జియోని ఢీకొట్టే టెలికం ఇప్పట్లో కష్టమే, మళ్లీ నంబర్ వన్

By Gizbot Bureau
|

రిలయన్స్ జియో రెవెన్యూ, చందాదారుల సంఖ్య ప్రకారం అతిపెద్ద టెలికాం ప్లేయర్‌గా మారిందని ఇండియా రేటింగ్స్ సోమవారం తెలిపింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చందాదారుల సముపార్జనలో దూకుడుగా ఉంది. వైర్‌లెస్ చందాదారుల మార్కెట్ వాటా, బ్రాడ్ బ్యాండ్ చందాదారుల వాటా సంఖ్య పరంగా అలాగే రాబడి పరంగా అతి పెద్ద మార్కెట్ గా నిలిచింది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ చందాదారుల మార్కెట్ వాటా గత రెండేళ్లుగా క్షీణించడంతో రిలయన్స్ జియోకి పెరిగింది.

జియో చందాదారుల సంఖ్య

జియో చందాదారుల సంఖ్య

ఇదిలా ఉంటే దేశ మొబైల్స్, డేటా వినియోగంలో విప్లవం తెచ్చింది రిలయెన్స్ జియో. బేసిక్ 4జీ ఫోన్ తో పాటు డేటా ఛార్జీలను కూడా అందరికీ అందుబాటులోకి తేవడంతో సబ్ స్కైబర్ల సంఖ్యలో నెంబర్ వన్ స్థానానికి చేరింది. దీంతో దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్‌ జియో అవతరించిందని ట్రాయ్ తెలిపింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజా నివేదిక ప్రకారం 2019 నవంబర్‌ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది.

రెండవస్థానంలో..

రెండవస్థానంలో..

రెండవస్థానాన్ని 33.62 కోట్ల చందాదారులతో వొడాఫోన్‌ ఐడియా దక్కించుకున్నాయి. ఇక భారతీ ఎయిర్ టెల్ 32.73 కోట్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్‌ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు తగ్గడం విశేషం. అదే విధంగా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కస్టమర్లు కూడా భారీగా పెరిగారు.

తొలిసారి హర్యానాలో
 

తొలిసారి హర్యానాలో

అక్టోబర్ 2019 నాటికి 461.73 మిలియన్ల మంది ఎంఎన్ పీకి అప్లయ్ చేస్తే ఆ సంఖ్య నవంబర్ నాటికి 466.62 మిలియన్లకు పెరిగింది. దేశవ్యాప్తంగా తొలిసారి హర్యానాలో నవంబర్ 25, 2010న ఎంఎన్ పీని అమలు చేశారు. తర్వాత 2011 జనవరి 20 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచే ఎంఎన్ పీ వినతులు ఎక్కువగా వచ్చాయి. అక్టోబర్ 2019లో 38.90 మిలియన్లు కాగా, అది నవంబర్ 2019 నాటికి 39.28 కి పెరిగాయి. వైర్ లైన్ సబ్ స్క్రయిబర్ల సంఖ్య ప్రభుత్వ రంగ సంస్థలకు 61 శాతం వుంటే ప్రైవేటు ఆపరేటర్ల వాటా 39శాతంగా వుంది.

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌

ఇటీవల రిలయెన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్‌ని సవరించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని ప్రకటించింది. రోజూ 1.5 జీబీ డేటా అందించేందుకు జియో నుంచి రూ.199, రూ.399, రూ.555, రూ.2,020 రీఛార్జ్ ప్లాన్స్, రోజూ 2 జీబీ డేటా అందించేందుకు రూ.249, రూ.444, రూ.599 ప్లాన్స్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio Becomes Largest Telecom Operator In Terms Of Revenue And Subscribers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X