాశం ఉంది. అయితే టీవీ పేరును ఇంకా ఖరారు చేయలేదు. గిగా టీవీ అనేది నెలవారీగా సబ్‌స్రైబ్‌ ప్యాకేజీలో ఓ భాగం అవుతుందని, ఇందులో గిగా ఫైబర్‌, ఉచిత ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ కూడా ఉంటుందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌

అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌

జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ ఇస్తున్నట్టు సమాచారం. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను దేశ వ్యాప్తంగా అందించే ఈ ల్యాండ్‌లైన్‌ కనె క్షన్‌ ద్వారా ప్రస్తుతం సిగ్నల్‌ లేమి సమస్యకు చెక్‌పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో ప్రయోగాత్మకంగా కనెక్షన్లు ఇచ్చిన జియో గిగా ఫైబర్‌ సేవలు ఇక మధ్య తరహా పట్టణాలకూ అందనున్నాయి.

చందాదారులే లక్ష్యంగా ముందుకు

చందాదారులే లక్ష్యంగా ముందుకు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టారీఫ్‌లపై దృష్టి పెట్టడం లేదని, అత్యధిక వినియోగదారులు తనవైపు తిప్పుకునేదానిపై దృష్టిపెట్టినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ - ఐడియా కంపెనీలపై ఒత్తిడిపెం చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జియో వచ్చినప్ప టి నుంచి అన్ని టెలీకాం సంస్థల లాభాలు గణనీయంగా పడి పోయాయి. 2016, సెప్టెంబర్‌లో జియో తీసుకురావడం జరి గిందని, డేటా ప్లాన్‌లు, ఫ్రీ వాయిస్‌ కాల్స్‌, ఫ్రీ మ్యూజిక్‌, సిని మాలతో పాటు మరెన్నో సేవలు అందించడంతో 331.3 మిలి యన్‌ మంది ప్రజలు సబ్‌స్కైబర్లుగా ఉన్నారని జియో ప్రధాన వ్యూహకర్త అన్షుమాన్‌ ఠాకూర్‌ తెలిపారు.

 మూడు నెలల కాలంలో

మూడు నెలల కాలంలో

కొన్ని టెలీకాం సంస్థలు పక్కకు తప్పుకోగా, మరికొన్ని ఒకటితో ఒకటి కలిసిపోయాయని చెప్పుకొచ్చారు. జియో ద్వారా ప్రతి ఒక్కరు సగటు ఆదాయాన్ని పొందుతున్నాడు. చందాదారులు భారీగా చేరుకున్న తరువాత జియో తన టారీఫ్‌లను పెంచుతుందని అందరూ భావించారు. మూడు నెలల కాలంలో 24.5 మిలియన్‌ మంది చందాదారులుగా చేరారు. ప్రతి నెలా సగటున 11.4 గిగా బైట్ల డేటాను వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జియో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు.

Best Mobiles in India

English summary
Reliance Jio 42nd Annual General Meeting 2019 Date Revealed, Here is What You Should Expect
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X