జియో దూకుడు తగ్గేలా లేదు..

మార్చి 31, 2017కు గాను 9.28శాతం మార్కెట్ షేర్‌తో నాలుగవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ గా జియో అవతరించినట్లు ట్రాయ్ వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ముందంజలో కొనసాగుతోంది

వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ విభాగంలో జియో ముందంజలో కొనసాగుతోంది. ఈ విభాగంలో జియోకు 108.68 మిలియన్ యూజర్లు ఉండగా, ఎయిర్‌టెల్‌కు 47.04 మిలియన్లు, వొడాఫోన్‌కు 37.71 మిలియన్, ఐడియా సెల్యులార్‌కు 24.70 మిలియన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు 14.01 మిలియన్ యూజర్లు ఉన్నారు.

సెప్టంబర్ 5, 2016న అఫీషియల్‌గా లాంచ్ అయ్యాయి

మార్కెట్లో రిలయన్స్ జియో సేవలు సెప్టంబర్ 5, 2016న అఫీషియల్‌గా లాంచ్ అయ్యాయి. అప్పటి నుంచి కేవలం 170 రోజుల్లో 100 మిలియన్ యూజర్లను జియో సొంతం చేసుకోగలిగింది. ఇందుకు కారణం జియో ఆఫర్ చేసిన ఉచిత సేవలే.

ఒక్క మార్చిలోనే జియో 58.39 లక్షల కొత్త యూజర్లు

జియో 4జీ నెట్‌వర్క్‌లోకి ఒక్క మార్చి నెలలోనే 58.39 లక్షల చందాదారులు కొత్తగా చేరారు. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్‌కు 29.99 లక్షలు, ఐడియా సెల్యులార్‌కు 20.9 లక్షలు, బీఎస్ఎన్ఎల్‌కు 20.77 లక్షల కొత్త కనెక్షన్‌లు లభించాయి. దేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ గా కొనసాగుతోన్న వొడాఫోన్ ఐడియా మార్చి నెలలో కేవలం 18.34 లక్షల కొత్త కనెక్షన్ లను మాత్రమే రాబట్టగలిగింది.

GSM, CDMA & LTE

దేశవ్యాప్తంగా GSM, CDMA & LTE నెట్‌వర్క్‌లను ఉపయగించుకుంటోన్న వారి సంఖ్య ఫిబ్రవరి 2017 నాటికి 1,164.20 మిలియన్‌గా ఉండగా, మార్చి 2017 నాటికి 1,170.18 మిలియన్‌కు చేరుకుంది.

పట్టణాల్లో ఫలితాలు ఇవే..

పట్టణాల్లో వైర్‌లెస్ సబ్‌స్ర్ర్కిప్షన్‌ల సంఖ్య ఫిబ్రవరి 2017 - మార్చి 2017ల మధ్య 671.63మిలియన్ నుంచి 672.42మిలియన్‌కు పెరిగింది. ఇదే సమయంలో గ్రామీఫ ప్రాంతాల్లో 492.57మిలియన్ నుంచి 672.42 మిలియన్‌కు చేరుకుంది.

ఎయిర్‌టెల్‌కు 23.39శాతం మార్కెట్ వాటా

మార్చి 2017కు గాను సునిల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్ 23.39శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోగలిగింది. ఇదే సమయంలో వొడాఫోన్ 17.87 శాతం, ఐడియా సెల్యులార్ 16.70శాతం, రిలయన్స్ జియో 9.29 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Becomes India’s Number Four Telecom Operator with 9.29 Percent Market Share. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot